మెనెలాసు దుర్మరణము
13 1. నూటనలుబదితొమ్మిదవయేట1 యూదా మక్కబీయుడును, అతని అనుచరులును అంతియోకసు యూపతోరు పెద్ద సైన్యముతో యూదామీదికి దండెత్తి వచ్చుచున్నాడని గ్రహించిరి.
2. ఆ రాజు సంరక్షకుడు అతని మంత్రియు లీసియాసు కూడ అతనితో వచ్చు చున్నాడని వినిరి. మరియు ఆ రాజు గ్రీకు పదాతులు లక్షయిరువది వేల మందిని, రౌతులు ఐదువేల మూడు వందల మందిని, ఏనుగులు ఇరువది రెండిని, చక్రములకు వాడియైన కత్తులను అమర్చిన రథములు మూడు వందలను ప్రోగుజేసికొని వచ్చుచున్నాడ నియు వినిరి.
3. మెనెలాసు కపటముతో శత్రువుల కోపు తీసికొని వారిని ప్రోత్సహింప మొదలిడెను. అతనికి కావలసినది తాను ప్రధాన యాజకుడుగా కొనసాగు టయేగాని మాతృదేశపు మేలు కాదు.
4. కాని రాజాది రాజైన ప్రభువు, అంతియోకసును మెనెలాసు మీద విరుచుకొని పడునట్లుచేసెను. విపత్తులన్నికి కారణము ఆ దుర్మార్గుడేయని లీసియాసు రాజునకు ఎరిగించెను. కనుక రాజు మెనెలాసును బెరెయాకు కొనిపోయి ఆ పట్టణ సంప్రదాయము ప్రకారము అతనిని వధింపు డని ఆజ్ఞయిచ్చెను.
5. ఆ నగరమున డెబ్బదియైదు అడుగుల ఎత్తు గోపురము కలదు. దాని లోపలి భాగమును బూడిదతో నింపిరి. దానిపై అంచు గుండ్ర ముగానుండి క్రింది బూడిదవైపు వంగియుండెను.
6. దేవాలయము సొమ్మును అపహరించిన వారినిగాని, ఇతరములైన పెద్దతప్పులు చేసిన వారినిగాని ఆ గోపురము మీదికి తీసికొని వెళ్ళి, క్రింది బూడిద మీదికి పడద్రోసి చంపెడివారు.
7. దుర్మార్గుడు మెనెలాసును అదే చావుచచ్చెను. అతని శవమునకు ఖనన సంస్కారము కూడ లభింపదయ్యెను. 8. అి్ట చావు న్యాయసమ్మత మైనదే. అతడు చాలసారులు దేవాలయములోని పవిత్రమైన పీఠాగ్నిభస్మమును అపవిత్రము చేసెను. కనుక కడన బూడిదలోనే పడిచచ్చెను.
మోదెయిను యుద్ధమున యూదుల విజయము
9. అంతియోకసు తన దండయాత్రను కొన సాగించెను. అతడు యూదులను తన తండ్రికంటెగూడ ఘోరతమముగా శిక్షింపవలెనన్న క్రూరబుద్ధితో వచ్చెను.
10.ఈ వార్త విని యూదా తన ప్రజలను పిలిచి రేయింబవళ్ళు ప్రభువునకు మనవిచేయుడని చెప్పెను. పూర్వముకంటెగూడ అదనముగా ఆ ఆపత్కాలమున ప్రభువు తమ్ము ఆదుకోవలెనని విన్నపములు చేయుడని చెప్పెను.
11. వారి ధర్మశాస్త్రము, దేశము, పవిత్ర మందిరము నాశనము కానున్నవని నుడివెను. నూత్న ముగా స్వాతంత్య్రముపొందిన తమ దేశము మరల భక్తిహీనులైన అన్యజాతివారి స్వాధీనము కారాదని పలికెను.
12. ఎల్లరును యూదా ఆజ్ఞ పాించి మూడు నాళ్ళపాటు ఉపవాసముండిరి. వారు నేలమీద బోర గిలబడి కన్నీళ్ళు కార్చుచు కరుణాళువైన ప్రభువును ప్రార్థించిరి. అంతట యూదా వారికి ప్రోత్సాహము కలుగునట్లు మాటలాడి యుద్ధమునకు సన్నద్ధులుకండని చెప్పెను.
13. అతడు యూదనాయకులను వ్యక్తి గతముగా సంప్రతించెను. ఆంియోకసు యూదయా మీదికెత్తివచ్చి యెరూషలేమును ముట్టడించువరకు తాము యుద్ధమునకు తలపడకుండ మెదలకుండ ఉండుట మంచిదికాదని నిర్ణయించుకొనెను. దైవబల ముతో పోయి త్రోవలోనే రాజును ఎదుర్కొనుట శ్రేయస్కరమని తలంచెను.
14. అతడు జయాపజయ ములను సర్వసృష్టికర్తయైన ప్రభువునకే వదిలివేసెను. తన సైనికులు మాత్రము శౌర్యముతో పోరాడవలెనని చెప్పెను. వారు తమ ధర్మశాస్త్రము, దేవాలయము, నగరము, దేశము తమ ప్రత్యేక జీవితవిధానము మొదలైనవానికొరకు ప్రాణములర్పించుటకు కూడ సిద్ధముగానుండవలెనని హెచ్చరించెను. యూదులు మోదెయిను చేరువలో శిబిరము పన్నిరి.
15. యూదా తన అనుచరులు ”దేవునినుండి విజయము” అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను. అతడు ఆ రాత్రి తన సైన్యమున మహాశూరులైన యువకులను వెంటబెట్టుకొనిపోయి శత్రుశిబిరము నందు రాజు గుడారమునకు చేరువలోనున్న దళము మీదపడి రెండువేలమందిని వధించెను. అతని అను చరులు శత్రువుల ఏనుగులన్నిలో పెద్దదానిని, దాని మావి వానితోపాటు చంపిరి.
16. యూదా అతని వీరులు శత్రు శిబిరమునందెల్ల భయము, కలవరము ప్టుించి విజయము చేప్టి తిరిగివచ్చిరి.
17. అప్పుడే తెలతెలవారుచుండెను. ప్రభువు శత్రువునుండి యూదాను రక్షించుటవలన ఈ విజయము సిద్ధించెను.
అంతియోకసు యూదులతో సంధిచేసికొనుట
18. రాజు యూదుల పరాక్రమమును చవి చూచెను కనుక యుక్తితో వారి దుర్గములను పట్టుకో చూచెను.
19. అతడు యూదుల బలమైన దుర్గమగు బేత్సూరును ముట్టడించెను. కాని యూదులు అతనిని ఓడించి తరిమిక్టొిరి.
20. యూదా ఆ దుర్గమును రక్షించువారికి ఆహారపదార్థములను పంపెను.
21. కాని రోడోకసు యూదసైనికుడు శత్రువులకు రహస్య సమాచారము అందించెను. వారు అతనిని గుర్తుప్టి బంధించిరి.
22. రాజు బేత్సూరు దుర్గరక్షకులతో సంధి చేసికొనుటకు రెండుసారులు యత్నము చేసెను. ఆ సంధి కుదిరిన తరువాత అతడు తన సైన్యమునచి నుండి మరలించుకొనిపోయెను. అటు తరువాత అతడు యూదా మీదికి దాడిచేసెనుగాని మరల ఓడిపోయెను.
23. అంతలో అంియోకియాలో రాజ్య వ్యవహారములను పర్యవేక్షించుచున్న ఫిలిప్పు రాజు మీద తిరుగుబాటు మొదలుపెట్టెనని వార్తలు వచ్చెను. ఈ సమాచారము విని అంతియోకసు దిగ్భ్రాంతి చెందెను. అతడు యూదులతో సంధి చేసికొనగోరెను. వారు నిర్ణయించిన షరతులకు అంగీకరించెను. వారి హక్కులను న్యాయబుద్ధితో మన్నింతునని మాట ఇచ్చెను. యూదులతో సంధికుదుర్చుకొని బలినర్పించెను. దేవాలయమునకు ఉదారముగా కానుకలు అర్పించి దానిపట్ల గౌరవము ప్రదర్శించెను.
24. తనను దర్శింపవచ్చిన మక్కబీయునియెడల దాక్షిణ్యము చూపెను. ప్టోలమాయిసునుండి గెరారువరకుగల దేశమునకు హెగెమోనిడెసును రాష్ట్రపాలకునిగ నియ మించెను.
25. తరువాత రాజు ప్టోలమాయిసునకు వెళ్ళిపోయెను. అచి ప్రజలు రాజు యూదులతో చేసికొనిన సంధినిగూర్చి ఆగ్రహముచెందిరి. ఆ సంధిని రద్దు చేయవలెనని కోరిరి.
26. కాని లీసియాసు వేదికమీదికెక్కి సంధిని సమర్థించుచు మాటలాడి ప్రజలను ఒప్పించెను. కడన వారు సంధిని అంగీకరించి అలజడిని మానుకొనిరి. అటుపిమ్మట అతడు అంతియోకియాకు వెడలిపోయెను.
రాజు యూదా మీదికి దాడిచేసి వెనుదిరిగి పోయిన వృత్తాంతమిది.