యోసేపు తనను ఎరుకపరుచుకొనుట

1. యోసేపు  సేవకుల ఎదుట తన భావోద్వేగ మును అణచుకొనజాలకపోయెను. ”మీరందరు నా యెదుటనుండి వెళ్ళిపొండు” అని వారికి ఆనతిచ్చెను. కావున యోసేపు సోదరులకు తన్నుతాను ఎరుక పరుచుకొన్నప్పుడు అక్కడ ఎవరును లేరు.

2. అతడు బిగ్గరగా ఏడ్చెను. ఐగుప్తుదేశీయులు, ఫరోరాజు పరివారము ఆ ఏడుపువినిరి.

3. ”నేనే యోసేపును, నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా?” అని అతడు సోదరులను అడిగినపుడు తమ్ముని గుర్తుప్టిన యోసేపు సోదరులకు నోటమాటరాలేదు. వారతని ప్రశ్నలకు భయపడి వెంటనే బదులు చెప్పలేకపోయిరి.

4. అంతట యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకువచ్చిరి. అతడు వారితో ”మీరు ఐగుప్తుదేశీయులకు అమ్మిన యోసేపును నేనే. మీ సోదరుడను.

5. నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలతచెందవలదు. మీ ప్రాణము లను రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను.

6. దేశములో రెండేండ్లనుండి కరువుఉన్నది. ఇక ఐదేండ్లదాక సేద్యముకాని, కోతలుగాని ఉండవు.

7. మిమ్ము అందరిని ప్రాణములతో కాపాడుటకు మీ బిడ్డలను శేషప్రజలుగా భూమిపై నిలుపుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను.

8. నన్ను ఇక్కడకుపంపినది దేవుడేకాని మీరుకారు. నన్ను ఫరో రాజునకు తండ్రిగాను, అతని ఇంికి సర్వాధికారిగాను, ఐగుప్తుదేశమునకు పాలకునిగాను చేసినవాడు దేవుడే.

9. తొందరగా  తండ్రి దగ్గరకెళ్ళి నా మాటగా ఈ సందేశమును వినిపింపుడు: ‘నీ కుమారుడు యోసేపు ఇట్లనుచున్నాడు. దేవుడు ఐగుప్తుదేశమున కంతికి నన్ను ప్రభువుగా నియమించెను. వెంటనే నా దగ్గరకు రమ్ము. జాగుచేయకుము.

10. గోషెను మండలములో నివసింపుము. నీవు, నీ కొడుకులు, నీ మనుమలు, నీ మందలు, నీ పశువులగుంపులు ఇంత ఏల? నీదన్నదంతయు నా దగ్గర ఉండవచ్చును.

11. ఇంకను ఐదేండ్లదాక కరువు ఉండును. కావున నిన్ను పోషించు భారమునాది. నీకు, నీ జనులకు,  నీ మందలకు ఏ లోటు కలుగనీయను.

12. ఇదిగో మీ కన్నులును, నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నట్లు, మీతో మ్లాడుచున్న యోసేపును నేనే.

13. ఐగుప్తుదేశములో నాకున్న ప్రాభవమును నా తండ్రికి తెలియజేయుడు. మీరు చూచినదంతయు ఆయనకు చెప్పుడు. తొందరగా వెళ్ళి ఆయననిక్కడికి తీసికొనిరండు.”

14. ఇట్లనుచు యోసేపు బెన్యామీను మెడపై మొగము వాల్చి ఏడ్చెను. బెన్యామీనును అట్లే చేసెను.

15. యోసేపు సోదరులందరిని ముద్దాడుచు ఏడ్చెను. తరువాత వారు యోసేపుతో మ్లాడిరి.

ఫరో ఆహ్వానము

16. యోసేపు సోదరులొచ్చిరన్న వార్త ఫరోరాజు ఇంికి ప్రాకెను. అతడు, అతని కొలువువారు సంతసించిరి. 17. ఫరోరాజు యోసేపుతో ఇట్లనెను: ”నీ సోదరులతో నామాటగా చెప్పుము. మీరు చేయ వలసినది ఇది. కావలసినంత గాడిదలమీదికెత్తించు కొని కనాను దేశమునకెళ్ళుడు.

18. మీ తండ్రిని మీ ఇంిల్లపాదిని వెంటబెట్టుకొని నా వద్దకురండు. ఐగుప్తుదేశములో ఉన్న సారవంతమైన భూమిని మీ వశము చేసెదను. ఈ భూసారమును మీరు అను భవింపుడు.

19. ఇంకను నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము. భార్యపిల్లలను కొనివచ్చుటకు ఐగుప్తు దేశమునుండి బండ్లు తోలుకొనిపొండు. మీ తండ్రిని తీసికొనిరండు.

20. మీ ఆస్తిపాస్తులను వదలి వచ్చుటకు బాధపడకుడు. ఐగుప్తుదేశములోని సార వంతమైన భూమి మీవశమగును.”

యోసేపు సోదరులు కనాను వెళ్ళుట

21. యిస్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. ఫరోరాజు ఆజ్ఞననుసరించి యోసేపు వారికి బండ్లు  సిద్ధముచేయించెను. దారి బత్తెములిప్పించెను.

22. వారిలో ఒక్కొక్కరికి ఒకజత మేలిమిదుస్తులను ఇప్పించెను. కాని బెన్యామీనుకు మాత్రము మున్నూరు వెండినాణెములను, ఐదుజతల మేలిమిదుస్తులను ఇచ్చెను.

23. అంతేకాక ఐగుప్తుదేశములో ఉన్న ప్రశస్తవస్తువులను పది గాడిదలపైకెత్తించి తండ్రికి పంపెను. తండ్రి వచ్చునపుడు దారి బత్తెమునకు కావలసిన ధాన్యమును, ఆహారపదార్థములను పది ఆడుగాడిదల మీద పంపెను.

24. త్రోవలో తగవులు  వలదని హెచ్చరించి అతడు సోదరులను సాగనంపెను.

25. ఈ విధముగా వారందరు ఐగుప్తుదేశము నుండి బయలుదేరి కనానుదేశమునందున్న యాకోబు వద్దకు వచ్చిరి.

26. వారు యాకోబుతో ”యోసేపు ఇంకను బ్రతికియేయున్నాడు. ఐగుప్తుదేశమునెల్ల ఏలుచున్నాడు” అని చెప్పిరి. ఆ పలుకులకు యాకోబు నివ్వెరపడెను. వారి మాటలు నమ్మలేకపోయెను.

27. యోసేపు సోదరులు అతడు చెప్పిన మాటలన్నియు తండ్రికి చెప్పిరి. తనను తీసికొనిపోవుటకై యోసేపు పంపిన బండ్లను చూచినపుడు యాకోబు ప్రాణము కుదుటపడెను.

28. యిస్రాయేలు ”ఇకచాలు! నా కుమారుడు యోసేపు బ్రతికియే ఉన్నాడు. ఈ బొందిలో ప్రాణము లుండగనే వెళ్ళి ఒక్కసారి వానిని కన్నులార చూతును” అనెను.

Previous                                                                                                                                                                                                 Next                                                                                       

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము