పరిశిష్టము కరువు, సౌలువంశీయులు బలియగుట
21 1. దావీదు పరిపాలన కాలమున మూడేండ్ల పాటు కాటకము సంభవించెను. దావీదు ప్రభువును సంప్రదించెను. అందుకు ప్రభువు ”సౌలు, అతని కుటుంబమువారు గిబియోనీయులను వధించి పాపము కట్టుకొనిరి. ఆ పాపము మిమ్ము వేధించుచున్నది” అని వక్కాణించెను.
2. గిబియోనీయులు యిస్రాయేలీ యుల సంబంధులుకారు. అమోరీయుల జాతిలో శేషించినవారు. వీరిని రక్షింతుమని యిస్రాయేలీ యులు మొదట బాసచేసిరి. కాని సౌలు యూదా, యిస్రాయేలీయులయందు ఆసక్తి గలవాడై గిబియోనీ యులను రూపుమాపనెంచెను.
3. కనుక రాజు గిబియోనీయులను పిలువనంపి ”నన్నిపుడేమి చేయ మందురు? కోపము చల్లారి మరల మీరు ఈ యిస్రా యేలీయులను దీవింపవలెనన్న నేనేమి ప్రాయశ్చిత్తము చేసికొనవలయునో చెప్పుడు” అని అడిగెను. 4. గిబియోనీయులు ”అయ్యా! సౌలు కుటుంబము వారికి, మాకు వెండిబంగారములతో సమస్య పరిష్కారము కాదు. ఈ యిస్రాయేలీయులను మా కొరకు బలిపెట్టవలయునని మేము కోరుకొనము” అనిరి. రాజు ”అటులయిన నన్నేమిచేయుమందురో చెప్పుడు. మీ కోరిక తప్పక తీర్చెదను” అని పలికెను.
5. వారతనితో ”మమ్ము యిస్రాయేలు నేలపై నుండి తుడిచివేయవలెనని మమ్ము సర్వనాశనము చేయుటకు పాల్పడినవాడే మాకు జవాబుదారి కావలయును.
6. కనుక అతని సంతతివారిని ఏడుగురిని మాకు ప్టి యిమ్ము. వారిని మాత్రము యావే ఎన్నుకొనిన గిబియా పట్టణములో యావే సన్నిధిని మేము ఉరి తీసెదము” అని అనిరి. దావీదు ”సరియే, ఆ ఏడుగు రిని మీకు అప్పగింతును” అనెను.
7. అతడు యావే ఎదుట యోనాతానుతో చేసికొనిన ఒడంబడికను అనుసరించి యోనాతాను పుత్రుడును, సౌలు మనుమ డును అయిన మెఫీబోషెతును వదలివేసెను.
8. కాని అతడు అయ్యా పుత్రిక రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులు ఆర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మేరబు మహోలతీయుడును బర్సిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు పుత్రులను గిబియోనీ యుల వశము చేసెను.
9. గిబియోనీయులు వారిని కొండ మీద యావేఎదుట బలిఇచ్చిరి. ఆ ఏడుగురు ఒక్కుమ్మడి గనే ప్రాణములు విడిచిరి. పంటకారు తొలినాళ్ళలో, యవధాన్యము కోతకు వచ్చియున్నపుడు వారిని యావేకు బలిఇచ్చిరి.
10. యవపంట కోయు కాలము నుండి వానలు కురిసి శవములను తడుపు నాివరకు అయ్యా పుత్రికయగు రిస్పా గోనెపట్ట పరచుకొని కొండమీద కాపు ఉండెను. ఆమె పగిపూట ఆకాశపకక్షులనుగాని, రాత్రివేళ అడవి మృగములను గాని శవముల మీదికి రానీయలేదు.
11. అయ్యా పుత్రిక, సౌలు ఉంపుడుగత్తెయునగు రిస్పా యీ రీతిగా శవములకు కావలికాయుచుండెనని దావీదు వినెను.
12. అతడు యాబేషు గిలాదు నాయకులనుండి సౌలు యోనాతానుల అస్థికలను కొనివచ్చెను. ఫిలిస్తీయులు సౌలును గిల్బోవా యుద్ధమున ఓడించినపుడు శత్రువుల మృతదేహములను బేత్‌షాను వీధిలో వ్రేలాడగ్టిరి గదా! గిలాదు పౌరులు ఆ దేహములను దొంగలించు కొనివచ్చిరి.
13-14. దావీదు తాను కొనివచ్చిన సౌలు యెెూనాతానుల అస్థికలను కొండపై బలియైన వారి ఎముకలతో చేర్చి వానినన్నింని బెన్యామీను మండల మున సేలా నగరముననున్న సౌలు తండ్రి కీషు సమాధిలో పూడ్పించెను. రాజు ఆజ్ఞాపించినట్లే సర్వ కార్యములు నిర్వహింపబడెను. అటుపిమ్మట ప్రభువు ప్రజలమొర ఆలించి దేశమున వానలు కురిపించెను.
ఫిలిస్తీయులపై దాడి
15. ఫిలిస్తీయులు మరల యిస్రాయేలీయులపైకి దండెత్తివచ్చిరి. దావీదు తన సేవకులతో పోయి గోబు వద్ద గుడారు పన్ని ఫిలిస్తీయులతో పోరాడెను. అతడు పోరున అలసిపడిపోయెను. ఆ రోజులలో రాఫా వంశీయుడగు 16.ఈష్బిబెనోబు అను ఫిలిస్తీయుడు మొనగాడయ్యెను. అతని యీటె మూడువందల తులముల ఇత్తడితో చేసినది. అతడు క్రొత్త కత్తి ఒకి చేప్టి దావీదును చంపెదనని విఱ్ఱవీగుచు వచ్చెను.
17. కాని సెరూయా పుత్రుడు అబీషయి దావీదు తరపున పోరాడి ఫిలిస్తీయుని గెలిచెను. నాడు దావీదు అనుచరులు ”నీవిక మాతో యుద్ధమునకు రాదగదు. యిస్రాయేలీయుల దీపము ఆరిపోరాదు’ అని ఆన ప్టిెరి.
18. అటుపిమ్మట ఫిలిస్తీయులు మరల చెలరేగి గోబు వద్ద పోరు మొదలిడిరి. హూషా నివాసి సిబేకాయి, రాఫా వంశీయుడు సఫును మట్టుప్టిెనది ఈ యుద్ధముననే.
19. ఫిలిస్తీయులు మరల కయ్యమునకు కాలు దువ్వి గోబు వద్ద పోరు ప్రారంభించిరి. బేత్లేహేము వాసియగు యాయీరు పుత్రుడు ఎల్షానాను, గాతు నివాసియగు గొల్యాతును వధించినది ఈ యుద్ధము ననే. ఆ గొల్యాతు ఈటె సాలెవాని చాపు బద్దవలె ఉండెడిది.
20. గాతు వద్ద మరియొక పోరు జరిగెను. అచట ఆజానుబాహుడైన ఫిలిస్తీయుడు ఒకడుండెను. అతని కాలు సేతులకు ఒక్కొక్క దానికి ఆరేసి వ్రేళ్ళ చొప్పున ఇరువదినాలుగు వ్రేళ్ళుకలవు. వీడును రాఫా వంశీయుడే.
21. ఈ ఫిలిస్తీయుడు యిస్రాయేలీయు లను సవాలు చేయగా దావీదు సోదరుడు షిమ్యా పుత్రుడు యోనాతాను వానిని వధించెను.
22. ఈ నలుగురు గాతు నివాసియైన రాఫా వంశీయులు. దావీదు, అతని అనుచరులు వీరిని హతమార్చిరి.