నాతాను సందేశము
17 1. దావీదు ప్రాసాదమున వసింప మొదలి డెను. అతడు నాతాను ప్రవక్తతో ”నేను దేవదారు ప్రాసాదమున నివసించుచున్నాను. కాని మందసము మాత్రము గుడారముననే పడియున్నది” అనెను.
2. ఆ మాటలకు నాతాను ”నీవు సంకల్పించుకొన్న కార్యములెల్ల చేయుము. ప్రభువు నీకు బాసటగా నుండును” అని పలికెను.
3-4. కాని ఆ రాత్రియే ప్రభువువాణి నాతానుతో ఇట్లు చెప్పెను: ”నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో నా పలుకులుగా ఇట్లు వినిపింపుము. నేను నివసించు టకు మందిరము నీ చేత కట్టబడదు.
5. యిస్రాయేలీ యులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చినప్పి నుండి నేివరకును నేను మందిరములో నివసింప లేదు. గుడారములందే వసించుచు ఒకచోటు నుండి మరొక చోటుకు కదలుచుింని.
6. యిస్రాయేలీయు లతో నేను చేసిన ప్రయాణములందు నేను ప్రజలకు నాయ కులుగా నియమించిన వారితో మీరు నాకు దేవదారు మందిరమును క్టిపెట్టరైతిరిగదా అని ఎప్పుడైన అంినా? 7. నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకధిపతియు ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు పొలములో గొఱ్ఱెలు కాయుచుండగా నేను నిన్ను పిల్చి నా ప్రజలకు నాయకునిగా నియ మించితిని.
8. నీ దండయాత్రలందెల్ల నీకు తోడై యుింని. నీ శత్రువులనెల్ల రూపుమాపితిని. ఇపుడు ప్రపంచములోని మహానాయకులకు అబ్బిన కీర్తి నీకును దక్కునట్లు చేయుదును.
9. నా ప్రజలైన యిస్రాయేలీయులకొరకు ఒక తావును ఎన్నుకొని వారికచట నివాసమేర్పరచితిని. ఎి్ట బాధలకు గురి కాకుండ వారచట సుఖముగా జీవింతురు.
10. వారు ఈ దేశమున కాలు మోపినప్పినుండియు దుష్టులు వారిని పీడించుచుండిరి. కాని ఇక అటుల జరుగ బోదు. నేను నీ శత్రువులనెల్ల అణగద్రొక్కెదను. నేనే నీకొక మందిరమును1 క్టిపెట్టెదను.
11. నీవు చనిపోయి నీ పితరులను కలసికొనినపుడు నేను నీ సంతానములో ఒకనిని రాజును చేయుదును.
12. నాకు మందిరమును నిర్మించువాడు అతడే. నేనతని రాజవంశము కలకాలము నిల్చునట్లు చేయుదును.
13. నేనతనికి తండ్రినైయుందును. అతడు నాకు తనయుడై యుండును. నీకంటే ముందున్నవాడు నా అనుగ్రహమునకు నోచుకోలేదు కాని ఇతడు నా మన్న నకు పాత్రుడగును.
14. కలకాలము అతడు నా ప్రజలకు, రాజ్యమునకు అధిపతిగానుండును. అతని రాజవంశమునకు అంతమేయుండదు”.
15. నాతాను ప్రభువు తనకు తెలిపిన సంగతు లన్నింని దావీదునకు విన్నవించెను.
దావీదు ప్రార్థనము
16. అంతట దావీదు ప్రభువు గుడారమున ప్రవేశించి ప్రభువు సాన్నిధ్యమున కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. ”ప్రభూ! నీవు నాక్టి ఉపకారములు చేయుటకు నేను ఏపాివాడను? మా కుటుంబము ఏపాిది?
17. ఇంతవరకు నీవు చేసిన ఉపకారములు చాలవో అన్నట్లు భవిష్యత్తులో రానున్న నా వంశస్తు లను కూడ నీవు దీవింతుననుచున్నావు. మనుష్యులు పరస్పరము మ్లాడునట్లు దయతో మాతో మ్లాడి, నా సంతతి ఘనతచెందునని మాటఇచ్చితివి.
18. నీ సేవకుడనైన నన్ను ఇంతగా ఆదరించితివి. నీవు నన్ను బాగుగా ఎరుగుదువు. ఇక నేనేమి విన్నవించు కోగలను!
19. నాకు ఇి్ట మేలుచేయుటయు, భవిష్యత్తులో నాకు సిద్ధింపనున్న ఖ్యాతిని ముందుగా ఎరిగించుటయు నీ అభీష్టము.
20. ప్రభూ! నీ వింవాడెవడును లేడు. నీవుతప్ప మరియొక దైవములేడని మేము వినినది నిజము.
21. నీవు ఐగుప్తునుండి తరలించు కొనివచ్చి నీవారిగా చేసికొనిన యిస్రాయేలువిం జాతి ఈ భూమిమీద మరియొకికలదా? నీవు వారికొరకు చేసిన మహా కార్యములు, భయంకర కృత్యములు నీకు ఖ్యాతి తెచ్చిప్టిెనవి. నీవు ఐగుప్తుదాస్యము నుండి నీ ప్రజలను విడిపించుకొని వచ్చితివి. ఇతర జాతులనెల్ల తరిమివేసి వారికి ఒకతావు కల్పించితివి.
22. ప్రభూ! నీవు యిస్రాయేలీయులను శాశ్వత ముగా నీ ప్రజలను చేసికొింవి. నీవు వారి దేవుడ వైతివి.
23. ప్రభూ! నీవు ఇపుడు ఈ దాసునిగూర్చి ఇతని వంశజులనుగూర్చి చేసిన ప్రమాణములెల్ల నెరవేర్పుము. నీవు చేయుదునన్న కార్యమును చేయుము.
24. ఇట్లు చేసినచో నీ ఖ్యాతి మిన్నంటును. ప్రజ లెల్లరును ఎల్లకాలము సైన్యములకధిపతియైన ప్రభువు యిస్రాయేలునకు దైవమయ్యెనని చెప్పుకొందురు. నీవు నా రాజవంశమును కలకాలము కొనసాగింతువు.
25. నా రాజవంశమును నిలబెట్టుదునని నీవే ఈ దాసునికి ఎరిగించితివి కనుక నేనిపుడు నీ సమక్షమున ఇి్ట ప్రార్థనచేయ సాహసించితిని.
26. ప్రభూ! నీవు నిక్కముగా దేవుడవు. ఈ దాసుని పట్ల దయగలిగి ఇి్ట ప్రమాణము చేసితివి.
27. ప్రభూ! నన్ను కరుణించి నా వంశజులను దీవింపుము. అప్పుడు నా వంశము కలకాలము కొన సాగును. నీవు దీవించినవారు ఎల్లకాలము దీవెనలు పొందుదురు.”