ప్రసవించిన తరువాత స్త్రీల శుద్ధీకరణము

12 1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయు లతో చెప్పుమనిన సంగతులివి: ”ఏ స్త్రీయైనను ప్రసవించి మగబిడ్డను కనినయెడల, తాను ఋతుమతి అయినప్పివలె, ఏడురోజులు శుద్ధినికోల్పోవును.

3. ఎనిమిదవనాడు శిశువునకు సున్నతిచేయవల యును.

4. ఆమె రక్తము శుద్ధిచెందుటకు ఇంకను ముప్పది మూడుదినములు పట్టును. తన రక్తశుద్ధి యగుకాలము ముగియువరకు ఆమె పవిత్ర వస్తువు లను ముట్టరాదు, దేవాలయమునకు వెళ్ళరాదు.

5. కాని ఆమె ఆడుబిడ్డను కనినచో, తాను ఋతుమతియైనప్పివలె, పదునాలుగు దినములు శుద్ధిని కోల్పోవును. ఆ పిమ్మట ఆమె రక్తము శుద్ధి చెందుటకు ఇంకను అరువదియారు దినములు పట్టును.

6. ఆమె మగబిడ్డను కనినను, ఆడుబిడ్డను కనినను శుద్ధికాలము ముగియగనే సంపూర్ణదహనబలికి ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారబలికి ఒక తెల్ల గువ్వను లేక పావురమును సమావేశపుగుడారము ప్రవేశముద్వారము వద్ద పరిచర్యచేయు యాజకుని యొద్దకు తీసుకొనిరావలయును.

7. యాజకుడు వానిని బలియిచ్చి ఆమె శుద్ధినిబడయుటకు విధిని నిర్వహించును. అప్పుడు ఆమె శుద్ధినిబడయును. ప్రసవించిన స్త్రీని గూర్చిన నియమమిది.

8. కాని ఆమె పేదరాలైయుండి గొఱ్ఱెపిల్లను సమర్పింపలేనియెడల రెండు పావురములనో లేక రెండు తెల్లగువ్వలనో అర్పింపవచ్చును. వానిలో ఒకి సంపూర్ణ దహనబలికి మరియొకి పాపపరిహార బలికి వినియోగింపబడును. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధినిబడయును.”

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము