మోషే

45 1.      యాకోబు వంశజుల నుండి ప్రభువు

                              ఒక భక్తుని సంసిద్ధము చేసెను.

                              ప్రజలెల్లరు అతడిని ఆదరముతో చూచిరి.

                              అతడు దేవునికిని, నరులకును

                              ప్రీతిపాత్రుడయ్యెను. అతడే మోషే,

                              ఆ నామమును స్మరించుటయే

                              మహాభాగ్యము.

2.           ప్రభువు అతనిని దేవదూతలవలె

               మహిమోపేతుని చేసెను.

               అతని శక్తిని చూచి శత్రువులెల్ల భయపడిరి.

3.           మోషే ప్రార్థింపగా ప్రభువు అరిష్టములు ప్టుించెను

               ప్రభువు రాజులు అతనిని గౌరవించునట్లు చేసెను

               అతనిద్వారా ప్రజలకు ధర్మశాస్త్రము నొసగెను.

               అతనికి తన తేజస్సును చూపించెను.

4.           ప్రభువు మోషే భక్తివినయములకుగాను

               నరులందరి లోను అతనినే ఎన్నుకొని

               పవిత్రుని చేసెను.

5.           ఆ భక్తునికి తనస్వరమును వినిపించి,

               అతనిని కారుమేఘములోనికి కొనిపోయెను. అచట అతనికి ముఖాముఖి ధర్మశాస్త్రమును ఒసగెను

               అది జీవమును, జ్ఞానమును వొసగు చట్టము.

               మోషే ఆ చట్టమును యిస్రాయేలీయులకు

               బోధింపవలెనని ప్రభువు ఆజ్ఞాపించెను.

అహరోను

6.           ప్రభువు మోషేకు అన్నయును,

               అతనివలె పవిత్రుడును,

               లేవీ వంశజుడైన అహరోనును సంసిద్ధము చేసెను

7.            అతనితో శాశ్వతమైన నిబంధనము చేసికొని

               తన ప్రజలకు అతనిని యాజకునిగా నియమించెను

               ప్రశస్తమైన వస్త్రములతోను, విలువగల

               ఆభరణములతోను అతనిని సత్కరించెను.

8.           అతనికి పరిపూర్ణ మహిమను దయచేసెను.

               అహరోను అధికారమునకు సూచనముగాను,

               అతడికి నారలోదుస్తులను, నిలువుటంగీని,

               ఎఫోదు ఉపరివస్త్రమును దయచేసెను.

9.           ఆ నిలువుటంగీ వస్త్రపుటంచులకు

               బంగారు చిరుగంటలు గలవు.

               అహరోను నడచినప్పుడెల్ల వానిశబ్ధము

               దేవాలయమున విన్పించెడిది.

               ఆ నాదమునువిని ప్రభువును 

               ప్రజలు స్మరించుకొనెడివారు.

10.         ప్రభువు అతనికి పసుపు, ధూమ్ర, ఊదావర్ణముల

               బ్టుాపనిగల పరిశుద్ధ వస్త్రమును దయచేసెను.

               తన చిత్తమును తెలియజేయుటకు ఉరీము,

               తుమ్మీము పరికరములను రత్నములు పొదిగిన

               తన వక్షఃఫలకమునందు ధరించునట్లు చేసెను.

11.           నిపుణుడైన కళాకారుడు పేనిన

               ఎఱ్ఱని త్రాిని దయచేసెను.

               సువర్ణకారుడు నామములు చెక్కి బంగారమున

               పొదిగిన రత్నములనుగూడ

               ప్రభువు అతనికి ప్రసాదించెను.

               ప్రభువు పండ్రెండుతెగల యిస్రాయేలీయులను

               స్మరించుకొనుటకుగాను అహరోను

               ఆ రత్నములను వక్షఃస్థలమున ధరించెడివాడు.

12.          ప్రభువు అతనికి తలపాగాను కూడ దయచేసెను.

               దానిమీద ”ప్రభువునకు నివేదితము” అను

               అక్షరములు చెక్కిన కిరీటము కలదు.

               ఆ పాగా కడునైపుణ్యముతో చేయబడినది.

               కింకింపునుగూర్చు రమ్యమైన కళాఖండిక అది.

               దానిని ధరించుట మిక్కిలి గౌరవప్రదము.  

13.          ఇి్ట సుందరవస్తువులను ముందెవ్వరు ధరింపలేదు

               అహరోను అతని వంశజులు మాత్రమే

               వానిని ధరించిరి.

               వారు మాత్రమే కలకాలము అి్టవానిని తాల్తురు.           

14.          దినమునకు రెండుసారులు ప్రభువునకు

               ధాన్యబలి అర్పింపబడును.

               ఆ ధాన్యమును సంపూర్ణముగా దహింతురు.

15.          మోషే అహరోనుని పరిశుద్ధతైలముతో

               అభిషేకించి యాజకునిగా ప్రతిష్ఠించెను.

               ప్రభువు అహరోనుతోను, అతని వంశజులతోను

               శాశ్వతమైన నిబంధనము చేసికొనెను.

               వారు యాజకులై ప్రభువును సేవింతురు.

               ఆయన పేరు మీదుగా ప్రజలను దీవింతురు.

16.          ప్రభువు నరులందరిలోను

               అహరోనునే ఎన్నుకొనెను.

               బలులర్పించుటయు, పరిమళముతోగూడిన

               సాంబ్రాణిపొగ వేయుటయు ద్వారా

               ప్రభువు తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని,

               వారి పాపములను పరిహరించునట్లు

               చేయుటయు అతని పనులు.

17.          ప్రభువు ధర్మశాస్త్రమును అతని

               అధీనమున ఉంచెను.

               ధర్మశాస్త్ర సంబంధమైన నియమములు చేయుటకు

               ఆ శాస్త్రమును ప్రజలకు బోధించుటకు

               అతనికి అధికారమిచ్చెను.

18.          అసూయ వలన ఎడారిలో కొందరు

               అహరోనుమీద తిరుగబడిరి.

               దాతాను, అబీరాము మరియు వారి

               వర్గమువారు కోరా మరియు అతని అనుచరులు

               కోపముతో అతనినెదిరించిరి.

19.          ప్రభువు ఆ చెయిదమునకు కోపించి

               మహోగ్రుడై ఆ దుష్టులనెల్ల మట్టుపెట్టెను.

               అద్భుతములు కావించి వారినెల్ల

               మంటలకు ఆహుతి చేసెను.

20.        ప్రభువు అహరోనును విశిష్టగౌరవములతో

               సత్కరించెను.

               దేవాలయమున ప్రథమఫలములు

               అతనికి దక్కునట్లు చేసెను.

               దానివలన యాజకులకు సమృద్ధిగా తిండి దొరికెను   

21.          యాజకులు దైవార్పితములైన

               కానుకలను భుజింతురు.               

               అహరోనునకును అతని అనుయాయులకును

               ప్రభువు ఈ హక్కును ఒసగెను.

22.        కాని అహరోను ఇతర ప్రజలవలె

               భూమిని పొందలేదు.

               నేలలో అతనికి వా లేదు.

               అతని వాయు, వారసత్వముగూడ ప్రభువే.

ఫీనెహాసు

23.        ఎలియెజెరు పుత్రుడు ఫీనెహాసు

               కీర్తిని పొందినవారిలో మూడవవాడు.

               అతడు ప్రభువు పట్ల మహాభక్తి కలవాడు.

               ప్రజలు దేవునిమీద తిరుగబడినపుడు

               అతడు స్థిరచిత్తముతోను, ధైర్యముతోను నిలిచి

               యిస్రాయేలీయుల పాపములకు

               ప్రాయశ్చిత్తము చేసెను.       

24.         కనుక ప్రభువు ఫీనెహాసుతో

               సమాధానపు నిబంధనము చేసికొని

               అతనిని గుడారమునకును,

               ప్రజలకును అధికారిని చేసెను.

               అతనికిని అతని అనుయాయులకును

               శాశ్వతముగా ప్రధానయాజకత్వమును

               ఒప్పగించెను.

25.        ప్రభువు యీషాయి కుమారుడును,

               యూదా తెగవాడును అయిన దావీదుతో

               చేసికొనిన ఒడంబడిక ప్రకారము రాచరికము

               తండ్రి నుండి కుమారునికి సంక్రమించెడిది.

               కాని అహరోను యాజకత్వము

               అతని అనుయాయులందరికిని సంక్రమించెను.

26.        యాజకులైన మీకు ప్రభువు

               విజ్ఞానమును దయచేయునుగాక!

               మీరు ప్రజలకు న్యాయబుద్ధితో

               తీర్పు చెప్పుదురుగాక!

               మీ పూర్వుల ధర్మవర్తనము

               ఏ నాికిని అంతరింపకుండునుగాక!

               వారి కీర్తి తరతరములదాక నిలుచునుగాక!