5. ఎడారిలో విడుదులు, లేవీయులు

 తబేరా

11 1. ప్రజలు తమ దురదృష్టమునకు ప్రభువు మీద నిష్ఠూరములాడసాగిరి. ప్రభువు వారి నిష్ఠూర ములు విని కోపించి అగ్నిని పంపగా అది భగభగ మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను.

2. అపుడు ప్రజలు మోషేకు మొరపెట్టగా అతడు ప్రభువును ప్రార్థించెను. మంటలు ఆగిపోయెను.

3. ప్రభువు పంపిన నిప్పులు ప్రజలమధ్య ధగధగ మండినవి కావున ఆ తావునకు తబేరా2 అని పేరు వచ్చినది.

కిబ్రోతుహ్టావా వద్ద ప్రజల నిష్ఠూరోక్తులు

4. యిస్రాయేలీయులతో పయనించు అన్యదేశీ యులకు మాంసముపై కోరికపుట్టెను. యిస్రాయేలీ యులు కూడ మాకు ఇక మాంసము దొరకదుగదా అని నిష్ఠూరోక్తులాడసాగిరి.

5. ”మేము ఐగుప్తులో నుండగా అక్కడ చేపలు విరివిగ లభించెడివి. అచట మేము కడుపార తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికివచ్చుచున్నవి.

6. ఈ ఎడారిలో ఏమియు దొరకక తల్లడిల్లిపోవు చున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కిదప్ప యింకేమి దొరకదుగదా!” అని గొణగుకొనిరి.

7. మన్నా కొత్తిమీరగింజలవలె ఉండెడిది. తెల్లని పసుపువన్నె కలది.

8. ప్రజలు బయికివెళ్ళి దానిని ప్రోగుచేసికొని వచ్చి తిరుగటనో, రోకటనో పిండి చేసెడివారు. ఆ పిండిని పెనముమీద కాల్చి రొట్టెలు చేసికొనెడివారు. అవి ఓలివునూనెతో చేసిన రొట్టెలవలె రుచిగా నుండెడివి.

9. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినపుడు మన్నా కూడ కురిసెడిది.

మోషే ప్రార్థన

10. ప్రజలు వారివారి గుడారముల ముందట నిలుచుండి నిష్ఠూరోక్తులాడుచుండగా మోషే వినెను. ప్రభువు వారిమీద మండిపడుటను చూచి మోషే భయపడెను.

11. అతడు ప్రభువుతో ”ప్రభూ! నీ సేవకుని ఇంతగా బాధపెట్టనేల? నేను నీ అనుగ్రహ మునకు ఏల నోచుకోనైతిని? ఈ ప్రజలను పరా మర్శించు బాధ్యతను నా నెత్తినపెట్టనేల?

12. నేను వీరిని కింనా! ఏమి? పాలుకుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొనిపోవు దాదివలె నేను వీరిని, నీవు పితరులకు వాగ్ధానము చేసిన నేలకు, చేర్పవలెనని నిర్బంధము చేసెదవేల?

13. వీరు గంపెడాశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపార తినెదము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసి నంత మాంసమును నేనెక్కడినుండి కొనిరాగలను?

14. ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించినపని.

15. నీవు నాయెడల ఇంత క్రూరముగా ప్రవర్తించుటకంటె, నా మీద కరుణగలిగి నన్ను చంపివేయుటమేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులార చూడకుందునుగదా!” అని మొరపెట్టెను.

ప్రభువు ప్రత్యుత్తరము

16. ప్రభువు మోషేతో, ”యిస్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను డెబ్బదిమందిని ప్రోగుజేసికొని సమావేశపుగుడారమునకు రమ్ము, వారిని నీ ప్రక్కన నిలుచుండుడని చెప్పుము.

17. నేను నీతో మ్లాడ దిగి వచ్చెదను. నేను నీ ఆత్మను కొంత తీసికొని వారికిచ్చెదను. ఇక మీదట నీతోపాటు వారును ఈ ప్రజలను నడిపింపవలసిన బాధ్యత వహింతురు. నీవొక్కడివే వారి బాధ్యత వహింపవలదు.

18. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము: ”మీరు రేపిదినమునకు శుద్ధిచేసికొని సిద్ధముకండు. రేపు మీరు మాంసము తిందురు. మనము ఐగుప్తున ఎంత సుఖముగానుింమి! ఇట మాంసము దొరకక పోయెనుగదా, అని మీరు ఏడ్చుట ప్రభువు వినెను. ఇకనేమి, మీరు కోరుకొన్నట్లే ప్రభువు మీకు మాంసము నిచ్చును.

19-20. ఒక  రోజుకాదు,  రెండురోజులు కాదు, ఐదు, పది, ఇరువదిరోజులుకాదు, ఒకనెల రోజుల పాటు మీరు మాంసము తిందురు.  మొగము మొత్తువరకు మాంసమును భుజింతురు. మీమధ్య నెలకొనియున్న ప్రభువునుగూడ లెక్కచేయక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితిమని సణుగుకొనుచున్నారు కావున మీకు ఈ శిక్ష కలుగును.”

21. మోషే ప్రభువుతో ”ఇక్కడ ఆరు లక్షలమంది ఉన్నారు. ఇంత మందికి నీవు ఒకనెలకు సరిపడునంత మాంసము ఇచ్చెదనని చెప్పుచున్నావు.

22. గొడ్లమందలను, గొఱ్ఱెమందలను చంపినను వీరికి సరిపోవునా? సముద్రములోని చేపలన్నిని పట్టుకొనివచ్చినను వీరికి సరిపోవునా?” అనెను. 

23. ప్రభువు మోషేతో ”నా బాహువు కురచయైనదా? నేనాడిన మాటలను చెల్లించు కొందునో లేదో నీవే చూచెదవుగాక!” అనెను.

పెద్దలు ఆత్మను పొందుట

24. మోషే వెడలిపోయి ప్రభువుచెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసెను. పెద్దలను డెబ్బదిమందిని ప్రోగుచేసికొని గుడారముచుట్టు నిలబెట్టెను.

25. అపుడు ప్రభువు మేఘముపై దిగివచ్చి మోషేతో మ్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంతతీసికొని ఆ డెబ్బదిమందిపెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. ఆ ఆత్మ వారిపై నిలిచి యున్నపుడు మాత్రమే వారు ప్రవచించిరిగాని మరల వారు ప్రవచింపలేదు.

26. పై డెబ్బదిమంది పెద్దలలో ఎల్దాదు, మేదాదు అనువారు ఇద్దరు శిబిర ముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారిమీదికి గూడ దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి.

27. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరుగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారుకూడ ప్రవచనములు, పలుకుచున్నారని అతనితో చెప్పెను.

28. అపుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచువచ్చిన యెహోషువ ”అయ్యా! వారిని ప్రవచింపవలదని చెప్పుము” అనెను.

29. కాని మోషే అతనితో ”ఓయి! నా యెడలగల అభి మానముచే నీవు వారిమీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికి ఆత్మను అనుగ్రహించి వీరిచే గూడ ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది!” అనెను.

30. అంతట మోషే, పెద్దలు శిబిరమునకు తిరిగిపోయిరి.

పూరేడు పిట్టలు

31. అపుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రమునుండి పూరేడు పిట్టలను తోలుకొనివచ్చెను. అవి నేలకు మూడడుగుల ఎత్తున ఎగురుచు నరులు ఒకరోజు ప్రయాణముచేయునంత దూరమువరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా క్రమ్ముకొనెను.

32. ఆ రోజు పగలు, రాత్రి, మరుసిరోజు పగలు ప్రజలందరు పిట్టలను పట్టుకొనిపోయిరి. ఏబది బుట్టలకు తక్కువగా పట్టుకొనినవాడు ఎవడును లేడు. వారు ఆ పిట్టలను శిబిరము చుట్టు ఎండవేసిరి.

33. కాని జనులు ఆ పకక్షులమాంసమును నోటబెట్టుకొని పింతో కొరికిరో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని గొప్ప తెగులుపాలు చేసెను.

34. కావున ఆ తావునకు కిబ్రోతుహ్టావా3 అనిపేరు. మాంసమును ఆశించి మృత్యువువాతబడిన వారిని అక్కడనే పాతిప్టిెరి.

35. అంతట ప్రజలు అక్కడనుండి కదలి హాసెరోతు చేరి అక్కడ విడిదిచేసిరి.

Previous                                                                                                                                                                                               Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము