గ్రంథారంభము

1 1.ముప్పదియవయేడు, నాలుగవనెల, ఐదవ దినమున నేను కెబారునది చెంత ప్రవాసులమధ్య  వసించుచుండగా  ఆకాశము విచ్చుకొనెను. నాకు దైవ దర్శనము కలిగెను.

2. అది యెహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయినపిదప ఐదవయేడు ఆ నెల ఐదవదినము.

3. బబులోనియాలోని కెబారు నదిఒడ్డున బూసి కుమారుడును, యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రభువువాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభువుహస్తము అతని మీదికి వచ్చెను.

ప్రభువు సింహాసనమును గూర్చిన దర్శనము

4. నేను కనులెత్తిచూడగా ఉత్తరదిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము గుండ్ర ముగా దానినావరించి మెరుపులు మెరయుచుండెను. దానిచుట్టును ఆకాశము మిరుమిట్లు గొలుపుచుండెను. ఆ మెరుపులమధ్య ఏదో కంచువలె మెరయుచు అగ్ని కాంతులు విరజిమ్ముచుండెను.

5. తుఫాను మధ్యలో నాలుగుజీవుల రూపములు గల ఒకి కనిపించెను. అవి మానవాకృతిలో నుండెను.

6. వానిలో ప్రతిదానికి నాలుగుముఖములు, నాలుగు రెక్కలుండెను.

7. వాని కాళ్ళు నిలువుగానుండి ఎద్దులకువలె గిట్టలు కలిగి ఉండెను. ఈ జీవులు మెరుగుప్టిెన కంచువలె తళతళలాడుచుండెను.

8. వాని నాలుగు పక్కల నున్న నాలుగు రెక్కలక్రింద మానవహస్తముల విం హస్తములుండెను. నాలుగికిని ముఖములును, రెక్కలును కలవు. ఒక్కొక్కరెక్క క్రింద ఒక్కొక్కచేయి యుండెను.

9. అవి రెక్కలు విప్పగా వాని అంచులు ఒకదానికొకి తగులునట్లుండెను. అవి తమ దేహములను ఏ వైపునకు త్రిప్పకయే ముందునకు కదలిపోవుచుండెను.

10. ఆ జీవులలో ప్రతిదానికి నాలుగు ముఖము లుండెను. ముందట మనుష్యముఖము, కుడిప్రక్కన సింహముఖము, ఎడమప్రక్కన వృషభముఖము, వెనుక ప్రక్కన గరుడముఖమునుండెను.

11. ప్రతిప్రాణి రెక్కలలోను రెండు పైకిలేచి ఇతర ప్రాణిరెక్కలకు తగులుచుండెను. రెండు రెక్కలు ముడుచుకొనియుండి తన స్వీయదేహమును కప్పుచుండెను.

12. ఆ జీవులన్ని సూిగా ముందునకు పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఎటువైపునకు పోవునో ఆ వైపునకే పోవుచుండెను.

13. ఈ జీవులమధ్య జ్వలించుచున్న దివిీవిం దేదో కనిపించెను. అది నిత్యము చలించుచుండెను. నిప్పుమంటలు లేచి మెరుపులను విరజిమ్ముచుండెను.

14. ఆ జీవులు మెరుపు తీగలవలె ముందువెనకలకు పరుగిడుచుండెను.

15. నేను ఈ ప్రాణులవైపు చూచుచుండగా నాలుగు చక్రములు నేలను తాకుచు కనిపించెను. ఒక్కొక్కి ఒక్కొక్క ప్రాణి ప్రక్కన నేలను తాకుచుండెను.

16. నాలుగుచక్రములు ఒకేరీతిగానుండి పసుపు వన్నె గోమేధికమువలె మెరయుచుండెను. ప్రతిచక్రము, మరియొక చక్రములో ఇమిడియున్నట్లుగా వాని నిర్మా ణము ఉండెను.

17. అవి ప్రక్కకు తిరుగకయే నాలుగుదిక్కులలో ఏ దిక్కునకైనను పోగలిగియుండెను.

18. ఆ నాలుగు చక్రములు ఆశ్చర్యము గొలిపెడి నిడివికలిగి, వాని వలయములు చుట్టు కన్నులతో నిండియుండెను.

19. ఆ ప్రాణులు కదలినప్పుడు చక్రములుకూడ కదలెను. అవి నేలనుండి పైకిలేచినప్పుడు చక్రము లును లేచెను. 20. ఆ ప్రాణులు తమ ఆత్మ ఎచికి పోవునో అచికే పోవుచుండెను. ఆ జీవులకున్న ఆత్మయే చక్రములకు ఉండెను గనుక చక్రములు కూడ వానిని అనుసరించుచుండెను. ఆ జీవులే వానిని నడిపించుచుండెను.

21. కనుక ఆ జీవులు కదలినను, ఆగినను, పైకిలేచినను, చక్రములును అట్లే చేయు చుండెను.

22. ఆ ప్రాణుల తలపై గోళాకారపు ఆకాశ విశాలమండలము విందేదోయుండెను. అది స్ఫి కమువలె మెరయుచుండెను.

23. ఆ మండలము క్రింద ఆ ప్రాణులు నిలిచియుండెను. అవి ఒక్కొక్కి రెండు రెక్కలను తన ప్రక్కనున్న ప్రాణులవైపు విప్పి యుంచెను. రెండు రెక్కలతో తమ దేహమును కప్పు కొనుచుండెను.

24. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయునాదము నా చెవినబడెను. అది సముద్రపు ఘోషవలెను, మహాసైన్యపు నాదమువలెను, సర్వశక్తి మంతుడైన ప్రభువు ధ్వానమువలెను ఉండెను. అవి ఎగురక నిలబడినపుడు రెక్కలను మూసికొనుచుండెను.

25. అటుల మూసికొని నిలబడినపుడెల్ల వాని తలల మీది గుండ్రని మండలమునుండి నాదము విన్పించు చునే ఉండెను.

26. వాని తలలపైనున్న విశాలమండలము మీద నీలమణికాంత సింహాసనము విందేదో కని పించెను. ఆ సింహాసనముపై నరాకృతి  కలిగిన  జీవి యొకడు కూర్చుండియుండెను.

27. అతడు కంచు వలె మెరయుచుండెను. అతని నడుమునకు పై భాగమును, క్రింది భాగమునుకూడ అగ్నిమయమై యుండెను. అతని చుట్టును కాంతి మిరుమిట్లుగొలుపు చుండెను.

28. అది వానరోజున కన్పించు రంగుల విల్లువలెనుండెను. ఆ కాంతి ప్రభువుతేజస్సువలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోరగిలబడితిని. అపుడు నేనొక స్వరమును వింని.