లేవీయులకు పట్టణములు

35 1. మోవాబు మైదానమున యెరికో ఎదుట నున్న యోర్దాను చెంత ప్రభువు మోషేతో 2. ”నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. వారు తమకు లభించిన భాగములనుండి లేవీయులకు కొన్ని పట్టణ ములు, ఆ పట్టణముల చుట్టుప్రక్కలనున్న గడ్డిబీడులు ఈయవలెను.

3. ఈ పట్టణములు లేవీయులకు చెందును. వారు వానియందు నివశించుదురు. గడ్డి బీడులు వారి మందలకు పశువులకు ఉపయోగ పడును.

4. ఈ గడ్డిబీడులు పట్టణప్రాకారము నుండి నలువైపుల వెయ్యిమూరల వరకు వ్యాపించియుండ వలెను.

5. పట్టణముల నలువైపుల రెండు వేల మూరలుండునట్లు కొలువుడు. నగరము నడిమధ్యన ఉండును. పట్టణము, గడ్డిబీడులు కలిసి ఒక చదర ముగా ఏర్పడును.

6. ఎవరైనను పొరపాటున ఇతరు లను హత్య చేసినయెడల పారిపోయి తలదాచుకొనుటకై ఆరు పట్టణములను లేవీయుల అధీనముననుంచుడు. ఇవికాక మరి అదనముగా వారికి నలుబదిరెండు పట్టణములనిండు.

7. కనుక వారికి మొత్తము నలువది యెనిమిది పట్టణములుండును. వీనిలో ప్రతివానికి గడ్డిబీడులు ఉండును.

8. ఆయా తెగల వారు తమకు లభించిన భాగవిస్తృతిని బ్టి లేవీయు లకు ఎక్కువ పట్టణములనో తక్కువ పట్టణములనో ఈయవలెను” అనెను.

ఆశ్రయ పట్టణములు

9. ప్రభువు మోషేతో ”నీవు యిస్రాయేలీయు లతో ఇట్లు చెప్పుము.

10-11. మీరు యోర్దాను దాి కనాను మండలము ప్రవేశించిన తరువాత కొన్ని పట్టణములను ఎన్నుకొనుడు. ఎవరైనను పొరపాటున ఇతరులను హత్యచేసినయెడల ఈ పట్టణములకు పారిపోయి తలదాచుకోవచ్చును.

12. హతుడైనవాని బంధువులు పగదీర్చుకోగోరిన, హంతకుడు ఈ ఆశ్రయ పట్టణములకు పారిపోయి సురక్షితముగా నుండ వచ్చును. సమాజము బహిరంగముగా తీర్పు చెప్పిననే తప్ప హంతకుడిని చంపరాదు.

13-14. యోర్దాను నకు తూర్పువైపున మూడు, కనానున మూడు మొత్తము ఆరుపట్టణములను ఎన్నుకొనుడు.

15. ఇవి యిస్రాయేలీయులకుగాని, మీతో నివసించు అన్యజాతుల వారికిగాని ఆశ్రయపట్టణము లుగా నుండును. ఎవరైనను పొరపాటున ఇతరులను హత్యచేసినయెడల ఈ పట్టణములకు పారిపోయి తలదాచుకొనవచ్చును.

16-18. కాని ఎవడైనను ఇనుముతో లేక రాతితో లేక కొయ్యతో చేసిన ఆయుధములతో ఇతరు లను చంపెనేని అతడు నరహత్యచేసినట్లే. కనుక అతనికి తప్పక మరణశిక్ష విధింపవలెను.

19. హంతను చంపు బాధ్యత హతుడైనవాని దగ్గరి బంధువులది. అతడు కంటబడగనే వారతనిని చంపివేయవలెను.

20-21. ఎవడైనను ఇతరుని ద్వేషించి వానిని పడగ్టొిగాని, వానిమీద ఏమైన పడవేసిగాని, వానిని పిడికిలితో పొడిచిగాని చంపివేసిన అతడు మరణము నకు పాత్రుడగును. హంతను చంపు బాధ్యత హతుడైన వాని దగ్గరి బంధువులది. అతడు కంటబడగనే  వారు అతనిని చంపివేయవలెను.

22. ఎవడైన ఇతరుని ద్వేషింపకయే పొరపాటున వాిని క్రింద పడన్టెిగాని, పైని ఏమైనా వేసిగాని, చంపెననుకొందము 23. లేదా ఎవరైనను పొరపాటున రాతిని విసిరి ఇతరుని చంపెననుకొందము. ఆ చనిపోయినవాడు ఇతనికి శత్రువుకూడా కాదు.

24. ఈ పట్టున సమాజము హంతకు అనుకూలముగా తీర్పు చెప్పవలెను. అంతేకాని హంతమీద పగ దీర్చుకోగోరిన హతుని బంధువులకు అనుకూలముగా తీర్పుచెప్పరాదు.

25. పగతీర్చుకోగోరువారి బారినుండి హంతను రక్షించి అతడు ఆశ్రయపట్టణమున తల దాచుకొనునట్లు చేయునదియు సమాజమే. అపుడు ఆ పట్టణమున ప్రధానయాజకుడుగా పనిచేయునతడు చనిపోవువరకు హంత ఆ నగరముననే ఉండవలెను.

26-27. కాని నరహంత తానాశ్రయించిన పట్టణమును వీడి దాని వెలుపల పగదీర్చుకొనగోరువారి చేతులలో పడెనేని వారతనిని చంపివేసినను, ప్రతిహత్య చేయు వానికి వాని ప్రాణముతీసిన దోషముండదు.

28. హంత తానాశ్రయించిన పట్టణపు ప్రధానయాజకుడు మరణించువరకు ఆ నగరముననే ఉండవలెను. ప్రధానయాజకుని మరణానంతరము అతడు తన ఊరికి మరలిపోవచ్చును.

29. మీరును, మీ సంతతి వారును ఎక్కడ వసించినను ఈ నియమములే చెల్లును.

30. ఎవడైనను ఇతరులను హత్యచేసినయెడల సాకక్షులు సాక్ష్యము చెప్పిన తరువాతగాని అతనిని వధింపరాదు. ఇతడు హత్యచేసెనని ఒక్కడు మాత్రమే సాక్ష్యము చెప్పినచాలదు.

31. హంతకు శిక్ష మరణ దండనమే. అతడు డబ్బును చెల్లించి చావునుండి తప్పించుకోగూడదు.

32. ఈ రీతిగనే ఆశ్రయ పట్టణమున తలదాచుకొనినవాడును డబ్బుచెల్లించి అప్పి ప్రధానయాజకుడు చనిపోకముందే సొంత ఊరికి మరలిపోగూడదు.

33. మీరు ఇట్లుచేసిన మీరు వసించుదేశమును మైలపరచెదరు. రక్తపాతము దేశమును అపవిత్రము చేయును. రక్తపాతమువలన అపవిత్రమైన దేశమును శుద్ధిచేయవలెనన్న రక్త పాతము తప్ప వేరేమార్గములేదు.

34. మీరు వసించు దేశమును మైలపరుపవలదు. ఏలయన ప్రభుడనైన నేను మీనడుమ వసించుచుందును” అనెను.

Previous                                                                                                                                                                                                   Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము