4 1. సొలోమోను కంచుపీఠమును తయారు చేయించెను. దాని పొడవు ఇరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు, ఎత్తు పది మూరలు 2. మరియు అతడు కంచుతో ఒక గుండ్రని సంద్రమువిం త్టొిని కూడ పోతపోయించెను. దాని వెడల్పు పది మూరలు, లోతు ఐదు మూరలు, దాని చుట్టుకొలత ముప్పది మూరలు. 3. ఆ త్టొి వెలుపలి అంచుచుట్టు రెండు వరుసలలో ఎద్దుల బొమ్మలు మూరకు పదేసి కలవు. త్టొిని పోతపోసినపుడే ఆ బొమ్మలుకూడ తయారైనవి.

4. ఆ సంద్రమువిం త్టొిని పండ్రెండు కంచు ఎద్దుల బొమ్మలపై నిల్పిరి. అవి ఒక్కొక్క వరుసలో మూడేసి చొప్పున వాివెనుక భాగములన్నియు లోపలితిరిగి యుండునట్లుగా నాలుగు దిక్కులవైపు తిరిగి ఉండెను.

5. త్టొి అంచు బెత్తెడు మందము కలిగి గిన్నె అంచువలెను, విచ్చిన పూవువలెను గుండ్రముగా ఉండెను. దానిలో మూడువేల కూజాల నీళ్ళుపట్టును.

6. అతడు పది చిన్నతొట్లు చేయించి దేవాలయ మునకు ఉత్తరదిశలో ఐదింని, దక్షిణదిశలో ఐదింని ఉంచెను. దహనబలిగా అర్పించు పశువులను అందు లోని నీళ్ళతో కడిగి శుభ్రము చేయుదురు. యాజకులు సంద్రమువిం త్టొిలోని నీళ్ళతో శుద్ధిచేసికొనెడి వారు.

7. పదిబంగారు దీపస్తంభములను, వాని దిమ్మెలనుగూడ వాి మాదిరిచొప్పున చేయించి దేవాలయమునందు ఉంచెను.

8. అవి ఉత్తరమున ఐదు, దక్షిణమున ఐదు ఉండెను. నెత్తుిని చిలుకరించుటకు నూరు బంగారుగిన్నెలు కూడ చేయించెను.

9. సొలోమోను యాజకులకొరకు లోపలి ప్రాంగ ణమును క్టించెను. వెలుపలి పెద్ద ప్రాంగణమును కూడ క్టించెను. దానికి ద్వారములను అమర్చి, దాని తలుపులను కంచుతో పొదిగించెను.

10. సంద్రము విం త్టొిని దేవాలయమునకు దాపులో ఆగ్నేయదిశ యందు ఉంచెను.

11-16. హూరాము బూడిదను ప్రోగుచేయు కుండలను, పారలను, గిన్నెలను చేసెను. అతడు దేవాలయమునకు చేయుదునన్న పరికరములన్నిని చేసి ముగించెను. ఆ వైనమిది:

రెండు స్తంభములు, వానిమీద గిన్నెల ఆకారములో ఉన్న పీటలు, ఆ పీటలమీద కలగలపులుగా ఉన్న గొలుసుల ఆకృతులు, ఒక్కొక్క పీటమీద రెండువరుస లలో అమర్చిన నాలుగువందల కంచు దానిమ్మపండ్లు, పదిచిన్నతొట్లు, వాని పీటలు, సంద్రమువిం త్టొి, దానిని మోయు పండ్రెండు ఎద్దులు, బూడిదనెత్తు కుండలు, పారలు, గరిటెలు.

హూరాము సొలోమోను కోరినట్లే దేవళములో వాడుటకు పై పరికరములన్నిని నాణ్యమైన కంచుతో చేసెను.

17. రాజు వానినన్నిని యోర్దాను లోయలో సుక్కోతు జెరెదా నగరముల మధ్యనున్న జిగటమన్ను కొలిమిలో తయారు చేయించెను.

18. అతడు ఆ పరికరములను విస్తారముగా చేయించెను. కనుక వానికి ప్టిన కంచు ఎంతయో ఎవరును చెప్పజాలరైరి.

19. సొలోమోను దేవాలయమునకు బంగారు పరికరములు గూడ చేయించెను. అవి ఏవనగా బంగారుపీఠము, దేవునియెదుట రొట్టెలను పెట్టు బంగారుబల్లలు, 20. నియమము ప్రకారము గర్భ గృహము నెదుట వెలుగుటకు  మేలిమిబంగారముతో చేసిన ప్రమిదలు, దీపస్తంభములు, 21. పుష్పా కృతితోనున్న అలంకరణములు, ప్రమిదలు, దీపము లార్పు పట్టుకారులు, 22. కత్తెరలు, నెత్తురు చిలు కరించు గిన్నెలు, సాంబ్రాణిపాత్రలు, అగ్ని కలశ ములు. అతడు దేవాలయము వెలుపలి తలుపును, గర్భగృహము తలుపును బంగారముతో పొదిగించెను.