హాయిపట్టణమును జయించుట

యావే యెహోషువకు ఆజ్ఞయిచ్చుట

8 1. అప్పుడు యావే యెహోషువతో  ఇట్లనెను: ”భయపడకుము. ధైర్యము వహింపుము. నీ వీరుల నందరిని తోడ్కొని హాయి పట్టణము మీదికి పొమ్ము. ఆ పట్టణపు రాజును, అతని ప్రజలను, నగరమును, దేశమును నీకు అప్పగించితిని.

2. యెరికోనగర మును, యెరికోరాజును నాశనము చేసినట్లే హాయి నగరమును, దాని రాజును నాశనముచేయుము. మీరు హాయిప్రజల సంపదను, పశువులను మూకుమ్మడిగా దోచుకొనవచ్చును. మీరు పట్టణము వెనుక పొంచి యుండి నగరమును ధ్వంసము చేయవలయును” అని చెప్పెను.

యెహోషువ యుక్తి

3. యెహోషువ వీరులతో పోయి హాయిని ముట్ట డించుటకు సిద్ధపడెను. అతడు ముప్పది వేలమంది మహావీరులను ఎన్నుకొని వారిని రాత్రివేళ పంపించెను.

4. వారితో ”మీరు పట్టణమునకు సమీపమున పడమరన పొంచియుండి సంసిద్ధముగా నుండుడు.

5. నేనును, నాతో ఉన్నవారును పట్టణమును సమీ పించెదము. హాయి ప్రజలు మునుపివలె మమ్ము ఎదుర్కొందురు. అప్పుడు మేము వారి యెదుట నిలు వక పారిపోయెదము.

6. మునుపివలె వీరు మనయెదుట నిలువజాలక పరుగెత్తుచున్నారను కొని వారు పట్టణమునువీడి బహుదూరము మమ్ము వెాండెదరు.

7. అప్పుడు పొంచియున్న మీరు బయికి వచ్చి పట్టణమును ఆక్రమించుకొనుడు. మీ దేవుడైన యావే దానిని మీ వశము చేయును.        

8. మీరు పట్టణమును పట్టుకొని వెంటనే తగుల బెట్టుడు. ఇది ప్రభువాజ్ఞ. మీరు నేను చెప్పినట్లు చేయుడు” అని పలికి వారిని పంపించెను.

9. వారు వెళ్ళి హాయి పట్టణమునకు పడమి వైపున బేతేలు కును, హాయికిని మధ్య పొంచియుండిరి. ఆ రాత్రి యెహోషువ ప్రజలమధ్య బసచేసెను.

10. మరునాడు వేకువజామున లేచి అతడు హాయి పట్టణము మీదికి దాడికివెడలెను. అతడు, యిస్రాయేలుపెద్దలు ప్రజలముందు నడచిరి.

11. అతనితోనున్న యుద్ధవీరులందరు బయలుదేరి నగరము ఎదుి భాగమునకు కదలి హాయికి ఉత్తరమున డేరా వేసిరి. వారికి హాయికి మధ్య ఒక లోయ కలదు.

12. యెహోషువ సుమారు ఐదువేల మందిని పట్టణమునకు పశ్చిమమందు బేతేలుకును హాయికిని నడుమ పొంచియుండ నియమించెను.

13. నగరమునకు ఉత్తరదిక్కున యెహోషువ, జనులు నిలుచుండిరి. పొంచియున్నవారు పడమివైపు నుండిరి. యెహోషువ ఆ రాత్రి లోయలోనే గడపెను.

హాయి యుద్ధము

14. హాయిరాజు శత్రువులను చూచిన వెంటనే అతడును, ఆ పట్టణప్రజలును పెందలకడనేలేచి వారు ముందుగా నిర్ణయించుకొనిన విధముగా ఆరబాకు అభిముఖముగానున్న పల్లములో యిస్రాయేలీయులను ఎదుర్కొనుటకు త్వరపడి తనవారితో బయలుదేరెను. పట్టణమునకు పడమివైపున శత్రువులు పొంచి యున్న సంగతి అతనికి తెలియదు.

15. యెహోషువ, యిస్రాయేలీయులు వారి యెదుట నిలువజాలనట్లు నించుచు ఎడారివైపునకు పారిపోయిరి. 16. హాయి ప్రజలు నగరమును అరక్షితముగా వదలిప్టిె పెనుకేకలతో వారిని తరుముచు చాలదూరము పోయిరి. 17. యిస్రాయేలీయులను వెాండుచు పోని వాడొక్కడును హాయిలోనేగాని, బేతేలులోనేగాని లేడు. నగరమును అరక్షితముగా విడిచి, వారు యిస్రాయేలీ యుల వెంటబడిరి.

18. అప్పుడు యావే ”నీ చేతనున్న ఈటెను హాయివైపు చాపుము. నగరమును నీకు వశము చేసెదను” అని యెహోషువతో చెప్పెను. యెహోషువ తన చేతనున్న బల్లెమును నగరమువైపు చాపెను.

19. అతడు తన చేయిచాపిన వెంటనే పొంచియున్న వారు గబగబ మరుగునుండి వెలువడి పరుగెత్తుకొని పోయి పట్టణమున ప్రవేశించి దానిని ఆక్రమించుకొని తగులబ్టెిరి.

హాయి ప్రజల వినాశనము

20. హాయి ప్రజలు వెనుదిరిగిచూడగా పట్టణము నుండి పొగ ఆకాశమునకు ఎగబ్రాకుచుండెను. ఎడారివైపు పరుగెత్తిపోవుచున్న యిస్రాయేలీయులు తమను తరుముచున్న వారిపై తిరుగబడుచుండిరి. అందుచే హాయి ప్రజలలో ఒక్కనికిని ఎటుపోవుటకు వీలు కాలేదు.

21. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనుటయు, నగరమునుండి పొగ ఆకాశమునకు లేచుటయు, యెహోషువయు యిస్రాయేలీయులును చూచి హాయి ప్రజలను ముట్టడించి ఎదుర్కొనిరి.

22. నగరమున నున్న యిస్రాయేలు వీరులు వెనుక నుండి వచ్చి హాయి ప్రజలపైబడిరి. ఈ రీతిగా హాయి నగర ప్రజలు అన్నివైపుల శత్రువులచేత ముట్టడింప బడిరి. ఒక్కడిని గూడ ప్రాణములతో మిగులనీయకుండ యిస్రాయేలీయులు అందరిని మట్టుప్టిెరి.

23. హాయి రాజు మాత్రము ప్రాణములతో పట్టుపడెను. అతనిని యెహోషువ దగ్గరకు తీసికొని వచ్చిరి.

24. ఎడారిలోనికి తమ్ము వెంబడించిన హాయి ప్రజలను మైదానములో పూర్తిగా తమ కత్తులకు ఎరచేసిన తరువాత యిస్రాయేలీయులు హాయి నగరమునకు తిరిగివచ్చి అందరిని సంహరించిరి.

25. నాడు హతులైన హాయి స్త్రీ పురుషుల సంఖ్య పన్నెండు వేలమంది.

హాయి పట్టణము శాపముపాలగుట

26. హాయి నివాసులందరు శాపగ్రస్తులైన యెరికో ప్రజలవలె నాశనమగువరకు యెహోషువ తాను చాచిపట్టుకొనిన బల్లెమును వెనుకకు తీయలేదు.

27. యావే యెహోషువకు ఆజ్ఞయిచ్చిన ప్రకారము యిస్రాయేలీయులు హాయి పశువులను, కొల్లగ్టొిన సొమ్మును మాత్రము గైకొనిరి.

28. అంతట యెహోషువ హాయిని తగులబెట్టెను.  అది పూర్తిగా పాడువడి నేికిని అట్లే శూన్యప్రదేశముగా నున్నది.

29. యెహోషువ హాయి రాజును చెట్టుకు వ్రేలాడ దీయించెను. మాపివేళ శవమును చెట్టు నుండి దింప నాజ్ఞాపించెను. పీనుగును నగరద్వారము ముందు పడవేసి దాని మీద పెద్ద రాళ్ళగుట్టను పేర్చిరి. నేికిని ఆ గుట్ట అచటనున్నది.

ఏబాలు కొండమీద బలి

చెక్కని రాళ్ళతో బలిపీఠము

30-31. అప్పుడు యెహోషువ యిస్రాయేలు దేవుడైన యావేకు ఏబాలు కొండమీద ఒక బలి పీఠము క్టించెను. యావే సేవకుడైన మోషే యిస్రా యేలీయులను ఆజ్ఞాపించిన విధంగా, ధర్మశాస్త్రము ప్రకారము, ఇనుపపనిముట్లు తాకని, చెక్కని ముడి రాళ్ళతో ఆ బలిపీఠమును క్టించెను. ఆ దినమున, వారు ఆ బలిపీఠముపై యావేకు దహనబలులు, సమాధానబలులు సమర్పించిరి.

ధర్మశాస్త్రమును చదివి వినిపించుట

32. మోషే యిస్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును యెహోషువ రాళ్ళపై చెక్కించెను.

33. అప్పుడు నిబంధనమందసమునకు ఇరువైపుల, నిబంధన మందసమును మోయు లేవీయయాజకుల ముందట, తమపెద్దలతో, నాయకులతో, న్యాయాధి పతులతో, స్వపరభేదము లేకుండ యిస్రాయేలీయు లందరును తమ తమ స్థానములలో నిలుచుండిరి. వారిలో సగముమంది గెరిసీముకొండ ఎదుటను, సగముమంది ఏబాలుకొండ ఎదుటను, తమ తమ స్థానములలో నిలుచుండిరి. యావే సేవకుడైన మోషే యిస్రాయేలీయులు దీవెన పొందునపుడు ఇట్లు నిలువ వలెనని మొదటనే ఆజ్ఞాపించియుండెను.

34. తరువాత యెహోషువ ధర్మశాస్త్ర నియమములన్నిని ఆశీర్వచనములను, శాపవచనములను కూడ చదివి వినిపించెను.

35. స్త్రీలు, పిల్లలు పరదేశులు విను చుండగా సర్వజనము ఎదుట యెహోషువ మోషే ఆజ్ఞాపించిన నిబంధనలన్నిని ఒక్కమాట కూడ విడువక చదివి వినిపించెను.

Previous                                                                                                                                                                                                    Next