హింసలకు గురియైన

పుణ్యపురుషుని ప్రార్థన

బెన్యామీను వంశస్తుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు మహాతాపముతో యావేకు పాడిన కీర్తన

7             1.ప్రభూ! నేను నిన్ను శరణు వేడుచున్నాను.

               నన్ను వెన్నాడు శత్రువులనుండి నన్ను రక్షింపుము.

2.           లేదేని వారు సింహమువలె

               నన్ను ఖండతుండెములుగ చీల్చివేయుదురు.

               వారు నన్ను ఎత్తుకొని పోవుదురు.

               అపుడు నన్ను ఎవరు రక్షింపగలరు?

3.           ప్రభూ! నేను దుష్కార్యములు చేసినచో,

4.           ఉపకారము చేసిన నా మిత్రునికి

               అపకారము చేసినచో, నా విరోధిని

               నిష్కారణముగా దోచుకొని  కీడుచేసినచో,

5.           నా శత్రువులు నన్ను తరిమి పట్టుకొందురుగాక! నన్ను క్రిందపడవేసి చంపి,

               నా ప్రాణమును మ్టిపాలు చేయుదురుగాక! నన్ను నిర్జీవునిగా నేలమీద వదలివేయుదురుగాక!

6.           ప్రభూ! నీవు కోపము తెచ్చుకొని పైకిలెమ్ము.

               నాపై ఆగ్రహముచెందిన

               శత్రువులమీదికి ఎత్తిరమ్ము.

               నన్నాదుకొనుటకై శీఘ్రమే మేల్కొనుము,

               వారికి తీర్పునిమ్ము.

7.            జాతులనెల్ల నీ చుట్టు ప్రోగుచేయుము.

               పరమునుండి వారిమీద

               పరిపాలనము చేయుము.

8.           ప్రభూ! నీవు సకలజాతులకు తీర్పుతీర్తువు.

               నా నీతిని, నా యదార్ధతకు తగినట్లుగా

               నాకు తీర్పుచెప్పుము.

9.           హృదయములను పరిశీలించు నీతిగల దేవా!

               దుష్టుల దౌర్జన్యమును తుదమ్టుింపుము.

               నీతిమంతులను బహూకరింపుము.

               నీవు నీతిమంతుడవైన దేవుడవు,

               నరుల ఆలోచనలను, కోర్కెలను

               పరిశీలించువాడవు.

10.         దేవుడు నన్ను డాలువలె కాపాడును.

               అతడు సజ్జనులను రక్షించును.

11.           దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి

               అతడు పాపులనెల్లవేళల శిక్షించును.

12.          నరుడు తన పాపములకు పశ్చాత్తాపపడడేని,

               దేవుడు తన ఖడ్గమునకు పదునుపెట్టును,

               వింనివంచి ఎక్కుపెట్టును,

13.          మారణాయుధములను చేపట్టును,

               అగ్నిబాణములను రువ్వును.

14.          దుష్టుడు దుష్టాలోచనలతో నిండియుండును.

               వాని కడుపుననున్నది కుతంత్రములు,

               కనునది వంచనము.

15.          అతడు పెద్ద గోతిని త్రవ్వును.

               కాని తాను త్రవ్విన గోతిలో తానేకూలును.

16.          అతని దుష్టత్వము అతని నెత్తిమీదికే వచ్చును.

               అతడు చేయుహింస అతనినే బాధించును.

17.          ప్రభువు నీతికిగాను

               నేను అతనికి వందనములు అర్పింతును.

               మహోన్నతుడైన దేవుని కీర్తనలతో నుతింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము