దేవుని మాత్రమే నమ్మవలెను

ప్రధానగాయకునికి యెదూతూను అను రాగము మీద పాడదగిన దావీదు కీర్తన

62 1.      దేవుని యందు మాత్రమే నా ఆత్మ

                              మౌనముగా నిరీక్షించుచున్నది.

                              నాకు రక్షణను ఒసగువాడు ఆయనే.

2.           ఆయన నాకు ఆశ్రయశిల, రక్షణకోట కాగా

               నేనేమాత్రము కలతజెందను.

3.           మీరెల్లరు ఎంతకాలము

               నా ఒక్కని మీదికి దాడిచేయుదురు?

               ఒరిగియున్న గోడవలెను,

               వాలియున్న ప్రాకారమువలెను

               మీరు నన్ను కూలద్రోయజూతురా?

4.           నన్ను పదవీభ్రష్టుని చేయవలెననియే మీ కోరిక,

               కల్లలాడుట మీకు ప్రీతి.

               మీరు బయటకి

               నన్ను ప్రేమించు వారివలె దీవించుచున్నారు.

               లోలోపల మాత్రము నన్ను శపించుచున్నారు.

5.           నా ప్రాణము దేవునియందు మాత్రమే

               మౌనముగా నిరీక్షించుచున్నది.

               ఆయనయందే నా నమ్మకము.

6.           ఆయన నాకు ఆశ్రయశిల, రక్షణకోట కాగా

               నేనెంత మాత్రము కలతచెందను.

7.            నా రక్షణమును, గౌరవమును

               ప్రభువు మీదనే ఆధారపడియున్నవి.

               నాకు బలమైన కోటయు, ఆశ్రయుడును ఆయనే.

8.           జనులారా! మీరెల్లవేళల ప్రభువును నమ్ముడు.

               మీ గోడులు ఆయనకు విన్నవించుకొనుడు.

               మనకు ఆశ్రయనీయుడు ఆయనే.

9.           అల్పులైన నరులు, ఊదిన శ్వాసవింవారు.

               ఉన్నతులైన మానవులందరు భ్రమవింవారు.

               తక్కెడలో ప్టిె తూచినచోవారు పైకి తేలిపోయెదరు,

               ఊదిన శ్వాసము కంటె తేలికగా తూగెదరు.

10.         దౌర్జన్య చర్యల వలన మీరేమియు పొందలేరు.

               దొంగతనము వలన ఏమియు సాధింపజాలరు.

               మీ సంపదలు పెరిగినను మీరు వానిని నమ్మరాదు.

11.           బలమును, ప్రేమయు తనకు చెందినవని

               ప్రభువు ఒకమారు సెలవీయగా

               నేను రెండుమారులు వింని.

12.          ప్రభూ! స్థిరమైన ప్రేమ నీకే చెందును.

               నీవు ప్రతినరుని వాని కార్యములకు

               తగినట్లుగా సంభావింతువు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము