2 1. అర్తహషస్త పరిపాలనకాలమున ఇరువది యవయేట నీసాను నెలలో ఒకనాడు రాజు భోజనము చేయుచుండగా నేనతనికి ద్రాక్షసారాయము అందించి తిని. అంతకు ముందెన్నడు నేను రాజునెదుట విచార ముగా కన్పించి యెరుగను.
2. కనుక అతడు నన్ను చూచి ”ఓయి, నీ విచారమునకు కారణమేమి? నీకు వ్యాధియేమియున్నట్లు లేదు. కనుక ఏదియో మన స్తాపము నిన్ను పీడించుచుండ వలెను” అనెను. రాజు మాటలకు నేను మిగుల భయపడితిని.
3. నేనతనితో ”ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక! మా పితరులను పాతిప్టిెన నగరము నేలమట్టమై ఉన్నది. దాని ద్వారములు మంటలో కాలి బుగ్గియైపోయినవి. నాకు విచారముకాక మరియేమి కలుగును?” అంిని.
4. రాజు ”ఇప్పుడు నీ కోరికయేమి?” అని నన్ను ప్రశ్నించెను. నేను ఆకాశమునందున్న ప్రభువును ప్రార్ధించితిని.
5. అటుపిమ్మట రాజుతో ”ప్రభువు లవారి చిత్తమైనచో, తమకు నామీద దయప్టుినచో, నన్ను మా పితరులను పాతిప్టిెన యూదాసీమకు వెళ్ళిపోనిండు. మా నగరమును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇండు” అంిని.
6. అప్పుడు రాణి కూడ రాజు ప్రక్కనే కూర్చుండియుండెను. అతడు ”నీ ప్రయాణము ఎన్నాళ్ళు పట్టును? నీవు మరల ఎప్పుడు తిరిగి వత్తువు?” అని నన్ను ప్రశ్నించెను. నేనొక తేదీని నిర్ణ యించి చెప్పగా ప్రభువు నా కోరిక అంగీకరించెను.
7. నేను యూదా దేశమునకు ప్రయాణము చేయు టకు అనుమతి ఈయవలసినదని పశ్చిమ యూఫ్రీసు అధిపతులకు లేఖలు వ్రాసియిండని రాజును వేడు కొింని.
8. మరియు రాజు ఆధీనములోని అరణ్య ములకు అధిపతియైన ఆసాపునకు కూడ లేఖ నొస గుడని అడిగితిని. దేవాలయము ఎదుటనున్న కోట బురుజులకును, నగరప్రాకారద్వారములకును, నేను వసించు గృహమునకును వలసినంత కలపను ఇప్పింపవలసినదని ఆ లేఖలో వ్రాయిరచితిని. ప్రభువు నన్ను కరుణించెను గనుక రాజు నేనడిగినదంతయు దయచేసెను.
9. రాజు కొందరు సైనికులను, రౌతులను నాకు రక్షణగా పంపెను. నేను పశ్చిమ యూఫ్రీసు రాష్ట్రము చేరుకొని అచి పాలకులకు రాజులేఖలను అందించి తిని.
10. కాని హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీ యుడైన తోబియా అను దాసుడును యిస్రాయేలీ యులను ఆదుకొనుటకు ఎవరో వచ్చిరని విని బహు దుఃఖాక్రాంతులైరి.
యెరూషలేము ప్రాకారములు కట్టగోరుట
11. నేను యెరూషలేము చేరుకొని మూడు దినములు అట వసించితిని.
12. నేను మధ్యరాత్రి యందు లేచి కొందరుమిత్రులను తోడుతీసికొని బయలు దేరితిని. ప్రభువు ప్రేరణనుపొంది యెరూషలేమున నేను చేయదలచిన కార్యములున్నవి. కాని వానిని ఇంకను ఎవరితోను చెప్పనైతిని. నేనెక్కిన గాడిద తప్ప మరి ఏ జంతువు మా వెంటరాలేదు.
13. అట్లు రాత్రిబయలుదేరి లోయద్వారము గుండ వెడలి, సర్ప బావిదాి, పేడద్వారము చేరితిని. పోవుచుపోవుచు పడిపోయిన యెరూషలేము ప్రాకారములను, కాలి పోయిన ద్వారములను పరిశీలించిచూచితిని.
14. అటుపిమ్మట జలధారద్వారము వరకును రాజు మడుగు వరకును వెళ్ళితిని. ఆ మీదట నేనెక్కిన గాడిద పోవుటకు దారిలేదు.
15. కనుక ఆ రాత్రి క్రింది లోయలోనికిదిగి గోడను పరిశీలించుచు ముందుకు సాగిపోతిని. ఆ మీదట నేను వచ్చిన త్రోవవెంటనే నడకసాగించి లోయద్వారముగుండనే పట్టణమున ప్రవేశించితిని.
16. నేను ఎక్కడికి వెళ్ళినది ఏమి చేసినది స్థానిక ఉద్యోగులకు తెలియదు. అంతవరకు నేను యూదులతోగాని, యాజకులతోగాని, నాయకు లతోగాని, ఉద్యోగులతోగాని, పనిలో పాల్గొను వారితో గాని ఒక్క మాట గూడ చెప్పలేదు.
17. అటు తరువాత నేను వారితో ”మీరు మనబాధలను గుర్తించితిరిగదా! యెరూషలేము నేలమట్టమయినది. ప్రాకారద్వార ములు అగ్నిజ్వాలలలో ధ్వంసమయినవి. కనుక నగర ప్రాకారములు పునర్నిర్మించి మనకు కలిగిన అవమా నమును తీర్చుకొందము” అంిని.
18. మరియు ప్రభువు నాకు బాసటగా నుండెనని, రాజు గూడ నాకు తోడ్పడెనని నేను చెప్పితిని. నా మాటలు విని వారు కూడ ”రండి, ప్రాకారములు నిర్మింతము” అనిరి. ఆ రీతిగా వారు గోడమీద పనిచేయుటకు తమనుతాము అంకితము చేసికొనిరి.
19. కాని హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీ యుడైన తోబియా అను దాసుడు, అరబ్బీయుడగు గేషెము మా యత్నములను హేళనచేసిరి. మమ్ములను చిన్నచూపుచూచి, ”ఈ పనిని తలపెట్టుటలో మీ భావ మేమి? మీరు రాజుమీద తిరుగుబాటు చేయుట లేదు గదా?”అని వారు అడిగిరి.
20. నేను ”ఆకాశము నందున్న దేవుడే మాకు విజయము ప్రసాదించును. ఆయన దాసులమైన మేము ప్రాకారములు నిర్మింప పూనుకొింమి. కాని యెరూషలేము పునర్నిర్మాణ మున మీకు భాగముగాని, హక్కుగాని ఉండదు. మీ పేరు కూడ స్మరింపబడదు” అని చెప్పితిని.