తూరు, సీదోనులను గూర్చి దైవోక్తి
23 1. తూరును గూర్చిన దైవోక్తి:
తర్షీషు నావలారా! మీరు శోకింపుడు.
మీ తూరు రేవు ధ్వంసమైనది.
ఆ నగరములోని ఇండ్లు ధ్వంసమైనవి.
కిత్తీమునుండి మరలివచ్చుచు మీరు
ఈ వార్తను వింరి.
2. సముద్రతీరవాసులారా! అంగలార్చుడి.
సముద్రము దాటుచుండు సీదోనువర్తకులు
తమ సరుకులతో నిన్ను నింపిరి.
3. మీరు మీ ప్రజలను సముద్రములకు
ఆవలికిపంపి షీహోరునది ధాన్యమును
నైలునది పంటనుకొనితెచ్చి,
ఎల్లజాతులతో వ్యాపారము చేయుచున్నారు.
4. సీదోను నగరమా! నీవు సిగ్గుపడుము.
సముద్రమును, దాని గర్భమును
”నేను ప్రసవవేదనను అనుభవింపలేదు
కుమారులను గాని, కుమార్తెలనుగాని పెంచలేదు”
అని పలుకును.
5. తూరు నాశనమైనదని విని,
ఐగుప్తీయులు విస్మయము చెందుదురు.
6. సముద్రతీరవాసులారా! మీరు శోకింపుడు.
తర్షీషునకు పారిపొండు.
7. ప్రాచీన కాలముననే స్థాపింపబడినదియు,
సంతోష నిలయమైనదియునగు
తూరు పట్టణమిదియేనా?
సముద్రతీర ప్రదేశములకు ప్రజలనంపి
అచట నూత్ననగరములను నిర్మింపజేసిన
పట్టణమిదియేనా?
8. తూరునగర వ్యాపారులు రాజులవింవారు.
ఆ నగరవర్తకులు లోకమున సుప్రసిద్ధులు.
అన్యులమీద పరిపాలనము నెరపు
తూరునకు ఈ దుర్గతి ప్టించినదెవరు?
9. సైన్యములకధిపతియైన ప్రభువే
ఈ నిర్ణయము చేసెను.
ఆ నగరవాసుల పొగరణచుటకును,
ఈ లోకమున ఘనులుగా
చలామణి అగువారిని మన్నుగరపించుటకును
ఆయన అటుల చేసెను.
10. తర్షీషు కుమారీ!
నీ దేశమునకు ఇంక నిర్బంధములేదు.
నైలునదివలె దానిమీదికి ప్రవహింపుము.
11. ప్రభువు సముద్రముమీద తన హస్తమునుచాచి
రాజ్యములను కూలద్రోసెను.
ఆయన తూరు ప్రజల వ్యాపారకేంద్రములను
నాశనముచేయ నిర్ణయించెను.
12. ప్రభువిట్లనెను:
”సీదోను కుమారీ! చెరపబడినదానా!
నీ ఆనందము అంతరించినది.
నీ జనులు పరపీడనకు గురియైరి.
నీ ప్రజలు ఓడనెక్కి కిత్తీమునకు పారిపోయినను,
అచటకూడ సురక్షితముగా మనజాలరు.”
13. అదిగో కల్దీయులను చూడుము!
తూరుమీదికి వన్యమృగములను విడిపించినదివారే.
వారే ముట్టడిమంచెలను క్టి
తూరుప్రాకారములను పడగ్టొిరి.
ఆ నగరమును నేలమట్టము చేసినదివారే.
14. తర్షీషు నావలారా! మీరు శోకింపుడు.
మీ తూరు రేవు ధ్వంసమైనది.
తూరు దాస్యము
15. ఆ కాలమున తూరు డెబ్బదియేండ్ల పాటు విస్మరింపబడును. ఇది ఒక రాజు జీవితకాలమునకు సరిసమానము. ఆ డెబ్బది యేండ్లు ముగిసినపిదప తూరు గతి ఈ ప్రసిద్ధమైన గీతములోని వేశ్యగతి విందగును.
16. ”విస్మ ృతికి గురియైన వేశ్యాంగనా!
నీవు తంత్రీవాద్యముతో నగరములోనికి పొమ్ము
వాద్యము మీి పాటలుపాడి
మరలప్రజలను ఆకర్షింపుము.”
17. డెబ్బదియేండ్లు ముగిసిన పిదప ప్రభువు తూరును దర్శించును. ఆ నగరము మరల వేశ్యా జీతమునకు భూమిమీద నున్న సమస్త రాజ్యములతో వ్యభిచారము చేయును. 18. వేశ్యజీతముగానున్న దాని వర్తక లాభము ప్రభువునకు నివేదితమగును. అది పోగుచేయబడదు, ధననిధిలో వేయబడదు. ప్రభువు సన్నిధిన వసించువారు ఆ లాభముతో మంచి భోజనము, ప్రశస్తమైన వస్త్రములు కొనితెచ్చుకొందురు.