ధర్మశాస్త్రబోధకుడు

39 1.      కాని మహోన్నతుని ధర్మశాస్త్రమును

                              పఠించుటలో కాలమును గడపు

                              ధర్మశాస్త్ర బోధకుడు మాత్రము

                              భిన్నమైనవాడు.

                              అతడు పురాతన రచయితల

                              జ్ఞానవాక్కులను పరిశీలించును.

                              ప్రవచనములను పఠించుటకు

                              కాలమును వినియోగించును.

2.           సుప్రసిద్ధుల సూక్తులను పదిలపరుచును.

               ఉపమానములమీద నైపుణ్యముతో వ్యాఖ్యచెప్పును

3.           సామెతల గూడార్థమును అర్థము చేసికొనును. పొడుపుకథల మర్మార్థమును చర్చించును.       

4.           ప్రముఖులకు సేవలుచేయుచు

               రాజులతో కలిసితిరుగును.

               అన్యదేశములలో సంచరించి

               నరుల బాగోగులను గమనించును.

5.           వాడుక చొప్పున వేకువనేలేచి

               తన సృష్టికర్తయైన దేవునికి జపము చేయును.

               మహోన్నతుడైన దేవునిఎదుట గొంతెత్తి ప్రార్థనచేసి

               తన పాపములను మన్నింపుమని వేడుకొనును.

6.           ఆ మహాప్రభువు కరుణించెనేని

               అతని హృదయము విజ్ఞానముతో నిండును.

               అతడు జ్ఞాన వాక్యములను వెదజల్లుచు

               దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును.

7.            తన విజ్ఞానమును, ఉపదేశమును

               అన్యులకు పంచిపెట్టును.

               నిగూఢమైన దైవరహస్యములను

               అర్థముచేసికొనును

8.           తానుగ్రహించిన విజ్ఞానమును

               ఎల్లరికిని తెలియజేయును.

               ప్రభువు నిబంధన ధర్మశాస్త్రముపట్ల

               అత్యంత శ్రద్ధజూపును.

9.           అతని విజ్ఞానమును అనేకులు మెచ్చుకొందురు. ఆ విజ్ఞానము ఏనాికిని అంతరింపదు.

               భావితరములవారు అతడిని స్మరించుకొందురు.

               అతని పేరు మాసిపోదు.

10.         అన్యజాతులును అతని విజ్ఞానమును సన్నుతించును

               విద్వత్సభ అతనిని కీర్తించును.

11.           ముసలి ప్రాయముదాక జీవించెనేని

               అతడు సుప్రసిద్ధుడగును.

               కీర్తిని పొందకముందే గతించినను

               అతనికి ఏ కొదవయులేదు.

దేవునికి స్తుతిగీతము

12.          నేను చెప్పగోరిన భావములు ఇంకను గలవు.

               వానితో నా హృదయము పూర్ణచంద్రునివలె

               నిండియున్నది.

13.          భక్తిగల బిడ్డలారా! మీరు నా సూక్తులు ఆలించి

               ఏి యొడ్డున ఎదుగు గులాబీవలె పుష్పింపుడు.

14.          సాంబ్రాణిపొగవలె కమ్మని పరిమళము వెదజల్లుడు

               లిల్లీ పుష్పమువలె వికసింపుడు.

               ప్రభువు చేసిన సత్కార్యములకుగాను

               ఆయనను స్తుతించికీర్తింపుడు.

15.          ఆ ప్రభువు మహాత్మ్యమును ఉగ్గడింపుడు.

               సితారతో ఈ పాట పాడుడు.

16.          ”ప్రభువు సృజించినది అంతయు మంచిదే.

               ఆయన ఆజ్ఞాపించినది అంతయు

               సకాలమున జరుగును.

17.          ఇది ఏమి? ఇది ఇట్లెందుకున్నది?”

               అని ఎవరును అడుగరాదు.

               దేవునినుండి తగిన సమయమున

               ఇి్ట ప్రశ్నలన్నికి జవాబు లభించును.

               ఆయన ఆజ్ఞాపింపగనే నీివెల్లువ

               ఆగిపోయినది.

               ఆయన పలుకు వినగనే

               జలము రాశిగా ఏర్పడినది.

18.          ఆయన ఆజ్ఞాపించినది సత్వరమే జరుగును.

               ఆయన రక్షణ శక్తిని ఎవ్వరు అడ్డగింపజాలరు.

19.          నరులు చేయు ప్రతికార్యమును

               ప్రభువు గమనించును.

               ఎవరును ఆయన కన్ను కప్పజాలరు.

20.        ఆయన కాలమును ప్రారంభమునుండి

               అంతము వరకు వీక్షించును.

               ఆయనకు ఆశ్చర్యము కలిగించునది

               ఏదియులేదు.

21.          ఇదేమి? ఇదిట్లెందుకున్నది అని

               ఎవరును ఆయనను అడుగరాదు.

               సృష్టిలోని ప్రతి వస్తువునకు

               నిర్ణీతమైన ఉద్దేశమున్నది.

22.        ప్రభువు దీవెనలు నది, మరుభూమి మీదికి పారి 

               దానిని  తడిపినట్లుగా ఉండును.

23.        ఆయన మంచినీిని ఉప్పునీిగా మార్చినట్లే,

               జాతులమీద తన కోపమును కూడ వెళ్ళగ్రక్కును.

24.         సన్మార్గులకు ఆయన మార్గములు              

               తిన్నగా ఉండును.

               కాని దుర్మార్గులకు అవి గోతులతో

               నిండియుండును.

25.        లోకారంభము నుండి ఆయన మంచివారి కొరకు

               మంచివస్తువులను, చెడ్డవారికొరకు

               చెడు వస్తువులను కలిగించెను.

26.        నరులకు కావలసిన ప్రాథమిక వస్తువులు:

               నీరు, నిప్పు, ఇనుము, ఉప్పు, పిండి, తేనె,

               పాలు, ద్రాక్షరసము, నూనె, బట్టలు.

27.         సత్పురుషులకివి అన్నియు మేలుచేయును.

               కాని దుర్మార్గులకివియే కీడు చేయును.

28.        ఆయన నరులను శిక్షించుటకు

               కొన్ని వాయువులను కలిగించెను.

               అవి భీకరముగావీచి మనుష్యులను దండించును.

               న్యాయనిర్ణయదినమున అవి ఉధృతముగా వీచి

               ప్రభువు కోపమును చల్లార్చునట్లు చేయును.

29.        నిప్పు, వడగండ్లు, కరవు, వ్యాధి నరులను

               శిక్షించుటకు సృజింపబడినవి.

30.        క్రూరమృగములు, తేళ్ళు, పాములు,

               దుష్టుల పనిబట్టు కత్తులు

               సంతోషముతో ప్రభువు ఆజ్ఞను పాించును.

31.          అవి ప్రభువును సేవించుటకు సిద్ధముగానుండును

               ఆయన ఆజ్ఞను సత్వరమే నెరవేర్చును.

32.        నేను మొదినుండియు ఈ సంగతిని

               రూఢిగా నమ్మితిని.

               బాగుగా ఆలోచించిన పిదపనే

               ఈ విషయములను లిఖించితిని.

33.        ప్రభువు చేసిన కార్యములన్నియు మంచివే,

               అన్ని అవసరములను ఆయన

               సకాలములో తీర్చుచుండును.

34.         ”ఇది దాని కంటె నాసిది”

               అని ఎవడును అనకూడదు,

               ప్రతిదియు దాని మేరలో అది మంచిదే.

35.        కనుక పూర్ణహృదయముతో

               ప్రభువును కీర్తింపుము.

               ఆయన నామమును సన్నుతింపుము.