4 1. కుమారా! నీవు పేదవాని బ్రతుకుదెరువును
చెడగొట్టవలదు.
అతడిని ఆదుకొనుటలో ఆలస్యము
చేయనువలదు.
2. ఆకలిగొన్న వానికి ఆగ్రహము రప్పింపకుము.
అక్కరలో ఉన్నవాని కోపమును రెచ్చగొట్టకుము.
3. నిరాశ చెందియున్నవాని బాధలను
అధికము చేయకుము.
అతడు చేయి చాచి అడిగినచో జాప్యము చేయకుము
4. బిచ్చగాడు యాచించినపుడు నిరాకరింపకుము.
పేదవాని నుండి మొగము
ప్రక్కకు త్రిప్పుకొనకుము.
5. దరిద్రుని నుండి చూపు మరల్పకుము.
అతడు నిన్ను శపింపకుండునట్లు
చూచుకొనుము.
6. హృదయవేదనను భరింపజాలక
ఆ దరిద్రుడు నిన్ను శపించినచో
ప్రభువతని మొరను ఆలించును.
7. నీవు భక్తసమాజ మన్ననపొందుము.
అధికారములోనున్న వానికి తలయొగ్గుము.
8. పేదలు విన్నవించుకొను సంగతులు వినుము.
వారికి మర్యాదగా బదులు చెప్పుము.
9. పీడకుని బారి నుండి పీడితుని విడిపింపుము.
నీవు తీర్చుతీర్పులలో ఖండితముగానుండుము.
10. అనాథలకు తండ్రివలె నుండుము.
వితంతువులకు వారి భర్తవలె సాయపడుము.
అప్పుడు నీవు మహోన్నతుడైన
దేవునికి పుత్రుడవగుదువు.
అతడు నీ సొంత తల్లికంటెగూడ
అధికముగా నిన్ను ప్రేమించును.
విజ్ఞానమను ఉపాధ్యాయి
11. విజ్ఞానము తన బిడ్డలనుపెంచి
గొప్పవారిని చేయును.
తన చెంతకు వచ్చువారిని ఆదరించును.
12. విజ్ఞానమును ప్రేమించువాడు
జీవమునే ప్రేమించినట్లు.
విజ్ఞానముకొరకు వేకువనే లేచువాడు
ఆనందమును పొందును.
13. విజ్ఞానమును అర్జించువాడు
మిగుల గౌరవమును పొందును.
అతడెచికి వెళ్ళినను ప్రభువతనిని
దీవించుచునే యుండును.
14. విజ్ఞానమును సేవించుటయనగా పవిత్రుడైన
ప్రభువును సేవించుటే.
దానిని ప్రేమించు నరుని ప్రభువు ప్రేమించును.
15. దానికి లోబడియుండువారు జాతులకు తీర్పుతీర్తురు
దాని మాట పాించువారు
భద్రముగా బ్రతుకుదురు.
16. విజ్ఞానమును నమ్మువాడు
దానిని సంపాదించుకొనును
తన సంతతికి గూడ
దానిని వారసత్వముగా ఇచ్చి పోవును.
17. విజ్ఞానమును ఆర్జింపవలెనన్న
మొదట కష్టముగానుండును.
భయము, నిరుత్సాహము కలుగును.
అది తన్నార్జింపగోరు నరులను
కఠినమైన క్రమశిక్షణకు గురిచేయును.
తనకు నమ్మకము కలుగువరకు
వారిని పరీక్షించును.
18. కాని, అటు పిమ్మట అది ఆ నరులకు
సులువుగా దొరకిపోవును.
తన రహస్యములనెల్ల తెలియచేసి
వారిని సంతోషపెట్టును.
19. కాని ఆ నరులు తనను ఆనాదరము చేసినచో
అది వారిని విడనాడును.
వారి దుర్గతికి వారిని వదిలివేయును.
మన మతమునకుగాను మనము సిగ్గుపడరాదు
20. కుమారా! నీకు లభించిన అవకాశమును
సద్వినియోగపరచుకొనుము.
కాని దుష్టకార్యములకు పూనుకొనకుము.
నిన్ను చూచి నీవే సిగ్గుపడకుము.
21. వినయ వర్తనము గౌరవమును,
కీర్తిని తెచ్చిపెట్టును.
కాని తనను తాను తక్కువగా ఎంచుకొనుట
పాపహేతువు.
22. ఇతరులపట్ల గల మోజుచే నీ ఆత్మగౌరవమును
చెరచుకోవలదు.
నీ హక్కును వదలుకొని
స్వీయనాశనమును తెచ్చుకోవలదు.
23. అవసరము వచ్చినపుడు మౌనముగా ఉండకుము.
నీ విజ్ఞానమును దాచిపెట్టుకొనకుము.
24. మన మాటలవలననే కదా
మన విజ్ఞానము తెలియునది.
మన పలుకుల వలననేకదా
మన విద్య బయటపడునది.
25. అయినను సత్యవిరుద్ధముగా వాదింపకుము.
నీ అజ్ఞానమును నీవంగీకరింపుము.
26. నీ పాపములను ఒప్పుకొనుటకు సిగ్గుపడకుము.
ఏికి ఎదురీదరాదుకదా!
27. మూర్ఖుని చేతిలో కీలు బొమ్మవు కావలదు.
పలుకుబడి కలవారియెడ పక్షపాతము చూపవలదు
28. చావునకు గూడ తెగించి సత్యముకొరకు
పోరాడుము.
ప్రభువు నీ పక్షముననే యుద్ధముచేయును.
29. మాటలలో దిట్టతనముచూపి,
క్రియలలో సోమరితనము,
జాప్యము చూపుట పనికిరాదు.
30. నీఇంిలో సింహమువలె ప్రవర్తింపకుము.
నీ సేవకులను శంకింపకుము.
31. తాను తీసికొనునప్పుడు చేయిచాచుటయు
తానీయవలసివచ్చినపుడు
చేయిముడుచు కొనుటయు తగదు.