ఆదర్శప్రాయుడైన రాజు

దావీదు కీర్తన

101 1.     నేను కృపను గూర్చియు, న్యాయమును గూర్చియు పాడెదను. ప్రభూ! నా గీతమును నీకు విన్పించెదను

2.           నేను ధర్మమార్గమున ప్రవర్తించెదను.

               నీవు నా చెంతకు ఎపుడు వచ్చెదవు?

               నేను నా ఇంట విశుద్ధవర్తనుడనుగా జీవించెదను

3.           చెడు మీద నేను దృష్టి నిలుపను.

               దేవునినుండి వైదొలగువారి క్రియలను

               నేను అసహ్యించుకొందును.

               వారితో నాకు పొత్తులేదు.

4.           కపాత్ములను నా చెంతకు రానీయను.

               దుష్టులను అంగీకరింపను.

5.           తోడివారిమీద చాటుమాటున

               చాడీలు చెప్పువాని నోరుమూయింతును.

               పొగరుబోతును గర్వితుడునైన

               నరుని నేను సహింపను.

6.           విశుద్ధహృదయులను నేను అంగీకరింతును.

               వారు నా కొలువున ఉండవచ్చును.

               ఋజువర్తనులైన వారు నాకు సేవకులు అగుదురు.

7.            కపాత్ములకు నా ఇంట తావులేదు.

               కల్లలాడువాడు నాయెదుట నిలువజాలడు.

8.           నేను ప్రతి ఉదయము దేశములోని

               దుర్మార్గులనెల్ల నిర్మూలింతును.

               ప్రభువు నగరమునుండి

               దుర్జనులనెల్ల బహిష్కరింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము