చిత్తశుద్ధిలేని ఉపవాసము

7 1. దర్యావేషు పరిపాలనాకాలము నాలుగవయేట, కిస్లేవు అను తొమ్మిదవనెలలో నాలుగవదినమున ప్రభువు నాకు తన సందేశము వినిపించెను.

2. బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి అనుయాయులను సైన్యములకధిపతియైన ప్రభువు దేవళమునకు పంపిరి. వారు ప్రభువును శాంతిపర చుటకై,  3. ”మేము ఇన్ని యేండ్లనుండి చేసినట్లుగా, ఐదవనెలలో ఉపవాసముండి విలపింపవలెనా?” అని మందిరముననున్న యాజకులను,  ప్రవక్తలను మనవి చేయగా, 4. సైన్యములకధిపతియైన ప్రభునివాక్కు నాతో ఇట్లనెను.

5. ”నీవు దేశములోని ప్రజలకును, యాజకుల కును ఇట్లు చెప్పుము: ‘మీరు కడచిన డెబ్బది యేండ్ల లోను ఐదు, ఏడవనెలలయందు నాయందు భక్తిగలి గియే ఉపవాసముండి విలపించిరా?

6. మీరు అన్న పానీయములు పుచ్చుకొనినది గూడ స్వీయతృప్తికొరకే గదా!      

7. యెరూషలేము వృద్ధిచెంది ప్రజలతో నిండి యున్నప్పుడు, దాని పరిసరనగరములలో పెక్కుమంది వసించుచున్నపుడు, దాని దక్షిణభాగమునను, పడమర నున్న కొండపాదులలోకూడ ప్రజలు వసించుచున్నపుడు, ప్రభువు పూర్వప్రవక్తల ద్వారా వినిపించిన సందేశమును మీరు మననము చేసుకొనక ఉండవచ్చునా?

అవిధేయత వలన ప్రవాసము

8. ప్రభువువాణి జెకర్యాకిట్లు చెప్పెను: 9. ”పూర్వము నేను నా ప్రజలను ఇా్లజ్ఞాపించితిని. మీరు న్యాయము జరిగింపవలెను. ఒకరియెడలనొకరు దయతోను, జాలితోను మెలగవలెను.

10. వితంతువు లను, తండ్రిలేనివారిని, మీ మధ్య వసించు పరదేశులను, పేదలను పీడింపకూడదు. ఒకరికొకరు కీడు తలపెట్ట రాదు”.

11. కాని నా ప్రజలు మొండితనముతో నా పలుకులు ఆలింపరైరి. వారు తమ చెవులను గ్టిగా మూసికొనిరి.

12. తమ హృదయములను చెకుముకి రాతివలె కఠినము చేసికొనిరి. నేను నా పూర్వ ప్రేషిత ప్రవక్తల ద్వారా చెప్పించిన ఉపదేశమును వారు విన నందున నేను వారిపై ఆగ్రహము చెందితిని.  ఇదియే సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు.

13. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ‘వారు నేను పలికిన పలుకులను ఆలింపలేదు. కనుక నేను వారి వేడుకోలును ఆలింప నైతిని.

14. నేను తుఫానువలె వారిని అన్యదేశములకు చెదరగ్టొితిని. వారి భూమి జనావాసములేని మరు భూమి అయ్యెను. వారు తమ సుందరదేశమును ఎడారిచేసికొనిరి.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము