దేవాలయ ప్రతిష్ఠ
7 1. సొలోమోను ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి బలినైవేద్యములను దహించెను. ప్రభువుతేజస్సు గుడారమును నింపెను.
2. ఆ తేజస్సు వలన యాజకులు దేవాలయమును ప్రవేశింపజాల రైరి.
3. అగ్ని దిగివచ్చుటయు, తేజస్సు దేవాలయ మును నింపుటయు చూచి యిస్రాయేలీయులందరు సాష్టాంగ నమస్కారము చేసి ప్రభువును ఆరాధించి స్తుతించిరి. ”ప్రభువు మంచివాడు. ఆయనకృప కలకాలము వరకు ఉండును” అని స్తుతిచేసిరి.
4. అంతట రాజు, ప్రజలు దేవునికి బలులర్పించిరి.
5. సొలోమోను ఇరువది రెండువేల కోడెలను, లక్ష యిరువదివేల పొట్టేళ్ళను బలియిచ్చెను. ఆ రీతిగా రాజును, ప్రజలును దేవాలయమును ప్రతిష్ఠ చేసిరి.
6. యాజకులు వారివారి స్థానములలో నిలిచి యుండగా లేవీయులు వాద్యములు వాయించుచు ”ఆయన కృప కలకాలము వరకు ఉండును” అని పాటపాడుచు ప్రభువును స్తుతించిరి. ఆ వాద్యములు పూర్వము దావీదు చేయించినవి. ఆ పాటలు కూడ అతడు నియమించినవే. అపుడు ప్రజలెల్లరు నిలు చుండి చూచుచుండగా యాజకులు బాకాలూదిరి.
7. సొలోమోను దేవాలయ ప్రాంగణపు మధ్య భాగమును శుద్ధిచేయించెను. అతడచటనే దహన బలులు, ధాన్యబలులు, సమాధాన బలులలో వేల్చు క్రొవ్వును సమర్పించెను. ఆ రాజు చేయించిన కంచుబలిపీఠము ఈ బలులన్నిని సమర్పించుటకు సరిపోదయ్యెను.
8. సొలోమోను ఏడురోజులపాటు ఉత్సవము చేయించెను. యిస్రాయేలీయులు తండోపతండము లుగా ప్రోగైరి. వారు హమాతునకు పోవు మార్గము నుండి, ఐగుప్తు నదివరకును గల దూరప్రాంతముల నుండి గొప్పసమూహముతో చేరిరి.
9. ఆ ప్రజలు ఏడునాళ్ళు బలిపీఠమునకు ప్రతిష్ఠ చేసిరి. ఏడునాళ్ళు పండుగ చేసికొనిరి. చివరిదినమున ప్రాయశ్చిత్తబలి జరుపుకొనిరి.
10. ఆ మరునాడు ఎనిమిదవనాడు అనగా ఏడవనెల ఇరువదిమూడవదినమున, సొలోమోను ప్రజలను పంపివేసెను. ప్రభువు యిస్రాయేలు ప్రజలకును, దావీదునకును, సొలోమోనుకును చేసిన ఉపకారము లను తలచుకొని జనులెల్లరును సంతసించిరి.
ప్రభువు సొలోమోనునకు దర్శనమిచ్చుట
11. సొలోమోను తాను కోరుకొన్నట్లుగనే దేవాల యమును, రాజప్రాసాదమును క్టి ముగించెను.
12. అంతట ప్రభువు అతనికి రాత్రివేళ దర్శనమిచ్చి ”నేను నీ ప్రార్థనను ఆలించితిని. ఈ దేశమున మీరు నాకు బలులు అర్పించుటకు అంగీకరించితిని.
13-14. నేను వానలు కురియకుండా ఆకాశద్వారములు మూసి వేసినపుడు గాని, దేశమును నాశనము చేయుటకు మిడుతలదండును పంపినప్పుడుగాని, అంటురోగ ములు వ్యాపింపజేసినప్పుడు గాని, ప్రజలు నాకు మొర ప్టిె, తమను తాము తగ్గించుకొని, తమ దుష్కార్య ములను విడనాడుదురేని, ఆకాశమునుండి నేను వారి వేడికోలును ఆలింతును. వారి పాపములను క్షమింతును. వారి దేశమును అభివృద్ధిలోనికి తెత్తును.
15. మీరు ఈ దేవళమున అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడును ఆదరముతో ఆలింతును.
16. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లుగ దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరచితిని. నా కను దృష్టియు, నా మనస్సును ఎల్లవేళల దీనిమీద నుండును.
17-18. నీ తండ్రివలె నీవును చిత్తశుద్ధితో నన్ను సేవింతువేని నా ఆజ్ఞలను పాించి నా విధు లను నెరవేర్తువేని, నేను నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును. నీ వంశజుడొకడు కలకాలము యిస్రాయేలును పరిపాలించునని నేనతనికి బాసచేసితిని.
19. కాని నీవు నా మాట పెడచెవినిబ్టెి, నా ఆజ్ఞలను త్రోసిపుచ్చి అన్యదైవములను ఆరాధింతు వేని నేను మీకిచ్చిన ఈ నేలమీది నుండి యిస్రాయేలీ యులను గిెంవేయుదును.
20. నా నామము నెలకొనియున్న ఈ ఆలయమును నా సాన్నిధ్యము నుండి తొలగింతును. అప్పుడు సకలజాతి జనులు దానిని అపహాస్యాస్పద లోకోక్తిగా వాడుదురు.
21. ప్రసిద్ధినొందిన ఈ ఆలయ మార్గమునబోవు బాట సారులెల్లరు అపుడు దీనిని జూచి విస్తుపోయి ప్రభువు ఈ దేశమును, ఈ దేవాలయమును ఇట్లు ధ్వంసము చేయనేల? అని ప్రశ్నింతురు.
22. ఆ ప్రశ్నకు ప్రజలు ‘యిస్రాయేలీయులు తమ పితరులదేవుని, తమను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన ప్రభువును విడనాడిరి. అన్య దైవములను ఆశ్రయించి వారికి సేవలుచేసిరి. కనుకనే ప్రభువు వీరిని ఈ రీతిగా నాశనము చేసెను’ అని జవాబు చెప్పుదురు” అని పలికెను.