విగ్రహారాధనకు పురికొల్పు వారిని శిక్షింపవలయును
13 1. మీ ప్రజలనుండి ఒక ప్రవక్తకాని, కలలు కనువాడుగాని బయలుదేరి మీకొక అద్భుతకార్యమునో, గురుతునో చూపించి, 2. మీరిదివరకు ఎరుగని దైవములను అనుకరించి పూజించుటకు పోవుదము రండు అని మిమ్ము పురికొల్పవచ్చును.
3. మీరు అతని మాటలుగాని, కలలుగాని లెక్కచేయకుడు. ప్రభువు మీరు తనను పూర్ణహృదయముతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమింతురోలేదోయని ఆ నరునిద్వారా పరీక్షించుచున్నాడు.
4. మీరు ప్రభువును అను సరించుచు ఆయనకే భయపడుడు. ఆయన ఆజ్ఞలు పాించుచు ఆయనకే విధేయులుకండు. ఆ ప్రభువు మాట విని ఆయనను అంిపెట్టుకొని ఉండవల యును.
5. కాని ఆ ప్రభువు ఆరాధనము నుండి మిమ్ము వైదొలగింపజూచిన ఆ ప్రవక్తను లేక కలలు గాంచు వానిని మాత్రము సంహరింపుడు. మిమ్ము దాస్యగృహమునుండి విడిపించినది, ఐగుప్తునుండి తోడ్కొనివచ్చినది ప్రభువేకదా! ఆ దుష్టుడు ప్రభువు నిర్ణయించిన మార్గమునుండి మిమ్ము పెడత్రోవ ప్టించువాడు. కనుక అతనిని మీ నుండి తొలగింప వలయును.
6. మీ సోదరుడుకాని, కుమారుడు లేక కుమార్తె కాని, ప్రియభార్యకాని, ఆప్తమిత్రుడుకాని మీరు, మీ పూర్వులు ఎరుగని అన్యదైవములను ఆరాధించుటకు పోవుదమురండు అని మిమ్ము రహస్యముగా ప్రోత్స హింపవచ్చును.
7. మీకు దాపులోనున్న ప్రజల దైవము లను కాని లేక దూరముననున్న ప్రజల దైవములను కాని ఆరాధించుటకు మిమ్ము పురికొల్పవచ్చును.
8. అి్టవాని ప్రలోభమునకు మీరు లొంగరాదు. వాని మాటలు కూడ వినిపించుకోరాదు. అతనిమీద దయ చూపరాదు. అతనిని క్షమింపరాదు, అతని తప్పును కప్పిపుచ్చరాదు.
9. అతనిని వెంటనే వధింపుడు. నీవే అతనిమీద మొదిరాయి విసురుము. తరువాత ఇతరులు రాళ్ళు విసరుదురు.
10. దాస్యగృహమైన ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువునుండి మిమ్ము వైదొలగింపజూచెను గనుక వానిని మీరు రాళ్ళతోక్టొి చంపవలసినదే.
11. అప్పుడు యిస్రా యేలీయులెల్లరు ఇది విని భయపడుదురు. వారు మరల అి్ట చెడ్డపని చేయుటకు సాహసింపరు.
12-13. మీరు ప్రభువు మీకొసగిన పట్టణము లలో వసించునపుడు మీలో కొందరు దుర్మార్గులు క్రొత్తదైవములను పూజించుటకు తమ నగరవాసులను మభ్యప్టిెరని వార్తలు వినిపింపవచ్చును.
14. అప్పుడు మీరు అసలు సంగతి నిజమోకాదో జాగ్రత్తగా విచారింపుడు. కాని అి్టపని జరిగినమాట నిజమేనని తెలియవచ్చినచో, 15. ఆ పట్టణ ప్రజలనందరిని కత్తితో వధింపుడు. అచి పశువులనెల్లచంపుడు. 16. ఆ నగరపౌరుల వస్తువులనెల్ల కొనివచ్చి రచ్చబండవద్ద కుప్పవేయుడు. ఆ నగరమును దానిలోని సమస్త వస్తువులను శాపముపాలుచేసి ప్రభువునకు దహన బలిగా కాల్చివేయుడు. ఆ పట్టణము శాశ్వతముగా పాడుపడిపోవును. మరల అచట ఎవ్వరును గుమ్మము లెత్తరాదు.
17. అటుల శాపముపాలైన నగరము నుండి మీరేమియు తీసికొనరాదు. అప్పుడు ప్రభువు తన తీవ్రకోపమును ఉపసంహరించుకొని మీమీద కనికరము చూపును. ఆయన మిమ్ము కరుణించి పూర్వము తాను మీ పితరులకు వాగ్ధానము చేసినట్లే మిమ్ము అధిక సంఖ్యాకులను చేయును.
18. నేడు నేను మీకు విధించిన ఈ ఆజ్ఞలెల్లపాించి ప్రభువునకు విధేయులగుదురేని, ఆయన సమక్షమున ధర్మబద్ధ ముగా జీవింతురేని, మీరుతప్పక అధిక సంఖ్యాకుల గుదురు.