పుణ్యపురుషుని ఆనందము

విశ్రాంతిదినమునకు తగిన కీర్తన – గీతము

92 1.      దేవా! నీకు వందనములు అర్పించుట మంచిది మహోన్నతుడవైన

                              నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు.

2-3. తంత్రీవాద్యములతోను,

               సితారా గానముతోను, వేకువన నీ ప్రేమను,

               రేయి నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్స

4.           ప్రభూ! నీ చెయిదములకుగాను

               నేను ఆనందింతును.

               నీ కార్యములకుగాను

               నేను సంతసముతో పాటలు పాడుదును.

5.           ప్రభూ! నీ కార్యములు ఎంత ఘనమైనవి!

               నీ ఆలోచనలు ఎంత లోతైనవి!

6.           మూర్ఖులు ఈ సంగతిని గుర్తింపజాలరు.

               అజ్ఞానులు ఈ అంశమును గ్రహింపజాలరు.

7.            దుష్టులు కలుపువలె ఎదిగినను,

               దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చినను

               వారెల్లరును వేరంట నాశనమగుదురు.

8.           ప్రభూ! నీవు కలకాలము

               మహోన్నతుడవుగానుందువు.

9.           ప్రభూ! నీ శత్రువులు నశింతురు.

               దుష్కార్యములు చేయువారెల్ల చెల్లాచెదరగుదురు.

10.         అడవిఎద్దు కొమ్మువలె నీవు నాకొమ్ము పైకెత్తితివి.

               క్రొత్తతైలముతో నా చర్మముపై అంితివి.

11.           నేను నా శత్రువుల పతనమును ఆశతీరచూచితిని.

               దుష్టవర్తనుల ఆక్రందనమును వింని.

12.          పుణ్యపురుషులు ఖర్జూరములవలె వృద్ధిజెందుదురు

               లెబానోను దేవదారులవలె ఎదుగుదురు.

13.          వారు దేవునిమందిరమున నాటగా

               చక్కగా ఎదుగు చెట్లవలె ఉందురు.

14.          ముసలితనములోగూడ

               కాయలు కాయుచు నిత్యము

               పచ్చగా కళకళలాడుచుందురు.

15.          ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడనియు,

               నాకు ఆశ్రయదుర్గమైన దేవునియందు

               దోషమేమియు లేదనియు రుజువు చేయుదురు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము