ఎండిన ఎముకలు
37 1. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆయన ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతోనిండిన ఒకలోయ నడుమ దింపెను.
2. ఆయన నన్ను ఆ లోయలో అటునిటు త్రిప్పెను. దానినిండ ఎండిన ఎముకలు కలవు 3. ఆయన ”నరపుత్రుడా! ‘ఈ అస్థికలు మరల జీవింపగలవా?’ అని నన్నడిగెను. నేను ‘ప్రభూ! ఆ సంగతి నీకే తెలియును’ ” అంిని.
4. ఆయన నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలు కులు ఆలింపుడని చెప్పుము.
5. యావే ప్రభుడనైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను. ”నేను మీలోనికి ఊపిరిని పంపుదును. మీరు మరల జీవింతురు.
6. నేను మీకు నరములను, కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరినొసగి మీరు మరల బ్రతుకునట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు.”
7. ఆయన ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటపమను ధ్వనిపుట్టెను. ఎముకలు ఒక దానితో నొకి సంధించుకొనెను.
8. నేను చూచుచుండగనే నరములు, కండరములు చర్మము ఆ ఎముకలను కప్పెను. కాని వానిలో ఇంకను ప్రాణము లేదయ్యెను.
9. ప్రభువు నాతో నరపుత్రుడా! నీవు ఊపిరికి1 ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచన పూర్వక ముగా ఇట్లు చెప్పుము. ”ప్రభువు వాక్కిది. ఊపిరీ! నీవు నాలుగుదిక్కుల నుండి విచ్చేసి, హతులైన వీరిలో ప్రవేశించి వీరిని బ్రతికింపుము.”
10. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి.
11. అంతట ప్రభువు నాతో ”నరపుత్రుడా! ఈ ఎముకలు యిస్రాయేలీయులందరికి చిహ్నముగా ఉన్నవి. వారు ‘మేము అస్థికలవలె ఎండిపోయితిమి. మా ఆశ విఫలమైనది. మేము మృతులతో సమాన మైతిమి’ అని పలుకుచున్నారు.
12. కనుక నీవు యిస్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు. ”నా ప్రజలారా! నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరల యిస్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును.
13. నేను మీ సమాధులను తెరచి, మిమ్ము లేపునపుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.
14. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించునట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించునట్లు చేయుదును. అప్పుడు ప్రభుడనైన నేను మాట యిచ్చి చెప్పినట్లే చేసితినని గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.”
యూదా, యిస్రాయేలు ఏకరాజ్యమగును
15. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 16. ”నర పుత్రుడా! నీవు ఒక కఱ్ఱ తీసికొని దానిపై ‘యూదా మరియు వారి తోివారగు యిస్రాయేలీయులకు’ అని వ్రాయుము. అటుపిమ్మట మరియొక కఱ్ఱను తీసికొని దానిపై ‘ఎఫ్రాయీము కఱ్ఱ అనగా యోసేపు మరియు వారి తోివారగు యిస్రాయేలీయులకు’ అని వ్రాయుము.
17. అంతట ఆ రెండింని నిలు వుగా కలిపి ఒకే కఱ్ఱ అగునట్లుగా నీ చేతితో పట్టు కొనుము.
18. నీ ప్రజలు ‘దీని భావమేమి’ అని అడిగినప్పుడు వారితో యావే ప్రభుడనైన నా పలు కులుగా ఇట్లు చెప్పుము. 19. ‘నేను ఎఫ్రాయీమునకు, అతనికిచెందిన వారికిని సంబంధించిన యోసేపు కఱ్ఱను తీసికొని యూదా కఱ్ఱతో జోడింతును. ఆ రెండింని ఒకే కఱ్ఱగాచేసి నా చేతితో పట్టు కొందును.’
20. నీవు పేరులు లిఖించిన ఆ రెండు కఱ్ఱలను ప్రజలు చూచునట్లుగా నీ చేతితో పట్టుకొనుము.
21. ఆ జనులతో యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. ”నేను ప్రజలను చెల్లాచెదరైన జాతులనుండి తిరిగి రప్పింతును. వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొనివత్తును.
22. వారి దేశమున యిస్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరల రెండు జాతులు గాను, రెండు రాజ్యములుగాను చీలిపోరు.
23. వారు మరల రోతగొల్పు విగ్రహములద్వారా గాని, పాపకార్యముల ద్వారాగాని మలినాత్ములు కారు. నేను వారి పాపములనుండియు, ద్రోహముల నుండియు వారిని విముక్తిచేసి శుద్ధిచేయుదును. వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును.
24. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్కరాజు వారినేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాింతురు. 25. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును, వారి సంతతియు తరతరముల వరకు అచటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును.
26. నేను వారితో సమాధానార్ధమైన నిబంధనము చేసికొందును. అది నాకును, వారికిని నిత్యనిబంధనముగా ఉండును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారినడుమ శాశ్వతముగా నిలిచి యుండును.
27. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు.
28. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొలిపినపుడు ప్రభుడనైన నేను యిస్రాయేలును పవిత్రపరచువాడనని అన్యజాతులు గ్రహించును.”