విజయమునకుగాను వందనగీతము
118 1. ప్రభువు మంచివాడు కనుక
ఆయనకు వందనములు అర్పింపుడు.
ఆయన స్థిరమైనకృప కలకాలముండును
2. ”ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును” అని యిస్రాయేలీయులు పలుకుదురుగాక!
3. ”ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును” అని అహరోను వంశజులు పలుకుదురుగాక!
4. ”ఆయన స్థిరమైన కృప కలకాలమునుండును” అని ప్రభువుపట్ల భయభక్తులు
చూపువారు పలుకుదురుగాక!
5. నేను ఇరుకునందుండి ప్రభువునకు మొరప్టిెతిని
ఆయన విశాలస్థలమునందు నాకు బదులిచ్చెను.
6. ప్రభువు నా పక్షమున వుండగా నేను జడియను.
నరమాత్రులు నన్నేమి చేయగలరు?
7. ప్రభువు నా కోపు తీసికొని
నాకు సాయము చేయును.
నేను నా శత్రువులను జయింతును.
8. నరులను నమ్ముటకంటె,
ప్రభువును ఆశ్రయించుట మేలు.
9. రాజులను నమ్ముట కంటె,
ప్రభువును ఆశ్రయించుట మేలు.
10. అన్యజాతి వారు అనేకులు నన్ను చుట్టుమ్టుిరి. కాని ప్రభువు బలముతో
నేను వారిని తుదమ్టుించితిని.
11. వారు నా చుట్టును క్రమ్ముకొనిరి.
కాని ప్రభువు బలముతో
నేను వారిని తుదమ్టుించితిని.
12. వారు కందిరీగలవలె నా చుట్టును ముసురుకొనిరి
ముండ్ల మంటలవలె నా చుట్టును మండిరి.
కాని ప్రభువు బలముతో
నేను వారిని తుదమ్టుించితిని.
13. శత్రువులు నాతో భీకరముగా పోరాడి,
నన్ను పడగొట్టజూచిరి.
కాని ప్రభువు నాకు తోడ్పడెను.
14. నాకు బలమును, ధైర్యమును ఒసగువాడు ప్రభువే
ఆయన నన్ను రక్షించెను.
15. సత్పురుషుల గుడారములనుండి
విన్పించు సంతోషపూరితములైన
విజయనాదములను ఆలింపుడు.
16. ”ప్రభువు తన కుడిహస్తముతో
సాహసకార్యములు చేసెను.
ఆయన తన కుడిహస్తముతో
విజయమును సాధించెను”.
17. నేను చనిపోను, బ్రతికియుండి
ప్రభువుచేసిన కార్యములు ఉగ్గడింతును.
18. ప్రభువు నన్ను నిశితముగా శిక్షించినను
నన్ను మృత్యువువాత పడనీయలేదు.
19. మీరు నాకు నీతిద్వారములు తెరువుడు.
నేను లోపలికి వెళ్ళి,
ప్రభువునకు వందనములు అర్పింతును.
20. ఇది ప్రభువు ద్వారము.
నీతిమంతులు మాత్రమే దీనిగుండ
లోపలికి వెళ్ళవచ్చును.
21. ప్రభూ ! నీవు నా మొరవిని
నాకు విజయమును ఒసగితివి.
కనుక నేను నిన్ను స్తుతింతును.
22. ఇల్లు కట్టువారు పనికిరాదని
నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను.
23. ఇది ప్రభువు చెయిదము.
ఇది మన దృష్టికి విచిత్రముగా నున్నది.
24. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు,
మనము ఉత్సవము చేసికొని ఆనందింతము.
25. ప్రభూ ! మాకు రక్షణ దయచేయుము.
ప్రభూ! మాకు విజయము ప్రసాదింపుము.
26. ప్రభువు పేరిట వచ్చువాడు
దీవెనలు బడయునుగాక!
ప్రభువు మందిరమునుండి
మేము నిన్ను దీవింతుము.
27. ప్రభువు దేవుడు,
ఆయన మనకు వెలుగును ప్రసాదించెను.
మీరు రెమ్మలు చేతబూని ఉత్సవ బలిపశువును
బలిపీఠపు కొమ్ములకు క్టివేయుడు.
28. నీవు నా దేవుడవు,
నేను నీకు వందనములర్పింతును.
నీ మాహాత్మ ్యమును ఉగ్గడింతును.
29. ప్రభువు మంచివాడు కనుక
ఆయనకు వందనములు అర్పింపుడు.
ఆయన స్థిరమైన కృప ఎల్లకాలము ఉండును.