ఉపోద్ఘాతము:

పేరు: ఆమోసు అనగా ”భారము మోయువాడు” అని అర్థము.  ప్రవక్తగా మారకముందు ఇతడు చేసిన పనినిబ్టి  అతని పేరుకు ఈ అర్థాన్ని ఇచ్చి వుాంరని తెలుస్తుంది. పేరుకు తగినట్లు భోగభాగ్యాలతో తులతూగుచున్న ఉత్తరరాజ్యవాసులకు భారమైన వారి వినాశమును గూర్చి ఆమోసు ప్రవచించెను. ఆమోసు యూదా రాజ్యములోని తెకోవా (1:1) గ్రామానికి చెందినవాడు. గొర్రెల కాపరిగా జీవితం గడుపుతూ, అత్తిపండ్లు అమ్ముకుంటూ జీవనోపాధిని సాగించేవాడు (1:1; 7:14-15).

కాలము: క్రీ.పూ.8వ శతాబ్ధము.

రచయిత: ఆమోసు. మొదిసారిగా గ్రంథస్థమైన ప్రవచనము ఈ ఆమోసుదే.

చారిత్రక నేపథ్యము: యూదా దేశాన్ని ఉజ్జీయా (క్రీ.పూ. 781-740), యిస్రాయేలీయులను యరోబాము (783-743) పాలించిన కాలములో ఆమోసు యిస్రాయేలులో ప్రవచించెనని తెలియచున్నది. యరోబాము కాలమములో సామ్రాజ్యము  బాగా విస్తరించింది.  వ్యాపార, ఆర్థికరంగములలో ప్రజలు పుంజుకున్నారు. అయితే ఈ అభివృద్ధితోపాటు పొంచి వున్న కష్టనష్టాలను రాజకీయ విజ్ఞులు గమనించలేదు (4:6-11). మతాచారాల వ్యవహారములలో చిత్తశుద్ధిలోపించి అంతా బాహ్యమైన తంతుగానే ఉండిపోయినది. అవినీతి కూడా పెరిగిపోయినది. సామాజికన్యాయము అడుగింపోయింది. ఇి్ట పరిస్థితుల్లో ఆమోసు అవినీతి, అన్యాయాలకు విరుద్ధంగా ప్రవచించెను.

ముఖ్యాంశములు: ప్రభువు అన్నిజాతులకు దేవుడని తెలియజేస్తూ యిస్రాయేలీయుల చుట్టుపట్ల జాతులు చేసిన అపరాధములతోపాటు యిస్రాయేలుజాతి అపరాధముల కారణముగా దేవుడిచ్చిన తీర్పుల సారాంశము దీనిలోని ముఖ్యాంశములు.  పశ్చాత్తాపపడి తన వైపు తిరగాలని తన ప్రజలకు దేవుడిచ్చిన హెచ్చరికలు, చివరిరోజుల్లో యిస్రాయేలీయుల విముక్తి ఈ గ్రంథములో ప్రధానముగా కనపడతాయి. దురాశాపరులు, అవినీతిపరులు నిరుపేదలను వంచించడం విం సాంఘిక అన్యాయాలను ఎత్తిచూపి, సాంఘిక న్యాయం కోసం పోరాడిన ప్రవక్తగా  ఆమోసు పేరు గడించాడు.

క్రీస్తుకు అన్వయము: నిజమైన ఆరాధన యాంత్రికమైనది, బాహ్యమైనది కాదు. ఆత్మగతమైనది. దేవుని సందేశాన్ని విని, పాించేవారు దేవునికి ప్రీతిపాత్రులవుతారు (మత్త. 7:15-27; 9:11-12). ప్రజల అవినీతిని హెచ్చరించడం ప్రవక్త కర్తవ్యం (9:1-10). చివరికి ప్రవక్త విమోచనను ప్రస్తావించడం (9:11-15) మెస్సయా రాకడను గుర్తుచేస్తుంది. ఈ విధంగా ఆమోసు ప్రవచనాలు క్రీస్తు ఛాయాచిత్రాలుగా నిలుస్తాయి.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము