బెతూలియా ముట్టడి యిస్రాయేలీయులపై దాడి
7 1-2. మరునాడు హోలోఫెర్నెసు తన సొంత సైన్యమును, తనతో వచ్చిన అన్యజాతుల సైన్యములను సమావేశపరచెను. అది లక్ష డెబ్బదివేల కాలిబంటు లతోను, పండ్రెండువేల రౌతులతోను కూడిన మహా సైన్యము. వీరుగాక సామానులు మోసికొనివచ్చు సామాన్య జనులునుగలరు. అతడా సైన్యములను బెతూలియా మీదికి దాడి చేయవలెననియు, కొండలలోని కను మలను ఆక్రమించుకోవలెను అనియు, యిస్రాయేలీ యులతో పోరు ప్రారంభింపవలెననియు ఆజ్ఞాపించెను.
3. కనుక ఆ సేనలు కదలిపోయి బెతూలియా చెంత గల లోయలోని నీిబుగ్గలవద్ద గుడారములు పన్నెను. ఆ శిబిరము చాల పెద్దది కనుక దాని వెడల్పు దోతాను నుండి బెల్బాయీము వరకు వ్యాపించియుండెను. దానిపొడవు బెతూలియానుండి ఎస్డ్రలోను ఎదుటనున్న సియామోను వరకు విస్తరించియుండెను.
4. యిస్రా యేలీయులు ఆ మహా సైన్యమును చూచి భయపడిరి. ”ఈ సైన్యము ఈ ప్రదేశమునంతిని ఊడ్చివేయును. ఎత్తయిన శిఖరములు, లోయలు, కొండలన్నిని కలిపి నను వీరి బరువును భరింపజాలవు” అని అనుకొనిరి.
5. అట్లు భయపడినప్పికీ వారెల్లరును తమ ఆయు ధములను చేప్టిరి. తమ బురుజులమీద సంజ్ఞా దీపములను వెలిగించి రేయెల్ల కావలికాసిరి.
6. రెండవనాడు హోలోఫెర్నెసు తన అశ్వబల మును బెతూలియా పౌరులెల్లరు చూచునట్లు ఆ నగర ముచెంతకు కొనిపోయెను.
7. అతడు ఆ పట్టణ మునకుపోవు దారులను ఆ నగరమునకు నీిని సరఫరాచేయు జలధారలను పరిశీలించెను. ఆ నీి ఊటల చెంత తన సైన్యములను కాపు ప్టిె తాను శిబిరమునకు తిరిగివచ్చెను.
8. అప్పుడు ఎదోము నాయకులు, మోవాబు దొరలు, సముద్ర ప్రాంతము లవారి సైన్యాధిపతులు హోలోఫెర్నెసు చెంతకొచ్చి అతనితో, 9. ”అయ్యా! నీవు మా మాట పాింతువేని నీ సైన్యములకు ముప్పు తప్పును.
10. యిస్రాయేలీ యులు తమ ఆయుధముల మీదకాక తాము వసించు పర్వతముల ఎత్తుమీద ఆధారపడి ఉందురు. ఈ కొండలను ఎక్కుట మనకు సాధ్యముకాదు.
11. కనుక తమరు వారిని ఈ కొండలలో నేరుగా ఎదిరింపరాదు. ఈ నియమమును పాించిన మన సైన్యమున ఒక్క డును చావడు.
12. ఏలినవారును, మన సైనికులును విడిదిపట్టుననే ఉండవలెను. మన సైనికులు మాత్రము పర్వతపాదముననున్న జలధారలను ఆక్రమించు కోవలెను.
13. బెతూలియా నగరవాసులకు నీిని సరఫరా చేయునది ఈ బుగ్గలే. ఆ ప్రజలకు నీరు దొరకదేని దప్పికకు ఓర్వజాలక తమ నగరమును నీ వశము చేయుదురు. ఈ మధ్యలో మేము సైన్యము లతో పోయి ఈ చుట్టుపట్లనున్న కొండలమీద డేరాలు పన్ని ఈ జనులు నగరము వీడిపోకుండునట్లు జాగ్రత్త పడెదము.
14. ఈ పట్టణములోని ప్రజలెల్లరు-పురు షులు, స్త్రీలు, పిల్లలు ఆకలితో చత్తురు. మన కత్తికి బలికాకపూర్వమే వీరెల్లరు చచ్చి నగరవీధులలో కుప్ప లుగా పడియుందురు.
15. నిన్ను ఆశ్రయింపక, నీకు ఎదురు తిరిగినందుకుగాను వీరు ఈ రీతిగా తగిన శిక్షను అనుభవింతురు” అని చెప్పిరి.
16. హోలోఫెర్నెసుకును, అతని అధికారులకును ఈ పన్నాగము నచ్చెను. కనుక అతడు ఈ సలహా పాింపనెంచెను.
17. వెంటనే మోవాబీయులు ఐదు వేలమంది, అస్సిరియా సైనికులు లోయలోనికి వెడలి పోయి పట్టణమునకు నీిని సరఫరాచేయు జలధార లను ఆక్రమించిరి.
18. ఎదోమీయులు, అమ్మోనీ యులు కొండలలోనికెళ్ళి దోతాను కెదురుగా శిబిరము పన్నిరి. వారు తమ సైనికులను కొందరిని మొక్మురు వాగు చెంతగల కూసి చేరువలోనున్న అక్రిబాకు పంపిరి. ఈ తావు బెతూలియాకు తూర్పు, దక్షిణ దిశలందు కలదు. మిగిలిన అస్సిరియా సైనికులులోయలోని మైదానముననే శిబిరము పన్ని ఆ ప్రాంతమంతట వ్యాపించిరి. అంతి మహాసైన్యమునకు కావలసిన గుడారములు ఇతర పరికరములు చాలస్థలమును ఆక్రమించుకొనెను.
19. అపుడు యిస్రాయేలీయులు తమ దేవునికి మొరప్టిెరి. శత్రువులు చుట్టుముట్టగా తప్పించుకొను మార్గము లేనందున మిగుల నిరుత్సాహము చెందిరి.
20. అస్సిరియా సైన్యము వారి కాలిబంటులతో, రథ ములతో, అశ్వములతోను బెతూలియాను ముప్పది నాలుగునాళ్ళ వరకు చుట్టుముట్టెను. అంతలో పట్టణ మున నీరు అయిపోయెను.
21. వారి నీితొట్లు ఖాళీ అయ్యెను. మంచినీళ్ళను కొలిచి ఇచ్చిరి కనుక అవి ఏరోజున ఎవరికినీ సరిపోవయ్యెను. 22. వారి పసి కందులు, స్త్రీలు, బాలబాలికలు నీరు చాలక కృశించి పోయిరి. సత్తువలేక వీధులలో,నగరద్వారముల చెంతను సొమ్మసిల్లి పడిపోయిరి.
23. పట్టణములోని ప్రజలెల్లరు-పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉజ్జీయాను పట్టణాధికారులను చుట్టు మ్టుి పెద్దగా అరచిరి. వారు నగరపెద్దలు విను చుండగా ఇట్లనిరి: 24. ”మీరు మాకు ఇి్టపని చేసి నందుకు దేవుడు మిమ్ము తప్పక శిక్షించును. మీరు అస్సిరియనులతో రాజీ కుదుర్చుకొనక మాకు కీడు తెచ్చిప్టిెరి. 25. ఇప్పుడు మనకు సాయము చేయు వారెవరు? దేవుడు మనలను వారి చేతికి అప్ప గించెను. మేమెల్లరము దప్పికచే చచ్చుచున్నాము. ఎక్కడివారము అక్కడే సొమ్మసిల్లి పడిపోవుచున్నాము.
26. మీరు వెంటనే శత్రువులను పిలిపింపుడు. హోలోఫెర్నెసును అతని సైన్యములను ఈ నగరము నాక్రమించుకొననిండు. దోచుకొననిండు.
27. ఈ బాధలను అనుభవించుట కంటె వారి చేతికి చిక్కుట మేలు. వారు మనలను బానిసలను చేయుదురు. అయి నను మా బొందిలో ప్రాణములైననిల్చును. మన ఆడు వారు, పిల్లలు ప్రాణములు కోల్పోవుటను మనము కన్నులార చూడనక్కరలేదు.
28. ఆకాశము, భూమి మరియు మన ప్రభువుకూడ మీకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చుచు మీ ఈ చెయిదమును తప్పక ఖండించును. మన పితరులదేవుడైన ప్రభువు పితరుల పాపములకును, మన తప్పిదములకును మనలను ఈ రీతిగా శిక్షించుచున్నాడు. ఆ ప్రభువు నేడు మనలను ఈ ఆపదల నుండి కాపాడవలెనని మాత్రము మేమెల్ల రము ప్రార్ధించుచున్నాము.”
29. అంతట ఆ జనసమూహమంత పెద్దగా ఏడ్చుచు ప్రభువునకు మొరపెట్టెను.
30. అప్పుడు ఉజ్జీయా ప్రజలతో ”సోదరులారా! మీరు కొంచెము తాళుడు. ఇంకను ఐదునాళ్ళు వేచియుందము. అప్పికైనను ప్రభువు మనలను కరుణింపవచ్చును. ఆయన మనలను పూర్తిగా చేయివిడుచువాడు కాదు.
31. ఈ ఐదునాళ్ళ గడువులోను సహాయము లభింపదేని నేను మీరు కోరినట్లే చేయుదును” అని చెప్పెను.
32. తరువాత అతడు ప్రజలను పంపి వేయగా మగవారు ప్రాకారములకు, బురుజులకు కావలికాయుటకు వెళ్ళిపోయిరి. స్త్రీలును, పిల్లలును ఇండ్లకుపోయిరి. నగరమంత నిరాశతో నిండి పోయెను.