యిస్రాయేలీయుల పాపములు, వారికి శిక్ష
ప్రజలదుష్టత్వము
4 1. యిస్రాయేలీయులారా!
మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు.
ఆయన ఈ దేశప్రజలపై
ఇట్లు నేరము తెచ్చుచున్నాడు.
దేశమున సత్యమును, కనికరమును,
దైవజ్ఞానమును బొత్తిగాలేవు.
2. ప్రజలు మాట తప్పుచున్నారు, కల్లలాడుచున్నారు.
హత్య, చౌర్యము,
వ్యభిచారములకు పాల్పడుచున్నారు.
నేరములు పెరిగిపోవుచున్నవి.
హత్యలు వరుసగా జరిగిపోవుచున్నవి.
3. కావున దేశము బెట్టచే ఎండిపోవును.
జీవకోి నశించును.
మృగములు, పకక్షులు, చేపలుకూడ చచ్చును.
యాజకులమీద నేరము
4. ప్రభువిట్లనుచున్నాడు:
ప్రజలనెవరును నిందింపనక్కరలేదు.
యాజకులారా! నేను మీపైన నేరముతెచ్చెదను.
5. మీరు రేయింబవళ్ళు తప్పులు చేయుచున్నారు.
ప్రవక్తలకూడ మీకంటేనేమియు మెరుగుకాదు.
నేను మీ తల్లియైన
యిస్రాయేలును నాశనము చేయుదును.
6. నా ప్రజలు దైవజ్ఞానము లేక చెడుచున్నారు. మీరు దైవజ్ఞానమును నిరసించినట్లే
నేను మీ యాజకత్వమును నిరసింతును.
మీరు నా ఉపదేశమును విస్మరించితిరిగాన,
నేను మీ తనయుల
యాజకత్వమును విస్మరింతును.
7. యాజకులారా! మీ సంఖ్య పెరిగినకొలది
మీ పాపములు కూడ పెరుగుచున్నవి
కనుక నేను మీకు కీర్తికి
బదులుగా అపకీర్తి రప్పింతును.
8. ప్రజల పాపములవలన
మీకు తిండి దొరకుచున్నది.
కావున జనులు
అధికముగా పాపము చేయవలెనని
మీరు కోరుచున్నారు.
9. అందుచే ఆ ప్రజలకువలె మీకును శిక్షపడును.
నేను మీ దుష్కార్యములకు
తగినట్లుగా మిమ్ము దండింతును.
మీ పాపఫలితమును మీరు అనుభవింతురు.
10. నన్ను విడనాడి పరదైవములను ఆశ్రయించితిరి.
కాన మీరు బలి అర్పణలను
భుజింతురుగాని మీ ఆకలితీరదు.
మీరు దేవతలపేరిట వ్యభిచరింతురు.
గాని సంతానము బడయజాలరు.
విగ్రహారాధన, వ్యభిచారము
11. ప్రభువు ఇట్లనుచున్నాడు:
క్రొత్తది ప్రాతదినైన మద్యమువలన
నా ప్రజలకు మతిపోయినది.
12. వారు కొయ్యముక్కలనుండి
దైవసందేశము అడుగుచున్నారు.
నేలలో పాతినకఱ్ఱలు
వారి ప్రశ్నలకు జవాబు చెప్పుచున్నవి.
వారు వ్యభిచారమువలన త్రోవతప్పిరి.
రంకువలన నానుండి వైదొలగిరి.
13. వారు పర్వతములపైన బలులర్పింతురు.
కొండమీది సింధూరముల, చీనారుల,
మస్తకి వృక్షముల పసందైన నీడలో
సాంబ్రాణిపొగ వేయుదురు.
కావుననే మీ కుమార్తెలు వేశ్యలగుచున్నారు.
మీ కోడండ్రు పడుపుగత్తెలగుచున్నారు.
14. అయినను నేను వారిని దండింపను.
ఎందుకన మీరే వేశ్యలతో వ్యభిచరించి,
వారితోకలిసి బలులు అర్పించుచున్నారు.
మతిలేని ప్రజలకు గతిలేదుకదా!
15. యిస్రాయేలీయులు
వ్యభిచారములో మునిగినను,
యూదా ప్రజలు పాపము చేయకుందురుగాక!
మీరు ఆరాధనకు గిల్గాలునకును,
బేతావెనునకును పోవలదు.
16. యిస్రాయేలీయులు
మొండి పెయ్యలవిం వారైరి
కనుక నేను వారిని గడ్డిమైదానములలో
గొఱ్ఱెపిల్లలనువలె మేపజాలను.
17. ఎఫ్రాయిము విగ్రహములపాలయ్యెను.
వానిని అటులనే ఉండనిమ్ము.
18. వారు మధువును సేవించి మత్తెక్కి
వ్యభిచారము మరిగి గౌరవమునకు
మారుగా అగౌరవమును తెచ్చుకొనిరి.
19. వారు గాలికి కొట్టుకొని పోయినట్లుగా
కొట్టుకొని పోవుదురు.
తామర్పించిన బలులవలన
అవమానము తెచ్చుకొందురు.