1. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను.

2. ఏడవరోజు దేవుడు తాను చేయుచున్న పనియంతి నుండి విశ్రమించెను.

3. సృష్టిని పూర్తిచేసి ఏడవరోజున దేవుడు తాను చేసిన, సృజించిన తన పని అంతి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని ‘పవిత్రదినము’గా చేసెను.

4. భూమ్యాకాశముల  సృష్టి వృత్తాంతము ఇదియే.

సృష్టి – రెండవ కథనము

దేవుడైన యావే2 భూమిని ఆకాశమును సృష్టించి ననాడు, 5. నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన దేవుడు భూమిమీద వానలు కురి పింపలేదు. నేలను సాగుచేయుటకు ఎవ్వడును లేడు.

6. కాని భూమి నుండి నీియావిరి పెల్లుబికి నేలనెల్ల తడుపుచుండెను.

7. అప్పుడు దేవుడైన యావే నేలమ్టిని కొంత తీసికొని, దానినుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను.

ఏదెను తోట

8. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను.

9. చూచుటకు ఇంపుగానుండి, తినుటకు తియ్యగానుండు పండ్లనిచ్చు చెట్లన్నియు ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోటనడుమ జీవమిచ్చుచెట్టు, మంచిచెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపచేసెను.

10. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది నాలుగు పాయలుగా చీలెను.

11. మొదిపాయ పేరు పీషోను. అది హవీలా దేశమును చ్టుిపారును.

12. ఆ దేశమున మేలిమి బంగారమును, మంచిగుగ్గిలమును, గోమేధికములును దొరకును.

13. రెండవపాయ పేరు గీహోను. అది కూషు దేశమును చ్టుి పారుచుండును.

14. మూడవ పాయ పేరు ిగ్రిసు3. అది అస్సిరియాకు తూర్పున ప్రవహించును. నాలుగవపాయ యూఫ్రీసు4.

15. దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదెను తోటను సాగుచేయుటకును, కాచుటకును దానిలో ఉంచెను.

16. ”నీవు తోటలో ఉన్న ప్రతిచెట్టు  పండును నిరభ్యంతరముగా తినవచ్చును.

17. కాని మంచిచెడులనెంచు తెలివినిచ్చు చెట్టునుండి మాత్రము తినరాదు. నీవు వాిని తినుదినమున తప్పక చని పోవుదువు” అని దేవుడయిన యావే నరుని ఆజ్ఞా పించెను.

18. అంతట దేవుడైనయావే ”నరుడు ఒంటరిగా జీవించుట మంచిదికాదు. అతనికి సాియైన తోడును సృష్టింతును” అని అనుకొనెను.

19. కావున దేవుడైన యావే నేలనుండి అన్నిరకముల మృగములను, పకక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి, వానినన్నిని అతని కడకు కొనితెచ్చెను. వానికి నరుడు ప్టిెన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి.

20. ఇట్లు అన్నిరకముల పెంపుడు జంతువులకు, పకక్షులకు, క్రూరమృగములకు నరుడు పేర్లు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరును దొరకలేదు.

21. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢనిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునపుడు ఆయన అతని ప్రక్కటెముకనొకదానిని తీసి, ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను.

22. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి, దేవుడైన యావే ఆమెను అతనికడకు తోడ్కొనివచ్చెను.

23. అప్పుడు నరుడు ”చివరకు ఈమె నా విందైనది ఈమె నా ఎముకలలో ఎముకనా దేహములో దేహము

ఈమె నరునినుండి రూపొందినది కావున నారియగును” అనెను.

24. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనిపోవును. వారిరువురు ఏక శరీరులగుదురు.

25. అప్పుడు ఆ స్త్రీపురుషులిద్దరు దిసమొలతోనుండిరి. అయినను వారికి సిగ్గు వేయలేదు.

Previous                                                                                                                                                                                          Next                                                                                     

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము