25 1. ఇరువురు యిస్రాయేలీయులు తగాదాపడి న్యాయస్థానమునకు వెళ్ళినపుడు అచి అధిపతులు దోషిని దోషిగా, నిర్దోషిని నిర్దోషిగా నిర్ణయింపవల యును.

2. దోషికి శిక్ష విధింపవలసివచ్చినచో న్యాయాధిపతి అతనిని నేలమీద బోరగిల పరుండ బ్టెించును. అతని అపరాధమునకు తగినన్ని కొరడా దెబ్బలు విధించి క్టొించును.

3. దోషికి నలుబది దెబ్బలు విధించినచాలు. అంతకంటె ఎక్కువ దెబ్బలు విధించినచో తన సహోదరుని బహిరంగముగా అవమానపరచినట్లగును.

4. కళ్ళము తొక్కించునపుడు ఎద్దు మూతికి చిక్కముపెట్టరాదు.

దేవరన్యాయము

5. ఇరువురు సోదరులు కలసి నివసించు చుండగా ఒకడు సంతానములేక చనిపోయినచో, అతని వితంతువు అన్యకుటుంబపు పురుషుని వివాహ మాడరాదు. ఆమె పెనిమి సోదరుడు ఆమెను దేవర న్యాయము ప్రకారము పెండ్లి చేసుకొని తన సోదరునికి మారుగా భర్త ధర్మము నెరవేర్చవలెను.

6. ఆమెకు ప్టుిన మొది కుమారుడు చనిపోయిన తన సోదరుని కుమారుడుగా గణింపబడును. ఆ రీతిగా యిస్రాయేలీ యులలో అతని కుటుంబము తుడిచిపెట్టుకొని పోకుండా, వర్ధిల్లును.

7. కాని ఆమె పెనిమి సోదరుడు ఆమెను చేపట్టనిచో ఆ వితంతువు పుర ద్వారము చెంతప్రోగైన పెద్దలయొద్దకుపోయి ‘నా పెనిమి సోదరుడు నాకు దేవరన్యాయము జరిగించు టకు ఒప్పుకొనుటలేదు. అతడు తన సోదరుని సంతానము యిస్రాయేలీయులలో వర్ధిల్లుటకు ఇష్ట పడుటలేదు” అని చెప్పవలయును.

8. అప్పుడు పెద్దలతనిని పిలిపించి మ్లాడవలయును. అతడు అంగీకరింపడేని, 9. ఆ వితంతువు పెద్దలు చూచు చుండగా అతని చెంతకు వెళ్ళి అతని కాలిచెప్పును ఊడబెరుకవలయును. అతని ముఖమున ఉమ్మివేసి ‘సోదరునికి సంతానము కలిగింపని వానికట్లే జరుగును’ అని పలుకవలయును.

10. ఆ మీదట యిస్రాయేలీయులలో అతని కుటుంబము ‘చెప్పు ఊడదీయబడిన వాని కుటుంబము’ అని నిందకెక్కును.

స్త్రీ పాింపవలసిన మర్యాద

11-12. ఇరువురు పురుషులు ప్లోాడుకొను నపుడు వారిలో ఒకని భార్య, శత్రువు దెబ్బల నుండి పెనిమిని కాపాడుకొనుటకు ముందుకువెళ్ళి ఆ శత్రువు జననేంద్రియమును పట్టుకొనెనేని ఆమె చేతిని నిర్దయతో నరికివేయవలయును.

తూకములు, కొలతలు

13. మీరు ఒకి పెద్దది ఒకి చిన్నదిగా ఉండు నట్లు రెండుతూకపురాళ్ళు వాడరాదు.

14. ఒకి పెద్దది ఒకి చిన్నదిగా రెండు కొలమానములను ఉపయోగించరాదు.

15. సరియైన తూకపురాయి ఒక్కదానినే, సరియైన కొలమానమునొక్కదానినే మీచెంతన ఉంచుకొనుడు. అప్పుడు యావే మీకు ఈయ నున్న ఆ నేలమీద మీరు చిరకాలము జీవింతురు.

16. ఇి్ట మోసములు చేయువానిని దేవుడైన ప్రభువు అసహ్యించుకొనును.

అమాలెకీయులను మట్టుపెట్టవలయును

17. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు అమాలెకీయులు మీకేమి చేసిరో జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

18. వారు మీ వెనువెంటవచ్చి మీలో వెనుకబడి నడువలేని దుర్బలులను వధించిరి. ఆ రీతిగా వారు దైవభయము ఏమాత్రము లేక అలసిసొలసియున్న వారిని చంపిరి.

19. యావే మీకు ఆ నేలనిచ్చి మీ చుట్టుపట్లనున్న శత్రువులనుండి మీకు భద్రతను దయచేసినపుడు మీరు ఈ నేలమీద అమాలెకీయుల అడపొడ కానరాకుండచేయుడు. ఈ సంగతి మరచి పోవలదు.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము