స్తుతి గీతము

దావీదు కీర్తన

138 1.    ఓ ప్రభూ! నేను నీకు

                              హృదయ పూర్వకముగా

                              వందనములు అర్పింతును.

                              దైవముల ముందట నిన్ను కీర్తింతును.

2.           నీ కృపను, విశ్వసనీయతను చూచి

               నీ పవిత్రమందిరమువైపు మరలి,

               శిరమువంచి నీకు వందనములు అర్పింతును.

               నీ నామమును, నీ ఆజ్ఞలును

               అన్నికంటెను ముఖ్యమైనవి.

3.           నేను మొరపెట్టగా

               నీవు నా వేడికోలును ఆలించితివి.

               నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి.

4.           ప్రభూ! లోకములోని రాజులెల్ల

               నీకు వందనములు అర్పింతురు.

               వారు నీవు సెలవిచ్చిన మాటలను వినియున్నారు.

5.           వారు నీ కార్యములను,

               నీ మహామహిమను కొనియాడుదురు.

6.           మహోన్నతస్థానమునుండియు

               నీవు దీనులను గమనింతువు.

               దూరమునుండియు గర్వాత్ములను పరికింతువు.

7.            నేను కష్టములలో చిక్కుకొనినపుడు

               నీవు నన్ను కాచి కాపాడుదువు.

               ఆగ్రహపూరితులైన నా విరోధులను

               ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు.

8.           నీవు ప్రమాణము చేసినదెల్ల చేసితీరుదువు.

               నీ కృప శాశ్వతమైనది.

               నీవు చేప్టిన పనిని సంపూర్ణము చేయుము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము