ప్రభువు సేవకుని గూర్చిన
రెండవగీతము
49 1. ద్వీపములారా! నా మాటవినుడు.
దూరప్రాంతపు జాతులారా!
నా పలుకు లాలింపుడు.
నేను తల్లికడుపున పడినప్పినుండియు
ప్రభువు నన్ను పిలిచి,
నా నామమును జ్ఞాపకము చేసికొనెను.
2. ఆయన నాకు పదునైన కత్తివింవాక్కు నొసగెను.
తన హస్తముతో నన్ను రక్షించెను.
నన్ను వాడియైన బాణముగా చేసి
వాడుకొనుటకుగాను
తన అంబులపొదిలో దాచెను.
3. ఆయన నాతో ”యిస్రాయేలూ!
నీవు నాకు సేవకుడవు.
నీ వలన నాకు కీర్తికలుగును” అని చెప్పెను.
4. నేను నిరర్థకముగా శ్రమపడితిని.
నా బలమునంతిని వినియోగించినను
ఫలితము సాధింపజాలనైతినని నేననుకొింని.
కాని ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును.
నా కృషికిగాను నన్ను బహూకరించును.
5. నన్ను మాతృగర్భమున రూపించిన
ప్రభువు ఇట్లు సెలవిచ్చెను
యాకోబును తనవద్దకు కొనివచ్చుటకును,
యిస్రాయేలును తన చెంతకుచేర్చుటకును
ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను.
ప్రభువు నాకు కీర్తిని దయచేసెను.
నా బలమునకు కారకుడు ఆయనే.
6. ప్రభువు నాతో ఇట్లు అనెను:
”నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను,
యిస్రాయేలున మిగిలినవారిని
నాయొద్దకు తీసికొనివచ్చుట మాత్రమే చాలదు,
నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును.
అప్పుడు నా రక్షణము
నేల అంచులవరకు వ్యాపించును.”
యిస్రాయేలు మరలివచ్చుట
అద్భుత సంఘటనము
7. జనులు చిన్నచూపు చూచినవానికి,
జాతులు అసహ్యించు కొనినవానికి,
రాజులకు బానిసయైనవానికి,
యిస్రాయేలును రక్షించువాడును,
వారి పవిత్రదేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:
”రాజులు నిన్ను చూచి
గౌరవసూచకముగా నిలుచుందురు.
పాలకులు నీ ముందట శిరమువంతురు.
ప్రభువు తనమాట నిలబెట్టుకొనును గనుకను
యిస్రాయేలు పవిత్రదేవుడు
నిన్నెన్నుకొనెను గనుకను ఈ కార్యము జరుగును.
8. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
”నేను నిన్ను కరుణించు సమయము వచ్చినపుడు నీ మొరవిందును.
నిన్ను రక్షించు దినము వచ్చునప్పుడు,
నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసికొందును. ఇపుడు బీడువడియున్న నేలమీద
నీకు మరల పునరావాసము కల్పింతును.
9. నేను బందీలతో ‘మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు’
అని చెప్పుదును.
చీకిలో ఉన్నవారితో
‘మీరు వెలుగులోనికిరండు’
అని పలుకుదును.
వారు గొఱ్ఱెలమందవలె
మార్గము ప్రక్కన మేయుదురు.
కొండలమీది పచ్చికను తిందురు.
10. వారికి ఆకలిదప్పులు కలుగవు.
సూర్యతాపము వారిని బాధింపదు.
వారిమీద నెనరుగలవాడే వారిని నడిపించును.
ఆయన వారిని నీిబుగ్గల వద్దకు గొనిపోవును.
11. నేను కొండలగుండ మార్గము వేయుదును.
రాజపథమును సిద్ధము చేయుదును.
12. నా జనులలో కొందరు దూరమునుండి వత్తురు.
కొందరు ఉత్తరమునుండియు,
పడమి నుండియు వత్తురు.
మరికొందరు సీనీము దేశమునుండి వత్తురు.”
13. ఆకసమా! ఆనందనాదము చేయుము.
భూమీ! సంతసింపుము.
పర్వతములారా! సంతోషముతో పాడుడు.
ప్రభువు తన ప్రజలను ఓదార్చును.
బాధలకు గురియైన
తన జనుల మీద జాలిజూపును.
14. ”ప్రభువు నన్ను పరిత్యజించెను,
నన్ను విస్మరించెను” అని సియోను పలికెను.
15. స్త్రీ తన గర్భమున ప్టుిన
పసికందును మరచిపోవునా?
తన ప్రేవునబ్టుిన బిడ్డమీద
జాలి చూపకుండునా?
ఆమె తన శిశువును మరచినను,
నేను మాత్రము నిన్ను మరువను.
16. నేను నీపేరు నా అరచేతులమీద చెక్కుకొింని. నీ ప్రాకారములు నిత్యము
నా కన్నులఎదుట నిలిచియున్నవి.
17. నిన్ను పునర్నిర్మించువారు శీఘ్రమే వత్తురు.
నిన్ను ధ్వంసముచేసినవారు వెళ్ళిపోవుదురు.
18. అదిగో, కన్నులెత్తి చూడుము.
నీ ప్రజలెల్లరును ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు.
ప్రభుడనైన నేను
నా జీవము మీదుగా బాసచేసి చెప్పుచున్నాను.
నీవు ఆ ప్రజలను ఆభరణమువలె ధరింతువు.
వారు నీకు అలంకారముకాగా
నీవు వధువువలె నొప్పుదువు.
19. ”నీ దేశము నాశనమై పాడువడెను.
అది ఇప్పుడు
నీ యందు వసింపబోవువారికి సరిపోదు.
నిన్ను శిథిలము కావించినవారు
నీకు దూరముగానుందురు.
20. ప్రవాసమున నీకు ప్టుినబిడ్డలు
నీతో ఈ స్థలము మాకు చాలదు,
మాకు ఎక్కువనేల కావలయును
అని చెప్పుదురు.
21. అప్పుడు నీవు ఈ బిడ్డలందరిని
నాకెవరు ప్టుించిరి? నా బిడ్డలు గతించిరి,
నేనిక పిల్లలను కనజాలనైతిని,
నన్ను ప్రవాసమునకు న్టెివేసిరి.
ఈ బిడ్డల నెవరుపెంచిరి?
నేను ఒంటరిదాననైతిని. మరి
ఈ బిడ్డలెచినుండి వచ్చిరి? అని తలంతువు.
22. దేవుడైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
”నేను జాతులను పిలుతును.
జెండాఎత్తి వారిని రప్పింతును.
వారు నీ పుత్రులను తమచేతులతో
మోసికొని వత్తురు.
నీ కుమార్తెలను భుజములమీద
మోసికొని వత్తురు.
23. రాజులు మీకు పెంపుడు తండ్రులగుదురు.
రాణులు మీకు దాదులగుదురు.
వారు మీ ముంద సాగిలపడి
మీ పాదములమీది ధూళిని ముద్దిడుకొందురు.
అపుడు మీరు నేను ప్రభుడననియు,
నన్ను నమ్మినవారు
భంగపాటు చెందరనియు గుర్తింతురు.
24. సైనికులనుండి కొల్లసొమ్మును దోచుకోవచ్చునా?
క్రూరుడైన నియంతనుండి
బందీలను విడిపింపవచ్చునా?
25. కాని ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
”సైనికులనుండి బందీలను విడిపింపవచ్చును.
క్రూరుడైన నియంతనుండి
కొల్లసొమ్ము దోచుకోవచ్చును.
మిమ్మెదిరించు వారిని నేను ఎదిరింతును.
నేను మీ బిడ్డలను రక్షింతును.
26. మిమ్ము పీడించువారు
ఒకరినొకరు చంపి తిందురు.
ఒకరినెత్తురొకరు
మద్యమువలె త్రాగి మత్తులగుదురు.
అప్పుడు ప్రభుడనైన నేనే మీకు రక్షకుడననియు,
బలాఢ్యుడననియు,
యాకోబు దేవుడనగు నేనే
మీకు విమోచకుడననియు
జనులెల్లరును గ్రహింతురు.”