యెహోషువ తుదిపలుకులు

23 1. ప్రభువు చుట్టుపట్లనున్న శత్రువుల వలన యిస్రాయేలీయులకు ఏ బాధ లేకుండ చేసిన పిదప చాలకాలమునకు యెహోషువ యేండ్లు గడచి వృద్ధు డయ్యెను.

2. అతడు యిస్రాయేలు ప్రజలను, వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, ముఖ్యు లను పిలిపించి ”నేను యేండ్లుచెల్లిన ముదుసలిని.

3. ఈ శత్రుజాతులన్నిని యావే ఎట్లు అణగద్రొక్కెనో మీరు కన్నులారచూచిరి. మీ దేవుడైన యావే స్వయ ముగా మీ పక్షమున యుద్ధము చేసెను.

4. నేను ఈ జాతులనన్నిని రూపుమాపి వారి భూములను మీ తెగలకు వారసత్వభూములుగా పంచియిచ్చితిని. అటు యోర్దానునకు, ఇటు పడమి మహాసముద్రమునకు మధ్యనున్న జాతులనన్నిని రూపుమాపితిని.

5. మీ దేవుడైన యావే స్వయముగా వారిని తరిమివేసెను. ఆ ప్రభువు వారిని తరిమివేయగా మీరు వారి భూములను ఆక్రమించుకొింరి.

అన్యజాతులతో సంబంధము తగదు

6. అందుకని మోషే ధర్మశాస్త్రమున వ్రాయబడిన నియమములన్నిని శ్రద్ధతో పాింపుడు. మీరు ఆ నియమముల నుండి కుడికిగాని, ఎడమకుగాని తొలగి పోకుండ వాిని దృఢసంకల్పముతో పాింపుడు.

7. మీ చెంత జీవించుచున్న అన్యజాతులతో కలసి పోవ లదు. వారిదేవతల పేరులను ఉచ్ఛరింపకుడు. వారి పేరు మీదుగా ప్రమాణము చేయకుడు. వారిని సేవింపకుడు. పూజింపకుడు.

8. ఇప్పివరకు వలెనే ఇకమీదట గూడ మీ దేవుడైన యావేను అంి పెట్టు కొనియుండుడు.

9. కనుకనే ప్రభువు మహాబలముగల పెద్దజాతులను మీ ఎదుినుండి వెడలగొట్టెను. నేివరకు మిమ్మెవడైన ఎదిరించి నిలిచెనా?

10. మీలో ఒక్కొక్కడు వారిలో వేయిమందిని పారద్రోల గలడు. ఏలయనగా, ప్రభువు వాగ్ధానము చేసినట్లు స్వయముగా తానే మన పక్షమున పోరాడెను.

11. కనుక ప్రభువును పరిపూర్ణహృదయముతో సేవింపుడు.

12-13. కాని మీరు ఈ నియమములను పాింపరేని, మీతో వసించు ఈ అన్యజాతీయులతో కలసిపోయెదరేని, వారితో వియ్యములు అందుకొని సఖ్యతసంబంధములు పెంపొందించుకొందురేని, ప్రభువు వారిని మీ చెంతనుండి వెడలగొట్టడు. పైగా వారు, మీరు చిక్కుకొను వలలుగాను, కూలిపోవు గోతులుగాను పరిణమింతురు. యావే మీకు ప్రసా దించిన ఈ మంచినేలనుండి మీరందరు అడపొడకాన రాకుండ పోవువరకు మిమ్ము మోదు కొరడాలుగాను, మీ కన్నులను బాధించు ముండ్లుగాను పరిణమింతురు.

14. నా మట్టుకు నేను జీవితయాత్ర చాలించు టకు సిద్ధముగానున్నాను. యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్ధానములలో ఒక్కియు తప్పిపోలేదని పూర్ణాత్మతోను, పూర్ణహృదయముతోను విశ్వసింపుడు. ఆ వాగ్ధానములన్నియు నెరవేరినవి.

15. కాని యావే మీకు మంచిని చేకూర్చెదనని చేసిన వాగ్ధానములన్నియు నెరవేరినట్లే, అతడు మీకు కీడు చేయుదునని పలికిన పలుకులును నెరవేరును. దేవుడు మీకిచ్చిన ఈ మంచినేల మీదినుండి మిమ్ము గిెం వేయుటయు నిక్కము.

16. ప్రభువు మీతో చేసికొనిన నిబంధనను మీరు మీరెదరేని, అన్యదైవములను పూజింతురేని, అతని కోపము మీపై రగుల్కొనును. అపుడు ప్రభువు మీకిచ్చిన ఈ మంచినేల నుండి మీరును అడపొడ కానరాకుండ నాశనమైపోవుదురు.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము