సోమరిపోతు

22 1.      సోమరిపోతు అశుద్ధము సోకిన

                              రాతివిం వాడు.

                              అతని సిగ్గుమాలినతనమును జూచి

                              ఎల్లరు అసహ్యించుకొందురు.

2.           అతడు మల పిండము వింవాడు.

               దానిని చేతిలోనికి దీసికొనినవాడు,

               అసహ్యముతో విసరికొట్టును.

దుష్టసంతానము

3.           పోకిరిబిడ్డకి తండ్రి అనిపించుకొనుట

               అవమానకరము.

               ఆడుబిడ్డ పుట్టుటవలన నష్టమే కలుగును.

4.           తెలివితేటలు కల బాలికకు పెండ్లిఅగును.

               కాని సిగ్గుసెరములేని పిల్ల

               తండ్రియెదపై కుంపి అగును.

5.           పొగరుబోతు పడుచు తండ్రికి,

               మగనికికూడ తలవంపులు తెచ్చును.

               ఆ ఇరువురు ఆమెను చులకన చేయుదురు.

6.           తగని సమయమున పిల్లలకు బుద్ధిచెప్పుట,

               శోకించువారికి సంగీతమును విన్పించుటవలెను

               నిరర్థకమైనది.

               కాని, వారిని మందలించి క్రమశిక్షణను నేర్పుట

               ఎల్లవేళల మంచిది.

విజ్ఞత, మూర్ఖత

7.            మూర్ఖునికి విద్య గరపబూనుట

               పగిలిపోయిన కుండపెంకులను అతికించుటవలె

               గాఢనిద్రలోనున్న వారిని లేపజూచుటవలె

               వ్యర్థమైన కార్యము.

8.           మూర్ఖునికి బోధించుట నిద్రతో తూలువానికి

               బోధించుట వింది.

               అంతయువిన్న పిదప  అతడు నీవేమి చెప్పితివని

               అడుగును.

9.           వినయవిధేయతలతో పెరిగిన పిల్లలను

               జూచినపుడు వారి తల్లిదండ్రులు తక్కువ స్థాయికి

               చెందిన వారు కారని గ్రహింతుము.

10.         పొగరుబోతులుగ, మర్యాదలేనివారుగ

               పెరిగిన పిల్లలు

               గౌరవముగల కుటుంబమునకుగూడ అపకీర్తి తెత్తురు

11.           జ్యోతి ఆరిపోయినది కనుక

               మృతునికొరకు విలపింతుము.

               తెలివి కొరత పడినది కనుక

               మూర్ఖునికొరకు విలపింపవలెను.

12.          మృతునికొరకు ఏడునాళ్ళు విలపింతుము.

               కాని మూర్ఖుడైన మృతుని కొరకు

               వాని జీవితాంతము విలపింపవలెను.

13.          మూర్ఖుని దగ్గరకు వెళ్లవద్దు.

               అతనితో ఎక్కువగా మ్లాడవద్దు.

               అతని దగ్గరకు వెళ్ళినచో నీకు తిప్పలు తప్పవు.

               అతని స్పర్శవలన నీకు కళంకము సోకును.

               వానికి దూరముగానున్నచో

               నీకు మనశ్శాంతి కలుగును.

               వాని మూర్ఖత్వమువలన

               నీవు విసుగు చెందనక్కరలేదు.

14.          సీసము కన్న బరువైనదేమి? 

               నిక్కముగా  మూర్ఖుడే.

15.          ఇసుక, ఉప్పు, ఇనుము బరువు కంటె

               మూర్ఖుని బరువెక్కువ.

16.          భూకంపము వచ్చినను కూలిపోని  విధమున 

               కొయ్యదూలమును ఇంికి అమర్చుదురు.

               అట్లే విజ్ఞానమున శిక్షణనొందిన నరుడు

               ఆపత్కాలమున కూలిపోడు.

17.          చక్కగా ఆలోచించు మేధస్సు,

               చిత్రములు గీసిన నునుపైన గోడవింది.

18.          ప్రహరి గోడమీద పోసిన చిన్నరాళ్ళు,

               పెనుగాలికి నిలువవు.

               అట్లే వెఱ్ఱిమొఱ్ఱి తలపులతో తనకు తానే

               భయపడు మూర్ఖుడు,    

               కష్టమైన సంఘటనములకు తట్టుకొని నిలువజాలడు

స్నేహము

19.          కింకేదైన పొడుచుకొనినచో నీరు కారును.

               అట్లే హృదయమును గాయపరచినచో

               కోపతాపములు కలుగును.

20.        రాయి విసరినచో పకక్షులు ఎగిరిపోవును.

               స్నేహితుని అవమానించినచో చెలిమి చెడిపోవును

21.          నీవు నీ స్నేహితునిమీద కత్తిదూసినను

               నిరాశ పడనక్కరలేదు.

               మరల సఖ్యత కలిగించుకో వచ్చును.

22.        అతనితో ఘర్షణనకు దిగినను

               చింతింపనక్కరలేదు,

               మరల రాజీపడవచ్చును.

               కాని అవమానము, అహంకారము,

               రహస్యములను బయలుపరచుట,

               వెన్నుపోట్లు పొడుచుట అను బుద్దిగలవానిని

               ఏ  మిత్రుడు  సహింపలేడు.

23.        తోివాడు పేదవాడుగనున్నపుడే

               అతనికి నీమీద నమ్మకము కలుగునట్లు

               చేసికొనుము.

               తరువాత అతడు వృద్ధిలోనికి వచ్చినపుడు

               నీవు అతని సిరిని అనుభవింపవచ్చును.

24.         పొగలు, సెగలు నిప్పుమంటలకు సూచనలు. 

               అట్లే పరావమానములు హత్యలకు సూచనలు.

25.         నేను మిత్రునికి ఆశ్రయమిచ్చుటకు వెనుకాడను. అతడు అవసరము కలిగి వచ్చినపుడు

               మొగము తప్పించుకొనను.

26.        ఆ మిత్రుని వలన నాకు కీడు కలిగెనేని,

               ఆ సంగతి తెలిసిన వారెల్ల

               అతనిపట్ల మెలకువతో ప్రవర్తింతురు.

27.         నా నోికి ఎవరైన కావలియుండి విజ్ఞతతో

               నా పెదవులను మూయించిన  ఎంత బాగుండును!

               అప్పుడు నేను తప్పులు చేయకుందును,

               నా జిహ్వ నన్ను నాశనము చేయకుండును.