నామాను కుష్ఠము నయమగుట
5 1. సిరియారాజు సైన్యాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజునకు అతడనిన మిక్కిలిగౌరవము. నామాను మహాశూరుడు. కాని కుష్ఠ రోగి.
2. ఒకమారు సిరియనులు యిస్రాయేలు దేశముమీద దాడిచేసి వారి బాలికనొకతెను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి అయ్యెను.
3. ఆమె ఒకనాడు యజమానురాలితో ”మన యజమానుడు సమరియాలోని ప్రవక్తయొద్దకు వెళ్ళిన ఎంత బాగుండునో! ఆ దైవభక్తుడు మన దొర వ్యాధినయము చేయును గదా!” అనెను.
4. నామాను రాజునొద్దకు వెళ్ళి యిస్రాయేలుదేశమునుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను.
5. రాజు అతనితో ”నీవు యిస్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము. నేను అతనికి కమ్మ వ్రాసిచ్చెదను” అని చెప్పెను. కనుక నామాను ముప్పదివేల వెండినాణెములు, ఆరువేల బంగారు కాసులు, పదిజతల పట్టుబట్టలు కానుకగా తీసికొని యిస్రాయేలు దేశమునకు పయనమైవచ్చి రాజునకు కమ్మనందించెను.
6. దానియందు ఇట్లు న్నది ”నా ఉద్యోగియైన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠమును నయము చేయవలసినది.”
7. యిస్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలుచించుకొనెను. కొలువుకాండ్రతో ”వింరా! సిరియారాజు నేనితని కుష్ఠము నయము చేయవలయును అని అనుచున్నాడు. చావునుగాని, బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనాయేమి? అతడు నాతో జగడము పెట్టుకొను టకే ఈ పన్నాగము పన్నె నని స్పష్టమగుటలేదా?” అనెను.
8. కాని రాజు బట్టలు చించుకొన్నాడని విని దైవభక్తుడైన ఎలీషా అతనియొద్దకు కబురుపంపి ”నీవు బట్టలు చించుకోనేల? నామానును నాయొద్దకు పంపుము. యిస్రాయేలు దేశమున ప్రవక్త ఒకడు ఉన్నాడని అతడు గుర్తించును” అని చెప్పెను.
9. నామాను రథములతో, గుఱ్ఱములతో వెడలివచ్చి ఎలీషా ఇంిద్వారము ముందట నిలువగా, 10. ఎలీషా అతనివద్దకు తన సేవకునిపంపి ”నీవు వెళ్ళి యోర్దాను నదిలో ఏడుసార్లు స్నానముచేయుము. నీ శరీరమునకు మరల ఆరోగ్యము చేకూరును” అని చెప్పించెను.
11. కాని ఆ మాటలువిని నామాను ఉగ్రు డయ్యెను. అతడు ”ప్రవక్త వెలుపలికి వచ్చి, నా ఎదుట నిలుచుండి, తన దేవుని ప్రార్థించి, కుష్ఠము సోకిన భాగముపై తనచేయి త్రిప్పి, నా వ్యాధి నయము చేయుననుకొింని.
12. దమస్కు నందలి అబానా, ఫర్పరు నదులు ఈ యిస్రాయేలు నదికంటె గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానముచేసి ఆరోగ్యము పొందలేనా?” అనుచు అచ్చినుండి వెడలిపోజొచ్చెను.
13. అప్పుడు సేవకులలో ఒకడు అతనికి అడ్డుపడి ‘అయ్యా! ప్రవక్త నిన్నేదైన కష్టమైన కార్యము చేయుమని ఆజ్ఞాపించినయెడల నీవు తప్పక చేసియుండెడివాడవే గదా? ఇప్పుడతడు చెప్పినట్లు నదిలో స్నానముచేసి శుద్ధిపొందుట సులభముగాదా?” అనిరి.
14. ఆ మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో ఏడుసార్లు మునిగి స్నానముచేసెను. వెంటనే అతని శరీరము శుద్ధిపొంది పసిబిడ్డ దేహమువలె అయ్యెను.
15. అంతట నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకువచ్చి ”అయ్యా! ఈ భూమి మీద యిస్రాయేలు దేవుడుతప్ప మరియొక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించు కోగోరెదను, చిత్తగింపుము” అనెను.
16. కాని ఎలీషా ”నేను కొలుచు సజీవుడైన యావేతోడు! నీ కానుక లేమియు నాకక్కరలేదు” అనెను. నామాను ఎంత బ్రతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీక రింపలేదు.
17. నామాను ”నీవు నా కానుకను అంగీక రింపవైతివి. ఇచ్చినుండి రెండు కంచరగాడిదలు మోయునంత మ్టినైనను 1 మా దేశమునకు కొని పోనివ్వవా? నేినుండి నేను ప్రభువునకుతప్ప మరియే అన్యదైవములకు బలులుగాని, దహనబలులుగాని సమర్పింపను.
18. మా ప్రభువగు సిరియారాజు రిమ్మోను దేవళమునకు వెళ్ళినపుడు నేనును అతని వెంట పోవలయును. అతడు నా భుజములపై వ్రాలి రిమ్మోనును ఆరాధించునపుడు నేనును ఆ దేవునకు మ్రొక్కవలయును. ఈ ఒక్క కార్యమునకుగాను యావే ప్రభువు నన్ను మన్నించుగాక!” అని పలికెను.
19. ఎలిషా అతనితో ”నీవు నిశ్చింతగా వెళ్ళిరమ్ము” అని చెప్పగా నామాను తన దేశమునకు పయనమయ్యెను.
20. అతడు కొంచెము దూరము పోయెనో లేదో, ఎలీషా సేవకుడు గేహసీ ”యజమానుడు కానుక పుచ్చుకొనకయే ఈ సిరియా సైన్యాధిపతిని పంపి వేసెనుగదా! సజీవుడైన యావే తోడు! నేను అతని వెంట పరుగెత్తి ఏదైన బహుమానమును అడిగి పుచ్చు కొందును” అని తలంచెను.
21. కనుక గేహసీ నామాను వెనువెంట పరుగెత్తెను. నామాను తన వెనుక ఎవరో పరుగెత్తుకొని వచ్చుచున్నారని గమనించి రథము దిగి గేహసీని కలిసికొని ”అందరు క్షేమముగా నున్నారా?” అని ప్రశ్నించెను.
22. గేహసీ ”మేము అందరము కుశలముగనే ఉన్నాము. ఇప్పుడే ఎఫ్రాయీము మన్నెమునందలి ప్రవక్తలసమాజము నుండి ఇరువురు ప్రవక్తలు మా ఇంికి వచ్చిరి. వారికి గాను మూడు వేల వెండినాణెములు, రెండుజతలు పట్టుబట్టలు ఈయవలసినదని మా యజమానుడు నిన్నడుగు చున్నాడు” అని చెప్పెను.
23. నామాను ”అయ్యా! మూడువేలేమి, ఆరువేలనాణెములు గైకొనుము” అని గేహసీని బ్రతిమాలెను. అతడా నాణెములు రెండు సంచులలో పోసెను. ఆ సంచులను, రెండు జతల పట్టుబట్టలను ఇద్దరు సేవకుల నెత్తికెత్తించెను. వారు ఆ కానుకలను మోసికొనుచు గేహసీ ముందు నడచి వచ్చిరి.
24. వారు కొండచెంతకు రాగానే గేహసీ ఆ సంచులను తన ఇంటచేర్చుకొని నామాను సేవకులను పంపివేసెను.
25. తరువాత గేహసీ ఎలీషావద్దకు వెళ్ళెను. ప్రవక్త ”ఓయి! నీవెక్కడికి వెళ్ళితివి?” అని అతని నడిగెను. గేహసీ ”నేనెక్కడికిని వెళ్ళలేదు” అనెను.
26. కాని ఎలీషా ”అతడు రథముదిగి నిన్ను కలసి కొని నపుడు నా మనసు నీతో రాలేదనుకొింవా? డబ్బు, ఉడుపులు, ఓలివుతోటలు, ద్రాక్షతోటలు, గొఱ్ఱెల మందలు, గొడ్లమందలు, దాసదాసీజనములు కాను కగా స్వీకరించుటకు ఇది అదననుకొింవా?
27. నామానునకు సోకిన కుష్ఠము తరతరముల వరకు నిన్నును నీ వంశీయులను ప్టి పీడించునుగాక!” అని పలికెను. గేహసీ యజమానుని ఇంినుండి వెలుపలికి వచ్చునప్పికి కుష్ఠముసోకగా అతని ఒడలు మంచు వలె తెల్లనయ్యెను.