రాజు విజయమును

పురస్కరించుకొని కృతజ్ఞతా స్తుతి

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

21 1.       ప్రభూ! నీవు ప్రసాదించిన

                              బలమునకుగాను రాజు సంతసించునుగాక! నీవు దయచేసిన విజయమునకుగాను

                              అతడు మిగుల హర్షించును.

2.           నీవతని కోరికలు తీర్చితివి,             

               అతని వేడుకోలును ఆలించితివి.

3.           అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి.

               అతడి తలమీద బంగారు కిరీటమును ప్టిెతివి.

4.           రాజు ఆయుష్షునిమ్మని వేడగా

               నీవు దయచేసితివి.

               అతనికి దీర్ఘాయువును ఒసగితివి.

5.           నీ సహాయమువలన

               రాజు మహామహిమను బడసెను.

               నీవతనికి కీర్తిప్రాభవములను దయచేసితివి.

6.           అతనికి శాశ్వతములైన

               దీవెనలను అనుగ్రహించితివి.

               నీ సాన్నిధ్యమువలన అతడు ప్రమోదము చెందును.

7.            రాజు ప్రభువును నమ్మును.

               మహోన్నతుని కరుణవలన

               అతడు నిత్యము రాజ్యముచేయును.

8.           నీ హస్తము నీ శత్రువులనెల్ల పట్టుకొనును.

               నీ కుడిచేయి

               నిన్ను ద్వేషించువారిని బంధించును.

9.           అతడు తాను విజయముచేయు దినమున

               ఆ విరోధులనెల్ల

               అగ్నిగుండమువలె దహించివేయును.

               ప్రభువు మహోగ్రుడై

               ఆ విరోధులను మ్రింగివేయును.

               అగ్ని వారిని కబళించివేయును.

10.         రాజు తన విరోధుల సంతానమును చంపును.

               వారి వంశజులనెల్ల మట్టుపెట్టును.

11.           ఆ విరోధులు అతనికి కీడు తలప్టిె

               అతనిమీద కుట్రలు పన్నినను

               ఫలితము దక్కదు.

12.          నీవు వారిమీద బాణములు రువ్వగా

               వారు వెన్నిచ్చి పారిపోవుదురు.

13.          ప్రభూ! నీవు బలముతో లెమ్ము.

               మేము నీ మహాశక్తిని కీర్తించి గానము చేసెదము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము