హోషేయ వ్యభిచారిణియైన భార్యను స్వీకరించుట

3 1 ప్రభువు నాతో ”నీవు మరల వెళ్ళి తన ప్రియునితో వ్యభిచరించు ఆ స్త్రీపట్ల ప్రేమచూపుము. యిస్రాయేలీయులు అన్యదైవములను కొలుచుచు, వారికి ఎండినద్రాక్షపండ్ల మోదకములు అర్పింప గోరుచున్నారు. అయినను నేను వారిని ప్రేమించుట మానలేదు. అట్లే నీవును ఆమెను ప్రేమింపవలెను”అని చెప్పెను.

2. కనుక నేను పదునైదు వెండినాణెములను, ఏడుకుంచముల యవధాన్యమును ఇచ్చి ఆమెను కొని తెచ్చుకొింని.

3. నేనామెతో ఇట్లు చెప్పితిని: ”నీవు వేశ్యావృత్తిని, వ్యభిచారమునుమాని చాలకాలము వరకు నా దానివిగా యుండవలెను. నేనును ఆ విధము గనే ఉందును.

4. ఇట్లే యిస్రాయేలీయులు చాలకాలము వరకు రాజుగాని, నాయకుడుగాని, బలులుగాని, పవిత్ర స్మారక స్తంభములుగాని, దైవ చిత్తము నెరుగు ఎఫోదును గాని, గృహదేవతలుగాని లేకుండ జీవింపవలెను.

5. కాని ఆ ప్రజలు మరల తమ ప్రభువైన దేవునిచెంత కును, దావీదువంశజుడైన తమ రాజుచెంతకును అన్వేషణతో తిరిగివత్తురు. అప్పుడు వారు దేవుని మంచితనమును గౌరవింతురు. ఆయనకు భయపడి ఆయన దీవెనలు బడయుదురు.”

Previous                                                                                                                                                                                                 Next