విజ్ఞానమను స్త్రీ మూర్తి

8 1.        అదిగో! విజ్ఞానము పిలుచుచున్నది.

                              వివేకము ఆహ్వానించుచున్నది.

2. కొండమీదను, వీధిలోను,

               నాలుగుత్రోవలు కలియుచోటను,

3. నగరద్వారములచెంతను,         

               రచ్చపట్టులలోను  నిలుచుండి విజ్ఞానమిట్లనును:

4. ”నరులారా! నేను మిమ్ము ఆహ్వానించుచున్నాను. నేలమీద జనులందరికి విజ్ఞప్తి చేయుచున్నాను.

5. అజ్ఞానులారా! మీరు విజ్ఞానమునెరుగుడు.

               మందమతులారా!

               మీరు వివేకమును అలవరచుకొనుడు.

6. నేను ఉదాత్త సత్యములను బోధింతును.

               నా పెదవులనుండి సత్యవాక్కులే వెలువడును.

7. నేను నిజము చెప్పుదానను.

               కల్లలాడుట నాకు గిట్టదు.

8.           నా పలుకులన్నియు సత్యములు.

               అబద్ధములు, వక్రభాషణములు నా నోి వెంటరావు

9.           తెలివి కలవానికి నా పలుకులు తేటతెల్లములు. జ్ఞానము కలవానికి నా మాటలు సుబోధకములు.

10.         మీరు వెండిని విడనాడి

               నా ఉపదేశమును అంగీకరింపుడు.

               మేలిమి బంగారమును వదలుకొని

               విజ్ఞానమును బడయుడు.

11.           విజ్ఞానమునైన నేను ముత్తెముకంటెను

               మెరుగైన దానను.

               నాతో సరిసమానమైనదేదియు మీకు లభింపదు.

విజ్ఞానము రాజులను నడిపించును

12.          విజ్ఞానమునైన నాకు వివేకము కలదు.

               మంచిచెడ్డలు విచారించు విచక్షణశక్తి కలదు.

13.          దేవునిపట్ల భయభక్తులు చూపుటయనగా

               దుష్టత్వమును అసహ్యించుకొనుటయే.

               అహంకారము, తననుతాను గొప్పగా ఎంచుకొనుట

               దుర్మార్గపు పనులు, బొంకులు నాకు గిట్టవు.

14.          హితోపదేశము, మంచి చెడ్డలు

               ఎరుగు శక్తి నా సొమ్ము.

               తెలివితేటలు, బలము నాసొత్తు.

15.          నా సహాయముతో ప్రభువులు చక్కగా పాలింతురు

               రాజులు న్యాయసమ్మతమైన

               విధులను నెలకొల్పుదురు.

16.          లోకములో ప్రతి పాలకుడును

               నా సాయముతోనే పాలించును.

               రాజనీతిజ్ఞులు, అధికారులు

               నా తోడ్పాటుతోనే ఏలుదురు.

17.          నన్ను ప్రేమించువారిని నేను ప్రేమింతును.

               నన్ను వెదకువారికి నేను దొరకుదును.      

18.          నావద్ద భోగభాగ్యములు, కీర్తిప్రతిష్ఠలు,

               అక్షయసంపదలు నీతిన్యాయములు కలవు.

19.          మేలిమి బంగారముకంటెను,

               మెరుగైన వెండికంటెను

               నేనొసగు ఫలములు మిన్నయైనవి.

20.        నేను ధర్మపథమున నడతును.

               న్యాయమార్గమున సంచరింతును.

21.          నన్ను ప్రేమించువారిని

               నేను సంపన్నులను చేయుదును.

               వారి కోశములను సంపదలతో నింపుదును.

విజ్ఞానము సృష్టి చేయును

22.        ప్రభువు నన్ను ప్రప్రథమమున కలిగియుండెను. తాను పూర్వమే కలిగించిన వానియన్నిలో

               నన్ను మొదిదానినిగా కలిగియుండెను.

23.        ఆయన అనాదికాలమున, పుడమికంటెను

               ముందుగా నన్ను నియమించెను.  

24.         నేను నియమింపబడినప్పుడు జలనిధులు లేవు.

               నీరములు, ఉబుకు నీిబుగ్గలును లేవు.

25.        పర్వతములు రూపొందకమునుపే,

               తిప్పలు నెలకొనకముందే

               నేను ఆవిష్కరించబడితిని.

26.        ప్రభువు భూమిని, మైదానములను

               చేయకముందే ప్రథమ భూరేణువులను

               కలిగింపకమునుపే నేను ఉంిని.  

27.         ఆయన అంతరిక్షమును నిర్మించినపుడు,

               సముద్రమునకు సముద్రమునకు

               చెలియలి కట్టను చ్టుినపుడు,

28.        ఆకాశమున మేఘములను పాదుకొల్పినపుడు,

               సముద్రగర్భమున చెలమలను నెలకొల్పినపుడు,

29.        జలమునకు ఎల్లలు నిర్మించి

               నీళ్ళు తన ఆజ్ఞమీరి

               పొంగిపొర్లకూడదని శాసించినపుడు,

               భూమికి పునాదులెత్తినపుడు నేనుింని.

30.        నేను ప్రధానశిల్పినై ఆయనచెంత నిలిచియుింని.

               నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుింని

31.          ఆయన చేసిన పుడమిమీద క్రీడించుచు

               ప్రమోదముతో మానవాళిమధ్య మనుచుింని.

ఆహ్వానము

32.        కనుక కుమారులారా! నా పలుకు లాలింపుడు.

               నా విధానములు పాించువాడు

               సుఖములు బడయును.

33.        మీరు నా హితోపదేశము ఆలించి

               విజ్ఞానము అలవరచుకొనుడు.

               ఆ విజ్ఞానమును అనాదరము చేయకుడు.

34.         నా ఉపదేశములను వినువాడు,

               ప్రతిదినము నా ఇంి గుమ్మములచెంత

               కాచుకొనియుండువాడు,

               నా గృహద్వారములచెంత వేచియుండెడివాడు,

               సుఖములు బడయును.

35.        నన్ను సంపాదించినవానికి జీవనమబ్బును.

               అతడు ప్రభువు అనుగ్రహమునకు నోచుకొనును.

36.        నన్ను సంపాదింపనివానికి కీడువాిల్లును.

               నన్ను అనాదరము చేయువాడు

               మృత్యువువాతబడును.