4 1. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ”యిస్రాయేలీయులారా!

               మీరు తిరిగి రాగోరెదరేని నా చెంతకే తిరిగిరండు.

               మీరు నేను అసహ్యించుకొను విగ్రహములను

               తొలగించి నన్ను అనుసరింతురేని,

2.           యథార్థముతోను, న్యాయబుద్ధితోను,

               చిత్తశుద్ధితోను నా పేరుమీద

               ప్రమాణము చేయుదురేని,

               వివిధజాతుల ప్రజలు మీవలె తామును

               దీవెనలు పొందవలెనని నన్నర్థింతురు,

               నన్ను కొనియాడుదురు.”

3.           యూదా యెరూషలేముజనులతో

               ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ”మీరు బీడువడిన పొలములను బాగుగాదున్నుడు

               ముండ్లనడుమ విత్తకుడు.          

4.           యూదా, యెరూషలేము ప్రజలారా!

               మీరు మీ ప్రభుడనైన నా నిమిత్తము

               మీ చర్మాగ్రమున సున్నతి చేయించుకొనుడు

               అట్లే మీ హృదయమునను సున్నతి చేయించుకొనుడు

               లేదేని, మీరు చేసిన దుష్కార్యములవలన

               నా కోపము అగ్నివలె ఎగసి గనగనమండును.

               ఇక దానిని ఎవడును చల్లార్పజాలడు.”

ఉత్తరదిశనుండి యూదా మీదికి దాడి

5.           యూదా ప్రజలకు హెచ్చరికచేయుడు,

               యెరూషలేము జనులకు ప్రకటనము చేయుడు. ”దేశమునందంతట బాకానూది పెద్దగా అరవుడు,

               ‘ప్రజలను సురక్షితపట్టణములకు పారిపొమ్మనుడు’

6.           సియోనుకు జెండా యెత్తి చూపుడు.

               జాగుచేయక భద్రతా స్థలములకు పారిపొండు.

               ప్రభువు ఉత్తరదిక్కునుండి

               వినాశనమును తెచ్చుచున్నాడు.

               మహావిపత్తును గొనివచ్చుచున్నాడు.

7.            సింహము పొదలోనుండి కదలినది,

               జాతులను నాశనముచేయువాడు బయలుదేరెను.

               అతడు యూదాను ధ్వంసము చేయును.

               యూదానగరములు పాడువడును,

               వానిలో ఇక ఎవడును వసింపడు.

8.           ప్రభువు ఉగ్రకోపము యూదానుండి వైదొలగలేదు

               కనుక మీరు గోనెతాల్చి శోకింపుడు.”

9.           ప్రభువు ఇట్లు అనెను:

               ”ఆ రోజున రాజులు ధైర్యము కోల్పోవుదురు.

               అధికారులు డీలాపడుదురు.

               యాజకులు విస్మయమొందుదురు.

               ప్రవక్తలు విభ్రాంతి చెందుదురు.”

10.         అపుడు నేను ఇట్లింని:

               ”హా! ప్రభుడవైన యావే! యెరూషలేము పౌరులను

               నీవు పూర్తిగా వంచించితివి.

               నీవు వారికి క్షేమము కలుగునని పలికితివి.

               కాని ఇపుడు కత్తి

               ఈ ప్రజల గొంతుమీదకు వచ్చినది.

11.           ఎడారి నుండి వేడిగాలి తమ ప్రక్కకు

               వీచుచున్నదని యెరూషలేము పౌరులు

               గుర్తించుకాలము వచ్చుచున్నది.

               అది ధాన్యమును తూర్పారబట్టుటకును,

               శుద్ధిచేయుటకును ఉపయోగపడు

               మెల్లనిగాలి కాదు,

12.          ప్రభువాజ్ఞవలన వీచు బలమైనగాలి.

               ప్రభువే తన ప్రజలు దోషులని

               తీర్పు చెప్పుచున్నాడు.”

శత్రువులు యూదాను చుట్టుముట్టుట

13.          అదిగో! శత్రువు మేఘమువలె వచ్చుచున్నాడు.

               అతని రథములు సుడిగాలివలె గిఱ్ఱున తిరుగును.

               అతని అశ్వములు

               గరుడపక్షి కంటె వేగముగా పరుగెత్తును.

               కటకా! మనము శాపముపాలయితిమి.

14.          యెరూషలేమూ!

               నీ హృదయమునుండి మాలిన్యమును

               కడిగి వేసుకొని, రక్షణమునుబడయుము.

               నీవెన్నాళ్ళు దుష్టాలోచనలు ఆలోచింతువు?

15.          దానునుండి వార్తావహులు వచ్చుచున్నారు.

               ఎఫ్రాయీము కొండనుండి

               వినాశవార్తలు వచ్చుచున్నవి.

16.          ”దూరప్రాంతమునుండి శత్రువులు వచ్చుచున్నారు.

               యెరూషలేమునకు విరోధముగా జాతులకు

               ప్రకటనము చేయువారు వచ్చుచున్నారు.

17.          ఈ శత్రువులు యూదా పట్టణముల చుట్టు

               బిగ్గరగా అరతురు.

               పొలము కాపరులు చేనిచుట్టు కావలికాసినట్లుగా,

               వారు యెరూషలేమును చుట్టుముట్టుదురు.

               ఆ నగరపౌరులు ప్రభువుమీద తిరుగబడిరి.

               కనుక ఈ కార్యము జరుగును

               ఇది ప్రభువు వాక్కు.

18.          యూదా! నీ దుష్టవర్తనమువలన

               ఈ అనర్థము వాిల్లెను.

               నీ పాపమువలన ఈ తిప్పలు వచ్చెను.

               ఇప్పుడు నీ గుండెలో బాకు దిగబడనున్నది.”

ప్రవక్త ఆవేదన

19.          నా హృదయము బాధచెందుచున్నది.

               నేను ఈ వ్యధను భరింపజాలకున్నాను.

               నా గుండె వేగముగా కొట్టుకొనుచున్నది.

               నేను నెమ్మదిగా ఉండజాలను.

               నాకు బాకాధ్వని, యుద్ధరవము విన్పించుచున్నవి

20.        నాశనము వెంట నాశనము వచ్చుచున్నది,

               దేశమంతయు ధ్వంసమైనది.

               త్రుికాలములో మన గుడారములు కూలినవి. 

               మన డేరాతెరలు చినిగిపోయినవి.

21.          నేను ఎంతకాలము పోరును గాంచవలెను?

               ఎంతకాలము బాకాలధ్వనిని ఆలింపవలెను?

22.        ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”ఈ ప్రజలు మూర్ఖులు, వీరు నన్నెరుగరు.

               వీరు మందమతులైన బిడ్డలు, బుద్ధిలేనివారు.

               వీరికి చెడునుచేయుట బాగుగా తెలియును.

               మంచినిచేయుట మాత్రము తెలియదు.”

ప్రవక్త రాబోవు వినాశమును దర్శించుట

23. నేను భూమివైపు చూడగ       

               అది అస్తవ్యస్తముగానుండెను.

               ఆకసమువైపు చూడగా

               దాని వెలుగు అంతరించెను.          

24. పర్వతములవైపు చూడగా

               అవి కంపించుచుండెను.

               తిప్పలవైవు చూడగా అవి చలించుచుండెను.

25.        నేను పారజూచితిని,

               గాని నరుడెవ్వడును కన్పింపలేదు.

               పకక్షులుకూడ తిరిగిపోయినవి.

26.        సారవంతమైన నేల ఎడారివలె చూపట్టెను.

               ప్రభువు తీవ్రకోపమువలన

               నగరములు పాడువడినట్లు కన్పించెను.

27.         ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               ”దేశమంతయు నాశనమగును,

               ఐనను నేను దానిని పూర్తిగా ధ్వంసముచేయను

28.        ఈ వినాశమువలన భూమి విలపించును,

               ఆకాశము చీకిమయమగును.

               ప్రభువునోట మాట వెలువడెను.

               కనుక ఆయన ఇక మనసు మార్చుకొనడు.

               ఆయన నిర్ణయము చేసెను కనుక

               ఇక వెనుదీయడు.”

29.        రౌతుల ధ్వనిని, విలుకాండ్రసందడిని విని

               ఎల్లరును పారిపోవుదురు.

               కొందరు అడవులలోనికి పరుగెత్తుదురు.

               కొందరు కొండలు ఎక్కుదురు.

               ప్రతి నగరము నిర్మానుష్యమగును.

               వానిలో ఇక ఎవడును వసింపడు.

30.        యెరూషలేమూ! నీవిక ఏమి చేయుదువు?

               నీవు ఎఱ్ఱని బట్టలు ధరింపనేల?

               సువర్ణాభరణములు తాల్చనేల?

               కాటుక పెట్టుకోనేల?

               నీ సౌందర్యమెందుకును అక్కరకురాదు.

               నీ ప్రేమికులు నిన్ను తిరస్కరించిరి.             

               వారు నీ ప్రాణములు తీయుదురు.

31.          నేను ప్రసవవేదనను అనుభవించు

               స్త్రీ రోదనవిం రోదనను వింని.

               తొలిచూలు బిడ్డను కను

               ఉవిద కేకలవిం కేకలను వింని.

               అవి సియోను కుమారి ఏడ్పులు.

               ఆమె ఊపిరాడక రొప్పుచు చేతులు చాచి

               ”హా! నాకు వినాశనము దాపురించినది,

               శత్రువులు నన్ను వధించుటకు చుట్టుమ్టుిరి”

               అని పలుకుచున్నది.