23 1. నీవు గొప్పవానితో
భోజనము చేయబోవునపుడు
నీయెదుటనున్న భక్ష ్యములను
జాగ్రత్తగా గమనింపుము.
2. నీవు భోజన ప్రియుడవేని
నిన్ను నీవు అదుపులో పెట్టుకొనుము.
3. నీవతని రుచికరమైన పదార్థములకు
అమితముగా ఆశపడవద్దు.
అవి మోసపుచ్చు ఆహారములు.
4. ధనమును కూడబెట్టుకొనుటకు
అమితముగా శ్రమింపవలదు.
వివేకముతో ప్రవర్తింపుము.
5. నీవు చూచుచుండగనే
నీ సొత్తు నిమిషములో వెళ్ళిపోవును.
రెక్కలువచ్చి లేచిపోయిన గరుడపక్షివలె ఎగిరిపోవును
6. పిసినిగొట్టువాని ఇంట విందు ఆరగింపవలదు,
అతని ప్రశస్త భోజనమును ఆశింపవలదు.
7. అతడు ఇంకను కొంచెము భుజించుమని
ఇచ్చకములు పలుకునేగాని
వాని మాటలలో నిజము లేదు.
అతడు తన గొప్పతనమునుగూర్చి
తాను తలంచుకొనుచుండును.
8. నీవు వాని ఇంట తిన్నదికూడ వెళ్ళగ్రక్కుకొందువు.
అతనిపై నీవు కురియించిన పొగడ్తలు వ్యర్థమగును.
9. మూర్ఖునికి బోధింపగోరి
నీ పలుకులను వ్యర్థము చేసికోవలదు.
నీ విజ్ఞాన వాక్యములను అతడు మెచ్చుకొనడు.
10. పూర్వులు పాతిన గట్టురాళ్ళను కదలింపకుము. అనాథల పొలములను ఆక్రమించుకొనకుము.
11. బలాఢ్యుడైన ప్రభువు వారికోపు తీసికొనును.
నిన్ను కాదని వారిని సమర్థించును.
12. ఉపదేశములను జాగ్రత్తగా వినుము.
విజ్ఞాన వాక్యములను శ్రద్ధతో ఆలింపుము.
13. బాలుని శిక్షించుటకు వెనుకాడవలదు.
బెత్తముతో క్టొినచో వాడు చనిపోడు.
14. బెత్తముతోదండించినచో వానిని
మృత్యులోకమునుండి తప్పింపవచ్చును.
15. కుమారా! నీవు జ్ఞానమును ఆర్జించినచో
నేను ఆనందింతును.
16. నీవు సత్యవాక్యములు పలికినచో
నా అంతరంగము ప్రమోదము చెందును.
17. దుష్టులను చూచి అసూయచెందకుము.
ఎల్లవేళల నీవు దైవభక్తితో మెలగుము.
18. ఇట్లు చేయుదువేని భవిష్యత్తనునది ఉన్నది.
కనుక నీ ఆశలు వమ్ముగావు.
19. కుమారా!
నా పలుకులాలించి విజ్ఞానమును బడయుము.
నీ జీవితవిధానమునుగూర్చి
ఆలోచించి చూచుకొనుము.
20. నీవు త్రాగుబోతులతో కలియవద్దు.
భోజనప్రియులతో కూడవద్దు.
21. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు.
తిని, త్రాగి, తూలువారికి
చీలికలు పేలికలు తప్పవు.
22. నీకు పుట్టుకనిచ్చిన తండ్రి పలుకులాలింపుము.
నీ తల్లి వృద్ధురాలైనపుడు
ఆమెను ఆదరముతో చూడుము.
23. సత్యము, విజ్ఞానము, వివేకమనునవి
ఆదరముతో కొనదగినవి,
కాని చులకనచేసి అమ్మదగినవి కావు.
24. ధర్మాత్ముని కనిన జనకుడు సంతోషించును.
జ్ఞానికి పుట్టుకనిచ్చిన తండ్రి ప్రమోదము చెందును.
25. నీవు నీ తండ్రికి ఆనందమును,
నీ తల్లికి సంతసమును చేకూర్చుదువుగాక!
26. కుమారా! నా పలుకు లాలింపుము.
నా ఉపదేశమును జాగ్రత్తగా వినుము.
27. కులట లోతయిన గొయ్యివింది.
వ్యభిచారిణి బయికెక్కి రాలేని బావివింది.
28. ఆమె నీ కొరకు దొంగవలె పొంచియుండును. ఆమెవలన మోసపోయిన వారనేకులు కలరు.
29. మందభాగ్యులును, విచారగ్రస్తులును ఎవరు?
తగవులాడువారును, సంతృప్తి లేనివారును ఎవరు?
అనవసరముగా దెబ్బలు తినువారెవరు?
జేగురించిన కన్నులు కలవారెవరు?
30. నిరతము మితిమీరి మద్యమును సేవించువారు,
సుగంధము కలిపిన మద్యమును గ్రోలువారు.
31. అది పానపాత్రమున
ఎఱ్ఱగా నిగనిగలాడుచున్నను,
సులువుగా గొంతులోనికి దిగి జారిపోవునదైనను
నీవు దానికి భ్రమసి పోవలదు.
32. అంతయు అయిన తరువాత
అది పామువలె కరచును.
విషనాగమువలె కాటువేయును.
33. నీ కింకి వింత దృశ్యములు కన్పించును.
నీవు పిచ్చిమాటలు పలుకుదువు.
34. నీకు సముద్రపుటలలమీద ఉయ్యాలలూగినట్లు
ఓడలోని తెరచాప
కొయ్యమీద తూలియాడినట్లు తోచును.
35. ”వారు నన్ను క్టొిరి కాబోలు,
అయినను నాకు బాధ కలుగలేదు.
నన్ను మోదిరి కాబోలు, అయినను నాకు జ్ఞప్తిలేదు
నేను ఎప్పుడు మేలుకొందును?
మేల్కొనగనే మరల గ్రుక్కెడు త్రాగెదను” అని
నీవు ఏమేమో పలవరింతువు.