రగూవేలు

7 1. వారు ఎక్బానా నగరమును చేరగనే తోబియా ”నేస్తమా అసరయా! నన్ను వెంటనే రగూవేలు ఇంికి తీసికొని పొమ్ము” అనెను. దేవదూత తోబియాను అతనింకి కొనిపోయెను. వారు వెళ్ళునప్పికి రగూవేలు తన లోగిలి ముంగిట తలుపునొద్ద కూర్చుండి ఉండెను. వారే మొదట రగూవేలును పలుకరించిరి. అతడు ”సోదరులారా! మీకు స్వాగతము” అని చెప్పి వారిని ఇంిలోనికి  తీసికొనిపోయెను.

2. తన భార్య ఎద్నాతో ”చూచితివా! ఈ యువకుడు అచ్చముగా నా జ్ఞాతియైన తోబీతువలె ఉన్నాడు” అనెను. ఆమె అతిధులను ”మీరు ఎచ్చినుండి వచ్చితిరి?” అని ప్రశ్నించెను. వారు ”మేము నఫ్తాలి తెగకు చెందిన వారము. ప్రస్తుతము నీనెవె పట్టణములో ప్రవాసమున ఉన్నవారము” అని చెప్పిరి.

4. ఆమె మరల ”మా దాయాది తోబీతు మీకు తెలియునా? అని ప్రశ్నించెను. వారు ”అతడు మాకు బాగుగా తెలియును” అనిరి.

5. ఆమె ”అతనికి కుశలమేనా?” అని అడుగగా వారు ”అతడు బ్రతికియేయున్నాడు, క్షేమముగానేయున్నాడు” అని చెప్పిరి. తోబియా ”అతడు మా తండ్రియే” అని చెప్పెను.

6. ఆ పలుకులు విని రగూవేలు తాలున లేచి ఆనందభాష్పములతో తోబియాను ముద్దాడెను.

7. అతడు ఆ యువకునితో ”నాయనా! దేవుడు నిన్ను దీవించునుగాక! నీ తండ్రి ఉత్తముడు. అంతి పుణ్య పురుషుడు, అన్ని సత్కార్యములు చేసినవాడు, చూపు కోల్పోవుటెంత దారుణము!” అని పలుకుచు తోబియా మెడమీద చేతులువేసి అతని భుజములమీద వాలి బోరున ఏడ్చెను.

8. అతని భార్య ఎద్నా, కుమార్తె   సారా కూడ తోబీతు దుర్గతిని తలంచుకొని పరిత పించిరి.

9. రగూవేలు అతిధులను హృదయపూర్వ కముగా ఆహ్వానించెను. వారి కొరకు తన మందలలో నుండి ఒక పొట్టేలుని కోయించి విందు సిద్ధము చేయించెను.

అతిథులు స్నానముచేసి భోజనమునకు కూర్చుండ బోవుచుండగా తోబియా ”నేస్తమా అసరయా! నీవు సారాను నాకిచ్చి పెండ్లిచేయుము అని రగూవేలును అడుగవా?” అనెను.

     10. రగూవేలు ప్రక్కనుండి ఆ మాటలు విని తోబియాతో ”నాయనా! మొదట విందారగించి పానీ యము సేవింపుము. ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము. మా అమ్మాయి సారాను పెండ్లియాడుటకు నీవు తప్ప మరెవరును అర్హులుకారు. నీవు మాకు అయినవాడవు. కనుక మా అమ్మాయిని మరియొకరి కిచ్చు అధికారము నాకు లేదు. కాని నేను నీతో నిజము చెప్పవలెను.

11. నేను ఆమెను ఇది వరకే మా బంధువులకు ఏడుగురికి ఇచ్చితిని. వారిలో ఒక్కొ క్కడును తొలిరేయి శోభనపు  గదిలోనికి  ప్రవేశింపగనే హతుడయ్యెను. కాని నాయనా ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము. ప్రభువే మిమ్ము కాపాడును” అని పలికెను. తోబియా ఈ విషయమున నీవు నాకు మాిచ్చినదాకా నేను అన్నపానీయములు ముట్టుకోనని చెప్పెను. రగూవేలు ”సరియే మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీకిత్తును. పరమండలమందలి దేవుడు ఆమెను నీదానిగా నిర్ణయించెను. కనుక నీవు ఆమెను స్వీకరింపవచ్చును. ఇప్పినుండి నీవు ఆమెకు భర్తవు, ఆమె నీకు భార్య. నేినుండి కలకాలము వరకును సారా నీకు ధర్మపత్నిఅగును. ఆకాశమందలిదేవుడు ఈ రేయి మిమ్మిరువురిని కరుణతో కాపాడునుగాక!” అని పలికెను.

12. అంతట రగూవేలు సారాను పిలిపించి ఆ యువతి చేయిపట్టుకొని ఆమెను తోబియా కర్పించెను. ”నేను ఈ పడుచును నీకు అప్పగించు చున్నాను. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవు ఈమెను భార్యగా స్వీకరింపుము. ఈమెను సురక్షిత ముగా మీ యిిింకి కొనిపొమ్ము. ఆకాశాధిపతి అయిన దేవుని అనుగ్రహము వలన మీరిరువురు కలిసి సుఖ ముగా జీవింతురుగాక!” అని పలికెను.

13. అటుపిమ్మట రగూవేలు భార్యను పిలిచి ఒప్పందము వ్రాయుటకు పత్రము తీసికొని రమ్మనెను. ఆమె పత్రము తీసికొని రాగా అతడు మోషే ధర్మశాస్త్రము ఆదేశించినట్లే సారాను తోబియాకు ఇచ్చితినని పెండ్లి ఒడంబడిక వ్రాసెను.

14. అటు తరువాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిరి.

15. రగూవేలు భార్యను పిలిచి ఖాళీగదిని సిద్ధము చేసి సారాను అచ్చికి తీసికొనిపొమ్మని చెప్పెను.

16. ఆమె భర్త చెప్పినట్లే ఆ గదిలో పడక సిద్ధము చేసి సారాను అచికి తోడ్కొనిపోయెను. ఎద్నా కొంచెముసేపు కూతురిమీద వాలి ఏడ్చి కన్నీరు తుడు చుకొనెను.

17. ”తల్లీ! ధైర్యముగా నుండుము. ఆకాశాధిపతియైన దేవుడు ఈ మారు నీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక! నీమట్టుకు నీవు గుండె దిటవు చేసికొనుము” అని చెప్పి తాను గదినుండి వెలుపలికి వచ్చెను.