జాతీయ విలాపము

ఆసాపు కీర్తన

79 1.      దేవా! అన్యజాతి ప్రజలు

                              నీ దేశము మీదికి దండెత్తి వచ్చిరి.

                              వారు నీ పవిత్రమందిరమును

                              అమంగళము చేసిరి.

                              యెరూషలేమును ధ్వంసము చేసిరి.

2.           నీ దాసుల శవములను

               పకక్షులకు ఆహారము కావించిరి.

               నీ భక్తుల ప్రేతములను

               వన్యమృగములకు తిండి గావించిరి.

3.           యెరూషలేమునందంతట

               నెత్తుిని నీివలె ఒలికించిరి.

               పీనుగులను పాతిపెట్టు వాడెవడును లేడయ్యెను.

4.           మా చుట్టుపట్లనున్న అన్యజాతివారు

               మమ్ము అవమానించుచున్నారు.

               మా ఇరుగుపొరుగువారు

               మమ్ము గేలిచేసి నవ్వుచున్నారు.

5.           ప్రభూ! నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమునా? నీ ఆగ్రహము అగ్నివలె

               మండుచుండవలసినదేనా?

6.           నిన్ను ఎరుగని అన్యజాతులమీదను,

               నీకు ప్రార్థనచేయని రాజ్యములమీదను

               నీ కోపమును కుమ్మరింపుము.

7.            ఆ ప్రజలు యాకోబు జనులను సంహరించిరి.

               వారి నివాసమును నాశనము చేసిరి.

8.           మా పూర్వుల పాపములకుగాను

               నీవు మమ్ము శిక్షింపకుము.

               జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము.

               మేము హీనస్థితికి దిగజారిపోయితిమి.

9.           మాకు రక్షకుడవైన దేవా!

               నీ నామ కీర్తికొరకు

               నీవు మాకు సాయము చేయుము.

               నీ కీర్తికొరకు మమ్ము రక్షింపుము.

               మా పాపములు మన్నింపుము.

10.         అన్యజాతి జనులు ”మీ దేవుడు ఏడీ”

               అని మమ్మడుగనేల?

               వారు నీ దాసుల నెత్తురు ఒలికించిరిగాన

               నీవా ప్రజలను శిక్షింపగా

               మేము కన్నులార చూడగోరెదము.

11.           చెరలో ఉన్న వారి నిట్టూర్పులు

               నీకు విన్పించునుగాక!

               నీ మహాబలముతో మృత్యువువాత

               పడనున్నవారిని విడిపింపుము.

12.          అన్యజాతులవలన నీకు కలిగిన      

               అవమానమునకుగాను

               నీవు వారికి ఏడంతలుగా ప్రతీకారము చేయుము

13.          నీ ప్రజలమును, నీ మందయునైన మేము

               నీకు సదా కృతజ్ఞత తెల్పుకొందుము.

               ఎల్లకాలము నిన్ను స్తుతింతుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము