24 1.      నీవు దుష్టులనుచూచి అసూయ చెందవలదు

                              వారితో చెలిమి చేయవలదు.

2.           హింసకు పాల్పడవలెననియే వారి కోరికలు.

               దుష్కార్యములకు పూనుకోవలెననియే

               వారి పలుకులు.

3.           ఇల్లు కట్టవలెనన్న విజ్ఞానము అవసరము.

               పునాదులెత్తవలెనన్న వివేకము ఉండవలెను.

4.           ఇంి గదులను అరుదైన ప్రశస్త వస్తువులతో

               నింపవలెనన్న తెలివితేటలు ఉండవలెను.

5.           బలాఢ్యునికంటె జ్ఞాని మేలు.

               సత్తువకంటె తెలివి మిన్న.

6.           మంచియత్నమువలన యుద్ధము గెలువవచ్చును.

               మంచిసలహావలన విజయము సిద్ధించును.

7.            విజ్ఞాన వాక్యములను మూర్ఖుడు

               అర్ధము చేసికోలేడు.

               అతడు సభలో నోరువిప్పి మ్లాడలేడు.

8.           చెడును చేయుటకు పథకము వేయువానిని

               వంచకాగ్రేసరుడు అందురు.

9.           మూర్ఖుడు పాపకార్యములుతప్ప

               మరేమియు తలపెట్టడు.

               ఇతరులను అపహసించువానిని

               ప్రజలు అహ్యించు కొందురు.

10.         ఆపదలో ధైర్యము కోల్పోవువాడు  

               నిజముగా దుర్బలుడే.

11.           అన్యాయముగా మరణశిక్షను పొందినవానిని

               విడిపించుటకు,

               వధకు కొనిపోవు వారిని రక్షించుటకు

               యత్నము చేయకుము.

12.          అతడెవరో నాకు తెలియదని

               నీవు పలుకవచ్చును.

               కాని హృదయజ్ఞానియైన దేవుడు

               నీ మనసును కనిపెట్టకపోడు.

               ఆయన నిన్ను పరిశీలించిచూచును, నిన్నెరుగును.

               నీ కార్యములనుబ్టియే

               ఆయన నిన్ను బహూకరించును.

13-14. కుమారా! తేనెను భుజింపుము.

               అది తీయగానుండును.

               మధుకోశమునుండి చిమ్ము తేనె

               నాలుకకు రుచించినట్లే విజ్ఞానముకూడ

               హృదయమునకు ఇంపుగానుండును.

               దానిని బడయుదువేని

               నీ భవిష్యత్తు బంగారుబాట అగును.

15.          సజ్జనుని ఇల్లు దోచుకొనుటకై పొంచియుండు

               దుర్మార్గునివలె నీవు ప్రవర్తింపవలదు.

16. మంచివాడెన్నిసార్లు పడినా మరల పైకిలేచును.

               కాని దుర్మార్గుడు ఆపద వచ్చినపుడు

               సర్వనాశనమగును.

17. నీ శత్రువు పడిపోయినపుడు

               నీవు సంతసింపవలదు.

               అతడు కూలిపోయినపుడు నీవు  పొంగిపోవలదు.

18. శత్రుపరాభవమునకు సంతసింతువేని

               ప్రభువు నిన్ను మెచ్చుకొనడు.

               అతడు నీ శత్రువును

               దండింపక వదలివేయవచ్చును గూడ.

19.          దుష్టులనుచూచి సహనము కోల్పోవలదు.

               దుర్మార్గులనుచూచి అసూయ చెందవలదు.

20. దుష్టునికి మంచిరోజులు లేవు.

               అతని దీపము గుప్పున ఆరిపోవును.

21. కుమారా! దేవునిపట్ల, రాజు పట్ల

               భయభక్తులు అలవరచుకొనుము. 

               వారిద్దరిని ధిక్కరించరాదు.

22. అి్టవారు క్షణములో నాశనమగుదురు.

               దేవుడు, రాజు తమ విరోధులను

               సర్వనాశనము చేయుదురు.

4. విజ్ఞుల సూక్తులు

రెండవ సంకలనము

23.        ఈ క్రింది వాక్కులు కూడ విజ్ఞుల సూక్తులే:

               న్యాయాధిపతికి పక్షపాతము తగదు.

24.  దోషిని నిర్దోషినిగా ప్రకించినచో

               ఎల్లరును అతనిని అసహ్యించుకొందురు.

25.        కాని దుష్టులను శిక్షించు న్యాయాధిపతులు

               అభ్యుదయమును, దీవెనలను బడయుదురు.

26.        సత్యము చెప్పుట

               స్నేహమును పాించితిమనుటకు గుర్తు.

27.         మొదట నీ పొలములను సిద్ధము చేసికొని

               వానినుండి జీవనాధారము బడయుము.

               అటుపిమ్మట ఇల్లు కట్టుకొని కాపురముండుము.

28.        తేలికగా తోడివానికి వ్యతిరేకముగా

               సాక్ష్యము పలుకవద్దు.

               అతనినిగూర్చి అపార్థము కలుగునట్లు

               మ్లాడవలదు.

29.        అతడు నాయెడల ప్రవర్తించినట్లే

               నేను వానియెడల ప్రవర్తింతును.

               వానికి తగిన శాస్తి చేసెదనని పలుకవలదు.

30.        సోమరిపోతు, మూర్ఖుడైన

               ఒకానొక నరుని పొలము ప్రక్కగాను,

               ద్రాక్షతోట ప్రక్కగాను నేను  నడచివెళ్ళితిని.

31.          ఆ పొలమునిండ ముండ్లు, కలుపు

               ఎదిగియుండెను

               దానిచుట్టునున్న రాతిగోడ కూలిపోయెను.

32.        నేను ఆ పొలమును చూచి

               ఆలోచింప మొదలిడితిని.

               ఆ పొలము వైపు చూడగా 

               నాకు ఈ  గుణపాఠము త్టినది.

33.        కొంచెముసేపు నిద్రింపుము,

               కొంచెముసేపు కునికిపాట్లు పడుము,

               కొంచెముసేపు చేతులు ముడుచుకొని

               విశ్రాంతి తీసికొనుము.

34.         ఈ మధ్యలో దారిద్య్రము దొంగవలెను,

               సాయుధుడైన దోపిడికానివలెను వచ్చి

               నీ మీద పడును.