యూదులకు భద్రత సిద్ధించుట
15(16) 1. ఆ లేఖలలోని వృత్తాంతమిది: ”హిందూదేశమునుండి కూషు వరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్ధానముల పాలకులకును, విశ్వాసపాత్రులైన ప్రజలకును శుభములు పలికి మహాప్రభువు అహష్వేరోషు వ్రాయునది.
2. ఉప కారులనుండి పెక్కుమారులు భూరిదానములను స్వీకరించుటవలన చాలమందికి పొగరెక్కును.
3. ఇి్ట పొగరుబోతులు మా ప్రజలకు కీడు తలపెట్టుటయేగాక తమకు లభించిన ఐశ్వర్యమును నిబ్బరముగా నిలుపు కోజాలక తమ్ము సంపన్నులను జేసిన ఆ ఉపకారు లమీద గూడ కుట్రలు పన్నుచున్నారు.
4. ఇి్టవారిలో కృతజ్ఞతాభావము లేశమైనను ఉండదు. వారు మంచి యనునది యెరుగని నీచుల పొగడ్తలకు ఉబ్చిపోవు దురు. పైగా వారు దుష్టకార్యములను ఏవగించు కొనువాడును, సర్వసాక్షియైన ప్రభువు శిక్షను తప్పించుకోగలమని ఎంచెదరు.
5. రాజులు తమ స్నేహితులైన వారిని నమ్మి వారికి రాజ్యాధికారమును ఒప్పజెప్పగా వారు వంచనతో నిరపరాధుల రక్తము నొలికించిరి. ఆ రాజులను గూడ పాపమున భాగ స్వాములను చేసి, తీరనినష్టములు తెచ్చిప్టిెరి.
6. ఆ దుష్టులు మోసపు ఆలోచనలతో హితబుద్ధులైన తమ పాలకులను పెడత్రోవ ప్టించిరి.
7. ఈ సత్య మును నిరూపింపవలెనన్న పూర్వచరిత్రలేమియు పరిశీలింప అక్కరలేదు. అయోగ్యులైన అధికారులు మా కన్నులయెదుటనే చేసిన దుష్టకార్యములు పరి కించిన చాలును.
8. ఇకమీదట మేము, మా సామ్రా జ్యములోని ప్రజలందరికి శాంతిభద్రతలు చేకూర్చ కోరెదము.
9. అందులకుగాను మేము క్రొత్త విధాన మును అవలంబింతుము. ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలనెల్ల న్యాయసమ్మతముగా పరిష్కరింతుము.
10. హమ్మెదాతా కుమారుడును మాసిడోనీ యుడైన ఈ హామానునే చూడుడు. అతని దేహములో పారశీకరక్తము ఒక్క బొట్టయిన లేదు. అసలతడు మా దయకు పాత్రుడేకాదు. అయినను అతడు మా ఆశ్రయమును పొందెను.
11. మేమును అన్ని జాతుల ప్రజలకువలెనే అతనికిని ఉపకారము చేసితిమి. అతని కిని మా ఆస్థానమున ప్రధాన అధికారిగా నియమించి తిమి. అతడు మా దేశమున, మా తరువాత మాయంత ివాడని గుర్తించి అందరును అన్నివేళల అతనికి నమస్కారములు చేయుచువచ్చిరి.
12. కాని హామాను గర్వముతో పొంగిపోయి మా రాజ్యమును, మా ప్రాణ మును గూడ అపహరింపజొచ్చెను. 13. పైగా అతడు మమ్ము రక్షించిన శాశ్వతోపకారి మొర్దెకయిని, నిర్దోషి మా రాణి ఎస్తేరును, యూదాజాతినంతిని మోస ముతోను, కుట్రతోను నాశనము చేయచూచెను.
14. ఇట్లు చేసినచో మా బలము ఉడిగిపోవుననియు, అప్పుడు మా పారశీక సామ్రాజ్యమును మాసిడోనీ యుల వశము చేయవచ్చుననియు అతని తలపు.
15. కాని పరమదుర్మార్గుడైన ఈ హామాను తుదమ్టుింపజూచిన యూదులు అసలు దోషులే కాదనియు, వారు న్యాయసమ్మతములైన చట్టముల ప్రకారము జీవించువారనియు మేము తెలిసికొింమి.
16. వారు సజీవుడు, మహాబలసంపన్నుడు, మహోన్న తుడైన దేవుని కుమారులు. ఆ ప్రభువు చలువవలన మేమును, మా పూర్వులును ఈ రాజ్యమును వృద్ధి లోనికి తీసికొనిరాగలితిమి.
17. కనుక మీరు హమ్మె దాతా కుమారుడగు హామాను పంపిన తాకీదులను అమలు జరిపింపవలదు.
18. ఈ కుట్రపన్నినందు లకు మేము అతనిని, అతని కుటుంబమును షూషను దుర్గద్వారము చెంత ఉరివేయించితిమి. సర్వమును పరిపాలించు దేవుడే సకాలమున అతనికి ఈ ఉచితశిక్ష విధించెను.
19. కనుక మీరు ఈ లేఖను ఎల్లెడల ప్రకటనచేయుడు. యూదులను వారి విధుల ప్రకా రము జీవింపనిండు. 20. వారిని శిక్షించుటకు నిర్దే శింపబడిన దినమున, అనగా అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినమున, ఎవరైన వారిమీద కత్తి దూసినచో, మీరు వారిని నిలువరింపుడు.
21. సర్వశక్తి మంతుడైన దేవుడు ఆ రోజును యూదులకు సంతోష దినముగా నిర్ణయించెనుగాని వినాశదినముగా నిర్ణ యింపలేదు.
22. యూదులారా! మీ తరపున మీరు ఈ దినమును మీ ఉత్సవములన్నిలో మహోత్సవ ముగా జరుపుకొనుడు. 23. ఇకమీదట మీరును, సహృదయులగు పారశీకులును కూడ ఈ దినమును రక్షణదినముగా స్మరించుకొందురుగాక!
24. ఈ ఆజ్ఞలను పాింపని పట్టణములును, రాష్ట్రములును మా క్రోధాగ్నికి ఎరయై, ఖడ్గము వలనను, అగ్ని వలనను నాశనమగునుగాక! అవి జననివాసయోగ్య ములు కాకుండునుగాక! ఆకాశపకక్షులు, వన్యమృగ ములుకూడ ఏనాడును వాని దరిదాపులకైనను రాకుండునుగాక!”