ప్రభువు ఎదోమును శిక్షించును

35 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! ఎదోమువైపు తిరిగి దానిని ఖండింపుము.

3.  నీవు ఆ దేశముతో ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము: ఎదోము పర్వతమా! నేను నీకు శత్రువునగుదును. నేను నిన్ను నిర్మానుష్యమైన ఎడారి కావింతును.

4. నీ నగరములను నాశనము చేయు దును. నీ భూమి ఎడారి అగును. అప్పుడు నీవు     నేను ప్రభుడనని గుర్తింతువు. 

5.  నీవు యిస్రాయేలునకు దీర్ఘకాల విరోధివి. వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని కత్తివాతబడనిచ్చి తివి.

6. కనుక నా జీవముతోడు, ప్రభుడనైన నా పలుకులివి. నీవు మృత్యువాతబడుదువు. రక్తము నిన్ను తరుమును. నీకు రక్తము ఇష్టమాయెను కనుక, రక్తమే నిన్ను తరుమును.

7. నేను సెయీరు పర్వతసీమను ఎడారి చేయుదును. దానిగుండ పయనించు వారిని అందరిని  చంపుదును.

8. కొండలను శవములతో నింపుదును. యుద్ధమున కూలిన వారి శవములు కొండలను లోయలను నింపును. 9. నేను నీ పట్టణము లను కలకాలము వరకు నిర్మానుష్యము కావింతును. నీ నగరములలో ఇంకెవరును వసింపరు. అప్పుడు నేను ప్రభుడనని నీవు గ్రహింతువు.

10. ‘యూదా యిస్రాయేలు జాతులు రెండును వాని రాజ్యములతోపాటు నాకే చెందినవి’ అని నీవు పలికితివి. యావే అచటనుండినను వాిని స్వాధీనము చేసుకొందుననుకొింవే.

11. నా జీవముతోడు, ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నీవు నా ప్రజలపట్ల చూపిన కోపమునకు, ద్వేషమునకు, అసూయకు నేను నీకు ప్రతీకారము చేయుదును. నీవు నా ప్రజలకు చేసిన అపకారమునకుగాను, నేను నిన్ను శిక్షించితినని వారు గ్రహింతురు.

12. నీవు తృణీకార భావముతో యిస్రాయేలు కొండలు నిర్మానుష్యమైన వనియు, నీవు వానిని మ్రింగివేయుటకు సిద్ధముగా నున్నాను అనియు పలికితివి. ఆ మాటలు ప్రభుడనైన నేను వింనని నీవు గ్రహింతువు.

13. నీవు గర్వ ముతో నాకు ప్రతికూలముగా పలికిన పలుకులు నేను వింని.

14. యావే ప్రభుడనైన నా పలుకిది. నేను నిన్ను ఎడారి కావింతును. లోకమెల్ల నీ పతనమును గాంచి హర్షించును. 15. నా సొంతదేశమైన యిస్రాయేలు పతనమును గాంచి నీవు హర్షించితివి. కావున నేను నీకు తగిన శాస్తి చేయుదును. సెయీరు కొండలును, ఎదోము దేశమెల్లను నిర్మానుష్యమగును. అప్పుడు ఎల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు.”