విజయ గీతము

ప్రధానగాయకునికి దావీదు రచించిన గీతము

68 1.     దేవుడు లేచునుగాక!

                              ఆయన శత్రువులు చెల్లాచెదరగుదురుగాక!

                              ఆయనను ద్వేషించువారు

                              పారిపోవుదురుగాక!

2.           ఆయన వారిని పొగనువలె చెదరగొట్టునుగాక!

               నిప్పు ఎదుట మైనమువలె

               దేవుని ఎదుట దుష్టులు కరగిపోవుదురుగాక!

3.           కాని నీతిమంతులు దేవునిగాంచి సంతసింతురు.

               వారు మహానందము చెందుదురుగాక!

4.           ప్రభువు మీద పాటలు పాడుడు,

               ఆయన నామమును కీర్తింపుడు.

               మేఘములపై స్వారిచేయు

               దేవునికి మార్గము సిద్ధము చేయుడు.

               ఆయన పేరు ప్రభువు,

               ఆయనను జూచి సంతసింపుడు.

5.           పవిత్రమందిరమున వసించుదేవుడు

               అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరువు.

6.           దేవుడు ఒంటరివానికి ఇంినొసగును.

               బందీలను చెరనుండి విడిపించి

               వృద్ధిలోనికి తెచ్చును.

               అతనిమీద తిరుగుబాటు చేయువారు మాత్రము

               మరుభూమిలో వసింపవలెను.

7.            దేవా! నీవు నీ ప్రజలను నడిపించుచు

               ఎడారిగుండ కదలిపోయినపుడు

8.           సీనాయి దేవుడవైన నిన్నుచూచి,

               యిస్రాయేలు దేవుడవైన నిన్నుగాంచి

               భూమి కంపించినది, ఆకసము వర్షించినది.

9.           నీవు వానను మిక్కిలిగా కురియించి

               సొలసియున్న నీ వారసత్వపు భూమికి

               సత్తువను ఒసగితివి.

10.         నీ ప్రజలు ఆ నేలమీద నివాసము

               ఏర్పరచుకొనిరి.

               ఉదారబుద్ధితో నీవు పేదల అక్కరలు తీర్చితివి.

11-12. దేవుడు ఆజ్ఞ ఇచ్చెను.

               ”రాజులు వారి సైన్యములతో పారిపోవుచున్నారు”

               అని చాలమంది వార్త తీసికొనివచ్చిరి.

               ఇండ్లపట్టున స్త్రీలు కొల్లసొమ్ము పంచుకొనిరి.

13.          వారు గొఱ్ఱెలదొడ్డిలో నివసించినప్పికి,

               ఆ ఉవిదలు వెండితో కప్పిన

               పావురపు రెక్కలవలె నొప్పిరి.

               తళతళ మెరయు పావురపు

               బంగారు రెక్కలవలె చూప్టిరి.

               మీరు మాత్రము గొఱ్ఱెల దొడ్లలో

               కాలక్షేపము చేసితిరి.

14.          అచట మహోన్నతుడైన ప్రభువు

               రాజులను చెదరగ్టొి,

               సొలోమోను కొండమీద మంచు కురియించెను.

15.          బాషానుకొండ మహాపర్వతము.

               అది అనేక శిఖరములతో అలరారు పర్వతము.

16.          బాషానూ! నీవు నీ ఉన్నత శిఖరములతో

               దేవుడు స్వయముగా వసింపగోరిన

               పర్వతమును చిన్నచూపు చూడనేల?

               ప్రభువు ఆ కొండమీద శాశ్వతముగా వసించును.

17.          ప్రభువు వేలకొలది మహారథములతో

               సీనాయినుండి

               తన పవిత్రస్థలమునకు ఏతెంచుచున్నాడు.

18.          ఆయన చాలమంది బందీలను వెంటగొని

               తన ఉన్నతపర్వతమును అధిరోహించెను.

               తిరుగుబాటుచేయు వారినుండి

               కానుకలు గైకొనెను.

               దేవుడైన ప్రభువు అచట నివాసము చేయును.

19.          దినదినము మన భారములు మోయు

               ప్రభువునకు స్తుతి కలుగునుగాక!

               మనలను రక్షించువాడు ఆయనే!

20.        మన దేవుడు రక్షణమును దయచేయువాడు.

               దేవుడైన యావే మనలను

               మృత్యువు నుండి తప్పించును.

21.          ప్రభువు తన విరోధుల శిరములు పగులగొట్టును.

               దౌష్ట్యమును విడనాడని

               వారి కపాలములు బ్రద్దలుచేయును.

22.         ”నేను బాషానునుండి మీ శత్రువులను

               మరలించుకొని వచ్చెదను.

               సముద్రగర్భమునుండి వారిని కొనివచ్చెదను.

23.         మీ పాదములను వారి నెత్తుిలో కడుగుదురు.

               మీ కుక్కలు వారి రక్తమును నాకును”

               అని ప్రభువు బాసచేసెను.

24.         దేవా! నీ ఊరేగింపును ఎల్లరును జూచిరి.

               నా దేవుడవు నా రాజువైన నీవు

               దేవాలయమునకు విజయము చేయుచుండగా

               ఎల్లరును గాంచిరి.

25.         అపుడు కీర్తనలు పాడువారు ముందు నడచిరి.

               తంత్రీవాద్యములు మీటువారు వెనుక వచ్చిరి.

               తంబురలు వాయించు యువతులు

               మధ్యనడచిరి.

26.        ”భక్తసమాజమున ప్రభువును స్తుతింపుడు.

               యిస్రాయేలు ఊటనుండి ఉద్భవించిన

               ప్రజలారా! ప్రభువును వినుతింపుడు.”

27.         మొదట చిన్నదైన బెన్యామీను తెగ వచ్చును.

               తరువాత యూదా నాయకులు

               తమ బృందములతో వత్తురు.

               అటుపిమ్మట సెబూలూను,

               నఫ్తాలి అధిపతులు వత్తురు.

28-29. ప్రభూ! రాజులు కానుకలు తెచ్చెడి

               యెరూషలేములోని నీ మందిరమునుండి

               నీ బలమును ప్రదర్శింపుము.

               నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని

               మరల చూపెట్టుము.

30.        రెల్లులోని మృగమును చీవాట్లు పెట్టుము.

               ఎద్దులగుంపును, దూడలను, జనులను

               మందలింపుము.

               వారు నీకు దండము ప్టిె తమ వెండిని

               నీకు అర్పించువరకును నీవు వారిని గద్ధింపుము. యుద్ధకాముకులను చెల్లాచెదరు చేయుము.

31.          ఐగుప్తునుండి రాయబారులు వత్తురు.

               ఇతియోపీయులు చేతులెత్తి

               దేవునికి ప్రార్థన చేయుదురు.

32.         లోకములోని రాజ్యములారా!

               దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు.

33.         పురాతనమైన ఆకాశవాహనముపై

               స్వారిచేయు ప్రభువును కీర్తింపుడు.

               అతడు మహానాదముతో గర్జించును, వినుడు.

34.         ప్రభువు బలమును చాటుడు, ఆయన బలము

               యిస్రాయేలీయులను క్రమ్మియున్నది.

               ఆయన శక్తి ఆకసమున తేజరిల్లుచున్నది.

35.         దేవుడు తన మందిరమున ఆశ్చర్యకరుడై ఒప్పును.

               ఆయన యిస్రాయేలు దేవుడు

               తన ప్రజలకు శక్తిని,

               బలమును దయచేయువాడు.

               ఆ దేవునికి స్తుతి కలుగునుగాక!

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము