న్యాయవంతుడైన దేవునికి విన్నపము

ప్రధానగాయకునికి                                

జిఫీయులు వచ్చి దావీదు మా వద్ద దాగియున్నాడు అని సౌలుతో చెప్పినపుడు, తంత్రివాద్యములమీద పాడదగిన దావీదు రచించిన ధ్యానకీర్తన

54 1.      దేవా! నీ శక్తితో నన్ను రక్షింపుము.

                              నీ బలముతో నాకు న్యాయము చేయుము.

2.           దేవా! నా మొర వినుము,

               నా పలుకులాలింపుము.

3.           గర్వితులు నా మీదికి వచ్చుచున్నారు.

               క్రూరులు నా ప్రాణములు తీయగోరుచున్నారు.

               వారు దేవుని లక్ష ్యము చేయుటలేదు.

4.           కాని దేవుడే నాకు సాయము చేయును.

               ప్రభువే నన్నాదుకొనును.

5.           దేవుడు నా శత్రువుల దుష్టత్వమును

               వారి మీదికే త్రిప్పికొట్టునుగాక!

               ఆయన నమ్మదగినవాడు కనుక

               నా విరోధులను నాశనము చేయునుగాక!

6.           ప్రభూ! నేను సంతసముతో నీకు బలినర్పింతును.

               శ్రేష్ఠమైన నీ నామమునకుగాను

               నీకు వందనములు అర్పింతును.

7.            సకల ఆపదలనుండియు నీవు నన్ను కాపాడితివి.

               నేను నా శత్రువుల ఓటమిని గాంచితిని.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము