అబ్రాము, లోతు వేరుపడుట

1. అబ్రాము భార్యను వెంటబెట్టుకొని తన సర్వస్వముతో ఐగుప్తు దేశమునుండి నేగేబునకు తిరిగి వచ్చెను. లోతు కూడ అతని వెంటవెళ్ళెను.

2. ఇప్పుడు అబ్రాము పశుసంపదతో, వెండి, బంగారములతో తులదూగుచుండెను.

3. విడుదులు చేయుచు అతడు నేగేబునుండి బేతేలునకు వెళ్ళెను. పిదప బేతేలునకు హాయికి నడుమ మొట్టమొదట తాను గుడారములు ఎత్తినచోికి వచ్చెను.

4. అక్కడనే యింతకుముందు అబ్రాము ప్రభువునకు బలిపీఠమును నిర్మించెను. అచ్చటనే దేవుని ఆరాధించెను.

5. లోతు కూడ అబ్రామువెంట ప్రయాణములు చేసెను. అతనికిని గొఱ్టెలు, గొడ్డుగోదలు, గుడారములు కలవు.

6. వారిరువురును కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశుసంపద విరివిగానుండుటచే వారిరువురు కూడి ఒక ప్రదేశమున నివసింపలేక పోయిరి.

7. అదియునుగాక అబ్రాము గొఱ్ఱెలకాపరు లకు, లోతు గొఱ్టెలకాపరులకు నడుమ కలహములు పుట్టెను. ఆ కాలమందు ఆ ప్రదేశమునందే కనానీయు లును, పెరిస్సీయులును నివసించుచుండిరి.

8. అందుచే అబ్రాము లోతుతో ”మనము అయిన వారము, మనలోమనకు జగడములు రాగూడదు. నా గొఱ్టెల కాపరులు, నీ గొఱ్ఱెల కాపరులు క్రుమ్ము లాడుకొనరాదు.

9. కావలసినంత నేల నీముందు న్నది. మనము విడిపోవుటమేలు. నీవు ఎడమ వైపు నకు వెళ్ళిన నేను కుడివైపునకు వెళ్ళెదను. నీవు కుడివైపునకు వెళ్ళిన నేను ఎడమవైపునకు వెళ్ళెదను” అనెను.

10. లోతు కన్నులెత్తిచూచి యోర్దాను మైదా నము మంచి నీివనరులు గలదని కనుగొనెను. సోయరుకు పోవుత్రోవ పొడుగున అది దేవుని తోటవలె, ఐగుప్తుదేశమువలె ఉండెను. దేవుడు సొదొమ, గొమొఱ్ఱాలను నాశనము చేయకమునుపు ఆ ప్రదేశము ఆ విధముగనుండెను.

11. కావున లోతు యోర్దాను మైదానములను కోరుకొని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈరీతిగా వారు విడిపోయిరి.

12. అబ్రాము కనాను దేశమందు నివసించెను. కాని లోతు మైదానమునందలి నగరములలో కాపురము ఉండెను. సొదొమ వద్ద గుడారములు నాటెను.

13. సొదొమ ప్రజలు దుష్టులు, యావేకు విరుద్ధముగా పాపము చేయువారు.

14. లోతు, అబ్రాము విడిపోయిన తరువాత, దేవుడు అబ్రాముతో ”అబ్రామూ! నీవున్న తావునుండి కనులెత్తి నాలుగుదిక్కులు చూడుము.

15. నీ కను చూపుమేర నేలను నీకును, నీ సంతతికిని శాశ్వత ముగా ఇత్తును.

16. భూరేణువులవలె అసంఖ్యాక ముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. భూరేణువుల వలె నీ సంతతియు లెక్కకు అందదు.

17. నీవు లేచి ఈ దేశమునందంతట సంచరింపుము. దీనిని నీకు ఇచ్చుచున్నాను” అనెను.

18. అందుచే అబ్రాము తన పరివారముతో తరలివెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూరవృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు బలిపీఠము నిర్మించెను.

Previous                                                                                                                                                                                                     Next                                                                                

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము