దావీదు, దేవాలయ ఆరాధనము

రాజుగా దావీదును అభిషేకించుట

11 1. యిస్రాయేలు తెగలన్ని హెబ్రోనున ఉన్న దావీదునొద్దకు వచ్చి ”మేము నీకు ఎముకనింన వారలము, రక్తసంబంధులము.

2. సౌలు పరిపాలనా కాలమునగూడ యుద్ధములందు యిస్రాయేలీయు లను నడిపించినవాడవు నీవే. నీ దేవుడైన ప్రభువు నీవు తన ప్రజలకు నాయకుడవు, ఏలికవు అగుదువని ప్రమాణము చేసెను” అనిరి.

3. ఆ రీతిగా యిస్రా యేలు పెద్దలందరు హెబ్రోనుననున్న దావీదుచెంతకు రాగా అతడు దేవునిసమక్షమున వారితో నిబంధనము చేసికొనెను. వారక్కడ దావీదుని అభిషేకింపగా ప్రభువు సమూవేలు ద్వారా చెప్పినట్లే అతడు యిస్రాయేలీయు లకు రాజయ్యెను.

దావీదు యెరూషలేమును ముట్టడించుట

4. దావీదు యిస్రాయేలీయులతో పోయి యెరూషలేమును ముట్టడించెను. అప్పుడు ఆ నగరము పేరు యెబూసు. ఆ నగరవాసులకు యెబూసీయులని పేరు.

5. వారు దావీదుతో నీవు ఈ నగరమున అడుగుపెట్టజాలవని బింకములాడిరి. కాని దావీదు వారి దుర్గమైన సియోనును పట్టుకొనెను. దానికే తరువాత దావీదునగరమని పేరు వచ్చినది.

6. అందరికంటె ముందుగా యెబూసీయుని చంపిన వానిని సైన్యాధిపతిని చేయుదునని దావీదు పలికెను. సెరూయా పుత్రుడైన యోవాబు పైకెక్కిపోయి యెబూసీ యులను ఎదుర్కొనెను. కనుక అతడు సైన్యాధిపతి అయ్యెను.

7. దావీదు బలమైన ఆ కోటలో నివసింప మొదలిడెను. కనుక దానికి దావీదునగరమని పేరువచ్చెను.

8. అతడు తూర్పువైపున పల్లమును పూడ్చిన మిల్లో అను తావునుండి మొదలుప్టిె ఆ నగరమును పునర్నిర్మించెను. యోవాబు నగరమున మిగిలిన భాగమును బాగుచేయించెను.

9. సైన్యములకధి పతియైన ప్రభువు దావీదునకు బాసటగా నుండెను కనుక అతడు నానాికి మహా బలసంపన్నుడయ్యెను.

దావీదు వీరులు

10. దావీదు వీరుల పేరులివి: యిస్రాయేలీయు లతోపాటు వీరు కూడా దావీదు రాజగుటకు తోడ్పడిరి. అతడు రాజగునని ప్రభువు ముందుగానే ప్రమాణము చేసెను. ఈ వీరులు అతని రాజ్యమును సురక్షితము చేసిరి.

11 హక్మోని వంశమునకు చెందిన యాషొబాము మొదివాడు. ఇతడు ముగ్గురు మహావీరుల జట్టుకు నాయకుడు. మూడువందల మందిని ఒక్కపెట్టున గండ్రగొడ్డలితో నరికిచంపినవాడు ఇతడే.

12. అహోహి వంశమునకు చెందిన దోదో కుమారుడైన ఎలియాసరు రెండవవాడు. ఇతడు ముగ్గురు సుప్రసిద్ధ వీరులలో నొకడు.

13. పస్దమ్మీము యుద్ధమున దావీదు కోపుతీసికొని ఫిలిస్తీయులతో పోరాడినవాడు. ఎలియాసరు యవలు పెరిగిన చేనిలోనుండగా యిస్రా యేలీయులు యుద్ధమునుండి పారిపోజొచ్చిరి.

14. అప్పుడు ఎలియాసరు, అతని అనుచరులు ఆ చేనులోనే ఫిలిస్తీయుల నెదిరించి పోరాడిరి. ఆ పోరున ప్రభువు ఆ వీరునికి గొప్పవిజయమును ప్రసాదించెను.

15. ఒక రోజు ముప్పదిమంది వీరుల జట్టు నుండి ముగ్గురు యోధులు దావీదు వసించు కొండకు వెళ్ళిరి. ఆ రోజులలో దావీదు అదుల్లాము గుహచెంత వసించుచుండెను. అప్పుడు ఫిలిస్తీయుల సైన్యము రెఫాయీము లోయలో మకాము చేయుచుండెను.

16. దావీదు ఒక సురక్షితమైన కొండమీద వసించు చుండగా కొందరు ఫిలిస్తీయులువెళ్ళి బేత్లెహేమును ఆక్రమించుకొనిరి.

17. దావీదు స్వీయనగరము మీద బెంగగొని బేత్లెహేము నగర ద్వారముచెంతనున్న బావినుండి ఎవరైనా గ్రుక్కెడు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చిన ఎంత బాగుండును అని పలికెను.

18. వెంటనే ఆ ముగ్గురు వీరులు ఫిలిస్తీయుల శిబిరము గుండ పోయి బేత్లెహేము బావినుండి నీరు తోడుకొని వచ్చి దావీదున కిచ్చిరి. కాని అతడు ఆ నీిని ముట్టడయ్యెను.

19. దానిని దైవార్పణముగా నేలమీద ధారగాపోసి, ”ప్రభూ! నేను ఈ నీిని త్రాగుదునా? ఈ వీరులు తమ ప్రాణములొడ్డి ఈ జలము గొనివచ్చిరి. నేను దానిని త్రాగినచో వీరి నెత్తుిని త్రాగినట్లే” అని అనెను. కనుక అతడు ఆ పానీయమును ముట్టడయ్యెను. ఈ ముగ్గురు శూరులు చేసిన వీరకృత్యమ్టిది.

20. యోవాబు సోదరుడైన అబీషయి ముప్పది మంది వీరుల జట్టుకు నాయకుడు. అతడు ఈటెను చేప్టి మూడువందల మంది శత్రువులతో పోరాడి వారినందరిని సంహరించెను. ముప్పదిమంది వీరు లలో పేరు తెచ్చుకొనెను.

21. ఆ వీరులందరిలో మొనగాడై వారికి నాయకుడు అయ్యెను. కాని అబీషయి సుప్రసిద్ధులైన ముగ్గురు వీరులకు సాి కాలేకపోయెను.

22. కబ్సీయేలు తెగకు చెందిన యెహోయాదా కుమారుడు బెనాయా ఒక వీరుడు. అతడు చాల వీర కార్యములు చేసెను. ఇద్దరు మోవాబు పరాక్రమ వంతులను కూడ మట్టుపెట్టెను. అతడు మంచుపడిన ఒకానొక దినమున గుంటలోనికి దిగి దానిలోనున్న సింగమును చంపెను.

23. ఇంకను అతడు ఒక ఐగుప్తీయ యోధుని కూడ వధించెను. వాడు ఏడున్నర అడుగుల పైన ఎత్తుగా నుండెడివాడు. వాని చేతిలోని ఈటె సాలెవాని చేతిబద్దవలె నుండెడిది. బెనాయా బడితతోబోయి ఆ ఐగుప్తీయుని మీదబడి వాని చేతిలోని ఈటెను లాగుకొని దానితోనే వానిని పొడిచి చంపెను.

24. ఇి్ట వీరకృత్యములలో బెనాయా ముప్పదిమంది వీరులలో పేరు తెచ్చుకొనెను.

25. అతడు ఆ ముప్పదిమందిలో ప్రసిద్ధుడయ్యెను గాని ముగ్గురు మహావీరులకు మాత్రము సమఉజ్జి కాలేక పోయెను. దావీదు అతనిని తన అంగరక్షకులకు నాయకునిగా నియమించెను.

26-47. మిగిలిన వీరుల పేరులివి:

యోవాబు తమ్ముడు అసాహేలు; దోదో కుమారుడును, బేత్లెహేము వాసియైన ఎల్హానాను; హరోరు నివాసి షమ్మోత్తు; పెలెతు నివాసి హెలెసు; తెకోవా నివాసి యగు ఇక్కేషు తనయుడైన ఈరా; అనాతోతు నివాసియగు అబీయెజెరు; హూషా నివాసి సిబ్బెకాయి; అహోహి నివాసి ఈలయి; నెోఫా నివాసి మహరయి; నెోఫా నివాసియగు బానా తనయుడైన హేలేదు. బెన్యామీనుగిబియా నివాసియగు రీబయి తనయుడైన ఇత్తయి; పిరతోను నివాసి బెనాయా; గాషులోయ నివాసి హూరయి; అర్బా నివాసి అబీయేలు; బహూరీము వాసి అజ్మావెతు; షాల్బోను నివాసి ఎల్యాహ్బా; గీసోను నివాసి హాషేము; హరారు నివాసియగు షాగీ పుత్రుడు  యోనాతాను; హరారు నివాసియగు సాకారు పుత్రుడు అహీయాము; ఊరు కుమారుడు ఎలీఫాలు; మెకెరా నివాసి హేఫేరు; పెలోను నివాసి అహీయా; కర్మెలు నివాసి హెస్రో; ఎస్బయి కుమారుడు నారయి; నాతాను సోదరుడు యోవేలు; హగ్రి కుమారుడు మిబ్హారు; అమ్మోను నివాసి సెలెకు; బేలోతు నివాసి, యోవాబు అంగరక్షకుడు నహరయి; యాత్తీరు నివాసులు ఈరా, గారేబు; హీత్తీయుడైన ఊరియా; అహ్లాయి కుమారుడైన సాబాదు; షీజా తనయుడైన అదీనా. ఇతడు రూబేను తెగలో ప్రముఖుడు, ముప్పదిమంది యోధులకు పెద్ద; మాకా కుమారుడైన హానాను; మీతాను నివాసియగు యెహోషాఫాత్తు; అష్టెరా నివాసియగు ఉజ్జియా; హోతాము కుమారులును అరోయేరు నివాసులగు షమ్మా, యెయీయేలు; షిమ్రీ కుమారులైన తీజు నివాసులు యెదీయేలు, యోహా; మహవా నివాసియైన యెలీయేలు; ఎల్నాము కుమారులైన యెరీబాము, యోషవ్యా; మోవాబు నివాసియైన ఈత్మా; మెసోబాయా ఊరివారైన ఎలీయేలు, ఓబెదు, యాసియేలు.