ఉపోద్ఘాతము:

పేరు: యోనా అనగా ”పావురము” అని అర్థము. యోనా అమిత్తయి కుమారుడు (2 రాజు 14:25). ఇతను రెండవ యెరోబాము కాలమున  క్రీ.పూ. 8వ శతాబ్ధములో జీవించెనని తెలియును. దీని ఆధారముగా యోనా యిస్రాయేలు రాచరికవ్యవస్థ కాలమునాివాడని ఒక అభిప్రాయము.

కాలము: యోనాగ్రంథము 5వ లేక 4వ శతాబ్ధములో యూదులు బబులోను వలస అనంతరము వ్రాయబడినది. 

చారిత్రక నేపథ్యము: క్రీ.పూ. 722లో అష్షూరు యిస్రాయేలును ఓడించినది. అష్షూరు దేశ ముఖ్యపట్టణమైన నీనెవెకు దేవుడు యోనాను పంపి వారిని పశ్చాత్తాపపడమని హెచ్చరించెను. ఇది యిస్రాయేలీయులకు కోపము ప్టుించినది. యావే దేవుడు తమ శత్రువులను కనికరించడము వారికి మింగుడుపడలేదు. నీనెవెకు వెళ్ళవలసిన యోనా తర్షీషునకు పారిపోవచూడగా, అతడు చిక్కులలో పడి సముద్రములో విసరివేయబడి చేప కడుపులో చేరెను.

ముఖ్యాంశములు: నీనెవె ప్రజలు దేవునికి విరోధులైరి కాబ్టి వారికి శిక్షతప్పదని యోనా హెచ్చరిక చేసెను. చెర అనంతరము యూదులు తమ ప్రత్యేకతను కాపాడుకొనుటకు పడిన కష్టములను ఈ గ్రంథము వివరించును. దేవుని కరుణ, జాలి యిస్రాయేలీయులకేకాదు పరివర్తనము చెందిన అన్నిజాతులకు లభిస్తుందనేది మరొక ముఖ్య సందేశము. దేవునిక్షమ విశ్వసనీయమైనది.

క్రీస్తుకు అన్వయము: క్రీస్తు తనను తాను యోనా ప్రవక్తతో పోల్చుకొనుటను సువార్తలలో చూస్తాము.  క్రీస్తు ప్రభువు  యోనాను ప్రస్తావించడము నూతన నిబంధన ప్రజలకు యోనా ప్రాముఖ్యతను చాినట్లైంది (మత్త 12:39-41). యోనా ఎదుర్కొన్న మరణానుభవము, అతనికి కలిగిన పునర్జీవానుభవము క్రీస్తు మరణ పునరుత్థానాలకు ఛాయాచిత్రాలుగా వుాంయి.  యోనాప్రవక్త జీవితలక్ష్యము క్రీస్తుకు చిహ్నంగా నిలుచును (లూకా 11:29-32).

Home

Previous                                                                                                                                                                                                    Next