నిర్వాసితులు ప్రవాసము నుండి తిరిగి రాక దేవాలయ పునర్నిర్మాణము

నిర్వాసితులు తిరిగివచ్చుట

1 1. పారశీకదేశరాజైన కోరెషు ఏలుబడి మొది యేట ప్రభువు ఆ రాజు అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖితరూపమైన చట్టమును జారీచేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధ ముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే యిర్మియా ద్వారా పలికినపలుకు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను.

2. ”పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞ ఇది. ఆకాశ మందలి దేవుడు నన్ను ఈభూలోకమంతికిని అధిపతిని చేసెను.ఆయనయూదారాజ్యమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని ఆజ్ఞను ఇచ్చెను. 3. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికిని ఆయన బాసటయైయుండునుగాక! ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరును యెరూషలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు.

4. మీ మధ్య నివసించువారు యూదా దేశమందున్న యెరూషలేము నకు పోవువారికి స్వేచ్చార్పణగాక, వెండి బంగార ములను, వస్తుసామాగ్రిని, పశుగణమును, యెరూషలేము దేవాలయము నిర్మించుటకు సహాయము చేయవల యును.”

5. అపుడు యూదా బెన్యామీను తెగల అధిపతు లును, యాజకులును, లేవీయులును, ప్రభువువలన ప్రేరేపింపబడిన వారందరును ప్రభుమందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేమునకు వెళ్ళుటకు సంసి ద్ధులైరి.

6.ఇరుగుపొరుగువారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తుసామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు ఇచ్చివారికి సహాయము చేసిరి.

7.మునుపు నెబుకద్నెసరురాజు యెరూషలేము నుండి కొనివచ్చి తన దేవళమున అర్పించిన పాత్ర లను గూడ కోరెషురాజు ఆ భక్తులకు తిరిగి ఇచ్చి వేసెను.

8. రాజు పాత్రములను తన కోశాధికారియైన మిత్రెదాతుకు ఈయగా, అతడు వానినన్నిని లెక్కిడి యూదాపాలకుడగు షేష్బస్సరునకు ఒప్పచెప్పెను. 

9-10. ఆ లెక్కల వైనమిది:

బంగారుపాత్రలు-30

వెండి పాత్రలు-1000

ధూపపాత్రలు-29

పానీయార్పణమునకువాడు బంగారుపాత్రలు-30

పానీయార్పణమునకువాడు వెండిపాత్రలు-410

ఇతర పాత్రలు-1000 

11. ఇవి మొత్తము కలిపి 5,400 వెండి, బంగారు పాత్రలు. షేష్బస్సరు, ఇతర భక్తులు బబులోనియా ప్రవాసమునుండి యెరూషలేమునకు తిరిగివచ్చినప్పుడు ఈ పాత్రములన్నింని తమతో కొనివచ్చిరి.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము